వైసీపీలో ఉన్న అంతర్గత విబేధాలకు చంద్రబాబుకి ఏమిటి సంబంధం?

248

– రఘురామకృష్ణంరాజుకి ఎంపీ టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబు జగన్ తోచెప్పాడా?
– వైసీపీఎంపీలు అరెస్ట్ అయ్యి జైలుకు వెళితే, వారి భార్యాపిల్లలు విలపించరా?
– హత్యారాజకీయాలు, వేధింపులు, కక్షసాధింపులు, కులమతాల మధ్యచిచ్చులు చంద్రబాబుకి తెలియవు.

రఘురామకృష్ణంరాజుని అక్రమంగా అరెస్ట్ చేసి, నానా ఇబ్బందులు పెడుతున్నది చాలక, చంద్రబాబుపై నిందలువేయడం ప్రభుత్వంలోని వారి బుద్ధితక్కువతనానికి, వారుచెబుతున్న పచ్చిఅబద్ధాలకు పరాకాష్ట అని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ బుద్దా వెంకన్న స్పష్టంచేశారు. సోమవారం ఆయన తననివాసం నుంచి జూమ్ యాప్ ద్వారా విలేకరులతో మాట్లాడారు.

ఆ వివరాలు ఆయన మాటల్లోనే …చంద్రబాబునాయుడు చెబితే మాట్లాడటానికి టీడీపీలో ఎంపీలు లేరా? ఎంతోమంది అనుభవమున్న, దమ్మున్న నేతలున్నారు. వారు మాట్లడరా.. ఈప్రభుత్వ చేస్తున్న దుర్మార్గాలు, ముఖ్యమంత్రి విధ్వంసకరపు చర్యల గురించి వారుమాట్లడలేరా?  రఘురామకృష్ణంరాజు వైసీపీఎంపీ. ఆపార్టీలో ఉన్నవ్యక్తి అధికారంలోఉన్న ముఖ్యమంత్రికి వ్యతి రేకంగా మాట్లాడేలా చేసిందెవరు.. వారేకదా? దానికి చంద్రబాబుకి ఏమిటి సంబంధం?  రఘురామకృష్ణంరాజుని  అన్యాయంగా అరెస్ట్ చేసి, చంపాలనిచూస్తున్నారని ఆయన కుటుంబసభ్యులు మాట్లాడితే, అదికూడా చంద్రబాబే చెప్పించారని అంటారా? రఘురామకృష్ణంరాజు కులాలగురించి మాట్లాడారని అంటున్నారు.  ఆయన మాట్లాడింది తప్పే అయితే, ఇంతకుముందు, వైసీపీ ఎంపీలు, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఖరికి ముఖ్యమంత్రితో సహా, అందరూ కులాలగురించి మాట్లాడి, పనిగట్టుకొని ఒక కులాన్ని ఆడిపోసుకున్నవారేకదా? రమేశ్ హస్పిటల్స్ కు, రమేశ్ బాబుకి చంద్రబాబుకి ఉన్నసంబంధమేంటి?  ఒక  వైద్యుడిపై ఒక్కొక్కరికి నమ్మకం ఉంటుంది. వ్యక్తిగతంగా వారికి అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు వారికి నమ్మక మున్నవారి దగ్గరికే వెళుతుంటారు. దానికీ, చంద్రబాబుకి లింకుపెడతారా?  రఘురామకృష్ణంరాజు రమేశ్ ఆసుపత్రికి వెళ్లడానికి, చంద్రబాబుకి సంబంధమేంటయ్యా.. సిగ్గు లేకుండా మాట్లాడటంకాకపోతే? ప్రతివిషయంలో చంద్రబాబు ని వేలెత్తిచూపుతారా?  అచ్చెన్నాయుడు, కొల్లురవీంద్ర, ధూళిపాళ్ల నరేంద్ర, దేవినేని ఉమా లను అరెస్ట్ చేసినప్పుడు  చంద్రబాబు ఎందుకు లేఖలురాయలేదంటున్నారు. ఆయన లేఖలురాయలేదని మీకు తెలుసా? అక్టోబర్ లో రాష్ట్రవ్యాప్తంగా తెలుగుదేశంపార్టీ కార్యకర్తలపై జరుగుతున్నదాడులు, వారిని అన్యాయంగా అధికారపార్టీ పొట్టనబెట్టుకుంటున్న తీరుపై చంద్రబాబు రాష్ట్రపతికి లేఖరాశారు.  మీడియా సంస్థలపై ప్రభుత్వంచేస్తున్న దాడినికూడా చంద్రబాబు లేఖ రూపంలోరాష్ట్రపతికి తెలియచేశారు. జనవరిలో దళితులపై జరుగుతున్నదాడులు, ఎస్సీఎస్టీ చట్టాన్ని నీరుగారుస్తున్న వైనంపై కూడా చంద్రబాబు రాష్ట్రపతికి లేఖరాశారు. చిత్తూరుజిల్లాలో ఒక జడ్జీపైఅకారణంగా దాడికి పాల్పడి, ఆయన్ని నానారకాలుగా ప్రభుత్వంలోని వారే వేధించారు.  ఆ జడ్జీ ఏపార్టీకి చెందినవాడుకాదు. దానిపై కూడా చంద్రబాబు స్పందించారు. ఒకవైద్యుడిని చేతులుకట్టి, పిచ్చి వాడని ముద్రవేసి ప్రభుత్వం పైశాచికానందం పొందినప్పుడు చంద్రబాబు  స్పందించారు.

