‘ఈటల’పై మంత్రి ‘గంగుల’ ఫైర్

254

తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్ మాజీ మంత్రి ఈటల రాజేందర్‌పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మంత్రి గంగుల మంగళవారం మాట్లాడారు. ఈటల బెదిరిస్తే భయపడేవాడు ఎవరూ లేరన్నారు. టీఆర్ఎస్‌లో ఉన్నారు కాబట్టి గౌరవించామని.. బిడ్డా గిడ్డా.. అంటే అంతేస్థాయిలో సమాధానం ఇవ్వగలమని అన్నారు. ఈటల కు ఆత్మగౌరవం ఉంటే, వెంటనే ఆ భూములను ప్రభుత్వానికి అప్పగించాలన్నారు.