మమ్మల్ని చంపేస్తామన్నారు

372

2011 వరల్డ్‌ కప్‌ క్వార్టర్స్‌లో న్యూజిలాండ్‌ చేతిలో ఓటమి తర్వాత తనను, తన భార్యనూ హత్య చేస్తామంటూ బెదిరింపులు వచ్చాయని దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్‌ ఫాఫ్ డుప్లెసిస్ బయటపెట్టాడు. ఢాకాలో జరిగిన ఆ మ్యాచ్‌లో సౌతాఫ్రికా.. కివీస్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నాకౌటైంది. ‘ఆ మ్యాచ్‌ తర్వాత నాకు బెదిరింపులు వచ్చాయి. నా భార్యను కూడా చంపుతామన్నారు. ఇక సోషల్‌ మీడియాలో అయితే చెప్పలేని రాతలు రాశారు’ అని డుప్లెసి చెప్పాడు. దీంతో తానెంతో ఆత్మన్యూనతా భావానికి గురైనట్టు తెలిపాడు. అయితే, ప్రతి ఆటగాడి జీవితంలో ఇలాంటి సంఘటనలు సాధారణమేనని అన్నాడు.