రఘురామకృష్ణంరాజు తొలి నుంచీ చెబుతూనేఉన్నారు.  రాజశేఖర్ రెడ్డి, తాను మంచి స్నేహితులమని.ఆయన అలా మాట్లాడినప్పుడే వైసీపీ నేతలు ఎందుకు మాట్లాడలేదు?  ఎక్కడ ఎవరికి అన్యాయం జరిగినా, బాధ్యతగల వ్యక్తిగా దాన్ని ఖండించడం చంద్రబాబు నైజం. దానిప్రకారమే ఒక పార్లమెంట్ సభ్యుడి విషయంలో వ్యవహరించినతీరుని తప్పుపట్టారు . చంద్రబాబు చెబితే మేము మాట్లాడలేమా? రఘురామ రాజుతోనే మాట్లాడించాలా?  రఘురామరాజు రమేశ్ ఆసు పత్రికి వెళితే, దానికి చంద్రబాబుకి ఏమిటి సంబంధం.  జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చాక పనిగట్టుకొని, తనకు నచ్చనవారిని, తనను ప్రశ్నించేవారిని వేధిస్తున్నాడు.చంద్రబాబునాయుడుని ఉద్దేశించి, ప్రతిపక్షంలోఉన్న జగన్మోహన్ రెడ్డి కాల్చిచంపండి, చీపుర్లతో కొట్టండి అని అన్నాడు.అవిఎప్పుడన్నాకూడా ఇప్పుడు వాటిని సుమోటాగా తీసుకొని సునీల్ కుమార్ ఎందుకు ముఖ్యమంత్రిపై కేసుపెట్టడు? సునీల్ కుమార్ అంతటి నిజాయితీకలిగిన వ్యక్తే అయితే చంద్రబాబుని నిత్యం వ్యక్తిగతంగా దూషిస్తున్న వైసీపీఎంపీలు, ఎమ్మెల్యేలు, మంత్రులపై ఎందుకు కేసులుపెట్టడంలేదు ప్రభుత్వంలోని వారు తనప్రశ్నపై ఏంసమాధానంచెబుతారోచెప్పండి? కులాలు మతాలను తీసుకొచ్చి, వాటిని తమ రాజకీయ అవసరాలకు వాడుకుంటున్నది అధికారంలోఉన్నవారే కదా?  వైసీపీఎంపీ రఘురామకృష్ణంరాజు మీకు, మీ ముఖ్యమంత్రికి పక్కలోబల్లెంలామారితే, దానికి చంద్ర బాబుకి ఏమిటి సంబంధం? ఇన్నేళ్ల రాజకీయ చరిత్రలో  చంద్రబాబు ఎవరిపైనా ఎప్పుడూ రాజకీయంగా కక్ష సాధిం పులకు పాల్పడింది లేదు.

వైసీపీఎంపీలు పనిగట్టుకొని కావాలనే చంద్రబాబుపై విషప్రచారంచేస్తున్నారు.  పొద్దున్న లేస్తే, వైసీపీఎంపీలు పనిగట్టుకొని చంద్రబాబుని ఆడిపోసుకో వడమే పనిగా పెట్టుకున్నారు. కులాల ప్రస్తావన తెచ్చి, రాష్ట్రాన్ని కులపరంగా విభజించి పాలిస్తున్నది అధికారపార్టీ  అనే విషయం అందిరికీ తెలుసు. రఘురామకృష్ణంరాజుకి ఎంపీ టిక్కెట్ ఇవ్వమని చంద్రబాబునాయుడు ఏమైనా జగన్ కిచెప్పాడా?
ప్రతివిషయంలోకి చంద్రబాబుని లాగడం అనేది వైసీపీవారికి మంచిపద్ధతికాదు.  తిరుపతి ఉపఎన్నిక లో దొంగఓట్లు వేయించినాకూడా, కొందరు అనుకున్నవిధంగా 5లక్షల మెజారిటీ రాకపోయేసరికి, రాష్ట్రప్రజలు ఇప్పటికే చంద్రబాబు పాలనకు అనుకూలంగా ఒక నిర్ణయానికి వచ్చేశారని వైసీపీవారికి అర్థమైంది. అప్పటినుంచీ చంద్రబాబునాయుడి జపం వారికి నిత్యకృత్య మైంది.  చంద్రబాబు వ్యక్తిగతంగా దాడులుచేయించమని, కులాలను, మతాలను దూషించండి అనిచెప్పే వ్యక్తికాదు, ఆయన ఆలోచనలు, ఎప్పుడూ అలాఉండవు. కేంద్రప్రభుత్వంగా కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి జైలుకెళ్లాడనే నిజాన్ని వైసీపీవారు తెలుసుకోవాలి.  వైసీపీలో ఉన్న లుకలుకలు, అంతర్గతవిబేధాలకు చంద్రబాబు ఎలా బాధ్యుడవుతాడో ఆపార్టీనేతలే ఆలోచించుకోవాలి.