సుప్రీంకోర్టులో టీవీ5 -ఏబీఎన్ పిటిషన్

222

ఏపీ ప్రభుత్వంపై సుప్రీంకోర్టులో ఏబీఎన్‌ ఆంధ్రజ్యోతి పిటిషన్‌ దాఖలు చేసింది. ఏపీ సీఐడీ పెట్టిన దేశద్రోహం కేసులను సవాల్‌ చేస్తూ ఆంధ్రజ్యోతితో పాటు టీవీ5 కూడా పిటిషన్ దాఖలు చేశాయి. రఘురామ కేసులో ఏబీఎన్, టీవీ5 చానెళ్లపై కేసులు పెట్టిన విషయం తెలిసిందే. ఎఫ్ఐఆర్‌లో రెండింటి పేర్లను సీఐడీ పోలీసులు చేర్చారు.

రఘురామ విద్వేష ప్రసంగాలను ప్రసారం చేశారంటూ.. రెండు ఛానెళ్లపై రాజద్రోహం కేసులు పెట్టింది ఏపీ ప్రభుత్వం. ఉద్దేశపూర్వకంగానే ఎఫ్‌ఐఆర్‌లో తమను చేర్చారని సుప్రీం కోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌లో ఏబీఎన్‌ పేర్కొంది. మీడియా సంస్థలపై రాజద్రోహం నేరం కింద కేసులు నమోదు చేయడం తీవ్ర చర్చనీయాంశమైంది. పలు రాజకీయ, ప్రజా సంఘాల నేతలు ఈ చర్యను ఖండించారు.