20న కేరళ సీఎంగా ‘పినరయి’ ప్రమాణం

220

ఈ నెల 20న కేరళలో వరుసగా రెండోసారి విజయం సాధించిన పినరయి విజయన్​ ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. తిరువనంతపురంలోని సెంట్రల్​ స్టేడియంలో మధ్యాహ్నం 3:30 గంటలకు ఈ కార్యక్రమం జరగనుండగా.. సీపీఎం నేతృత్వంలోని ఎల్​డీఎఫ్​ మరోసారి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది.ఆ రాష్ట్ర గవర్నర్​ ఆరిఫ్​ మహ్మద్​ఖాన్​ విజయన్​తో ప్రమాణం చేయించనున్నారు. సీఎంతో పాటు మరో 21 మంత్రులు కూడా అదే రోజు ప్రమాణం చేస్తారు. మొత్తం 140 అసెంబ్లీ స్థానాలున్న ఆ రాష్ట్రంలో వామపక్ష కూటమి 99 సీట్లను గెలుచుకుని అధికారాన్ని నిలబెట్టుకుంది. యూడీఎఫ్​​ కేవలం 41 స్థానాలకే పరిమితమైంది.