ఆయుర్వేదంతో మొండి రోగాలు నయం!

254

– 5 వేల సంవత్సరాల నాటి భారతీయ వైద్య విధానంలో అగ్రతాంబూలం అందుకున్న ఆయుర్వేద చికిత్స
– కృష్ణపట్నం ఆయుర్వేద వైద్యులకు ప్రభుత్వం సహకరించాలి
– కరోనా బాధితులకు తోడ్పాటు అందించాలి
-రాష్ట్ర సమరసత సేవా ఫౌండేషన్ కోట సునీల్ కుమార్ స్వామి వేడుకోలు

కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లో కోవిడ్ బారినపడినబాధితులందరికీ పడకలు ఏర్పాట్లు చేయలేని పరిస్థితులు, అలాగే ఆక్సిజన్ సిలిండర్లు అందరికీ అందుబాటులో తీసుకు రాలేని పరిస్థితిలో ఉన్న సమయంలో  మానసిక స్థైర్యాన్ని పెంపొందించే దిశలో, ఆయుర్వేదం వాడి కరోనా వైరస్ తగ్గిన వారు చేస్తున్న ప్రచారంలో భాగంగా,  5 వేల సంవత్సరాల నాటి భారతీయ వైద్య విధానంలో అగ్రతాంబూలం అందుకున్న ఆయుర్వేద చికిత్స ద్వారా మనలో రోగ నిరోధక శక్తి పెంపొందించే విధంగా అధికార యంత్రాంగం చొరవ చూపాలని రాష్ట్ర సమరసత సేవా ఫౌండేషన్ కోట సునీల్ కుమార్ స్వామి విన్నపించుకున్నారు.

మంగళవారం గూడూరు పట్టణంలోనీ పటేల్ విధులో ఉన్న శ్రీ సాయి సత్సంగం నిలయంలో రాష్ట్ర సమరసత సేవా ఫౌండేషన్ కోట సునీల్ కుమార్ స్వామి విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. జిల్లాలోని కృష్ణపట్నం లో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు లేని ఆయుర్వేదం మందు ద్వారా  కరోనా ను నిర్ములిస్తూ..అందరిలో ఆత్మస్థైర్యాన్ని నింపుతున్న  కరోనా నివారణ కోసం గా ప్రయత్నం చేస్తున్న ఆయుర్వేద వైద్యులను ప్రోత్సహిద్దాం అని ఆయన పిలుపునిచ్చారు.

  అవకాశాన్ని బట్టి ప్రభుత్వ అధికారులు చొరవ తీసుకుని రక్షకభటుల ద్వారా కృష్ణపట్నంలో మందు ఇస్తున్న ప్రాంతంలో  హాజరవుతున్న వారి మధ్య సామాజిక దూరాన్ని పాటించే విధంగా మరియు అందరూ మాస్కులు వేసుకునే విధంగా చర్య తీసుకుంటూ సహకరిస్తే అనేక మందిని ఇంట్లోనే ఉంటూ చికిత్స తీసుకుంటూ వారిలో మానసిక స్థైర్యాన్ని పెంపొందించడం ద్వారా ఆరోగ్యవంతం చేయవచ్చు అన్నారు.
    పెద్దలు ఈ విషయాన్ని గమనించి సంపూర్ణమైన మీ సహకారాన్ని అందించగలరని రాష్ట్ర సమరసత సేవా ఫౌండేషన్ ద్వారా విన్నవించుకుంటున్నాము అన్నారు, ఆయుర్వేదం నిలబెట్టుకుందాం –  ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అని ఆయన పిలుపునిచ్చారు,  ఆయుర్వేదం అపర సంజీవని లాంటిదని, ఎలాంటిమొండిరోగాల్నయినా బాగు చేయవచ్చని అంతర్జాతీయ ఆయుర్వేద నిపుణులు కూడా చెబుతున్న తరుణం కరోనా కు ఉచిత మందు ఇస్తున్న ఆయుర్వేద వైద్యులకు అధికార యంత్రాంగం ప్రోత్సహాఁ అందించాలి అని కోరుకుంటున్నట్లు అయన తెలిపారు. రాజకీయాలను పక్కన పెట్టి, కులమత భేదాలను పక్కనపెట్టి, ఎవరినీ విమర్శించకుండా ఈ కరోనా కాలంలో సేవే లక్ష్యంగా పని చేస్తున్న కర్మ యోగులకు నా సాష్ట్రాంగ పాద నమస్కారాలు తెలియజేస్తున్నానని ఆయన తెలిపారు.