సునీల్‌కుమార్ అప్పుడు ఎక్కడున్నారు?

342

రఘురామరాజు ఒక్కడే కులాలు గురించి మాట్లాడాడా? రా మకృష్ణంరాజుకి ఎవరి స్క్రిప్ట్ తో పనిలేదనే విషయం ఎంపీలు గ్రహించాలని తెలుగురైతు విభాగం రాష్ట్రఅధ్యక్షుడు మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి చెప్పారు. జగన్, కొడాలి నానీ, తమ్మినేని సీతారాం, మరికొందరు వైసీపీ ఎమ్మెల్యేలు కులాల ప్రస్తావన చేసినప్పుడు సునీల్ కుమార్ ఎక్కడున్నారు? అని ప్రశ్నించారు. జగన్ ప్రాపకం కోసం కాకుండా, ప్రజల కోసం సునీల్ కుమార్ పనిచేయాలని హితవు పలికారు. వైసీపీ నర్సాపురం ఎంపీ రఘురామకృష్ణంరాజుకి తెలుగుదేశానికి-చంద్రబాబుకి ఉన్న సంబంధమేమిటి?అని వైసీపీ నేతలను మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి జగన్‌ గురించి ప్రజలు పలురకాలుగా అనుకుంటున్నారని, ఆయనపై ఉన్నకేసుల విచారణ త్వరగా తేల్చాలని రఘురామకృష్ణంరాజు కోర్టుకెళ్లాడని చెప్పారు. దానివల్ల టీడీపీకి, చంద్రబాబునాయుడికి వచ్చిన లాభనష్టాలేంటో వైసీపీ ఎంపీలు చెప్పాలని నిలదీశారు. రఘురామ 5పార్టీలు మారాడని, బ్యాంకులకు డబ్బులు ఎగ్గొట్టాడని వైసీ పీఎంపీలకు ఈరోజే తెలుసా? అని ప్రశ్నించారు. జగన్‌కి ఎంత డబ్బిస్తే, ఆయన పార్టీ టిక్కెట్ ఇచ్చారో, ఎంతమంది ఎమ్మెల్యే అభ్యర్థులకు పెండింగ్ చేశారో వైసీపీ వారికి తెలియదా? అని ప్రశ్నించారు.

రఘురామను అడ్డంపెట్టుకొని వైసీపీకి, ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి లేని పవిత్రతను అంటగట్టడానికి ఎంపీలు ప్రయత్నించారన్నారు. మద్యం ,ఇసుక, ఇళ్ల కుంభకోణాల్లో వైసీపీ నేతలు, మంత్రుల ప్రమేయాన్ని రఘురామరాజు  ఎత్తిచూపినప్పడు ఎంపీలు ఎందుకు స్పందించలేదు? అని ప్రశ్నించారు. సహచర ఎంపీ అనే జాలికూడా లేకుండా మాట్లాడేవారికి, భవిష్యత్‌లో రఘురామకు వచ్చిన దుస్థితే వస్తే ఏం చేస్తారు? అని ప్రశ్నించారు.