ఇదీ ఇజ్రాయెల్ చరిత్ర

1233

ఆపరేషన్ గార్డియన్ ఆఫ్ ది వాల్.

కేవలం 35 ఎకరాల స్థలం కోసం ప్రపంచంలోని మూడు ఎడారి మతాలు గత మూడు వేల సంవత్సరాల నుండి ఒకదానితో ఒకటి కొట్లాడుకుంటున్నాయి.
అయోధ్య కాశి, మథురా మొదలైనవి ముస్లింల చేతిలో దాడికి గురై హిందువుల చేతుల్లోనుండి జారిపోయాయి. ఆ తీర్థక్షేత్రాలను తిరిగిచ్చేయండి అనడిగితే, వాటికోసం ఎందుకు గొడవలు చేస్తారు?అక్కడో ఆసుపత్రో, బడినో కట్టండి అని మానవతావాదుల్లా పోజు కొట్టే స్వయం ప్రకటిత మేధావులు..  జెరూసలెం పేరెత్తితే చాలు నాలుక లేదేమోనన్నట్లు మౌనం పాటిస్తారు.

జెరూసలెం అనే నగరంలో ఉన్న ఆ చిన్న ప్రదేశం కోసం యూదులు ,క్రైస్తవులు, ముస్లింలు గత రెండు వేల సంవత్సరాలనుండి కొట్టుకు చస్తూనే ఉన్నారు. దీనికోసం ఇప్పటికే 41  యుద్ధాలు జరిగాయి. లక్షలాది ప్రజలు చచ్చారు. జెరూసలెంలోని  యూదులు, బాబిలోనియన్లు, బైజంటైన్లు, రోమన్ క్ర్రెస్తవులు, అటోమన్లు, అరబ్బులు మొదలగు అనేక వర్గాల వారి రక్తాన్ని జెరూసలెం మట్టి పీల్చేసింది. అయితే జెరూసలెం అనే పవిత్రభూమి యొక్క రక్తదాహం ఇంకా తీరలేదు. అత్యంత వివాదాస్పదమైన ఆ పవిత్రభూమి చరిత్రను తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

దాదాపు మూడు వేల సంవత్సరాల క్రితం మూడు ఎడారి మతాలకూ మొదటి ప్రవక్తగా భావించబడే అబ్రహాం నుండి యూదుమతం స్థాపించబడింది. అబ్రహాంకు దేవుడి సాక్షాత్కారమైంది జెరూసలెంలోని కొండ మీద. ఈ కొండమీది మట్టితోనే దేవుడు ప్రపంచంలోని మొట్టమొదటి మానవుడైన ఆదాం ను సృష్టించాడు అనే నమ్మకం యూదులకు ఉంది.

యూదుల మత స్థాపకుడైన అబ్రహంకు ఇద్దరు పిల్లలు. ఒకడి పేరు ఇస్మాయిల్. రెండవ వాడి పేరు ఇసాక్. అబ్రహం కు ఇసాక్ మీద ప్రేమ ఎక్కువ. ఒక రోజు అబ్రహాంకు దేవుడు కనిపించి  ఇసాక్ ను తనకు బలి ఇవ్వమని అడిగాడు.

దేవుని పట్ల అపారభక్తి ఉన్న అబ్రాహాము తన కొడుకును బలివ్వడానికి జెరూసలెం లోని ఆ కొండమీదికి తీసుకుపోతాడు. అయితే అబ్రహాం త్యాగాన్ని చూసిన దేవుడు ఇసాక్ బదులుగా ఒక మేకను బలి తీసుకుని అతడికి ప్రాణదానం చేశాడు.ఈ సంఘటన  జరిగిన పవిత్రభూమిని యూదులు హర్ హవాయియత్ అని పిలుస్తారు. అబ్రహాం మొదట నివసిస్తుండినది మెసొపొటేమియాలో.అయితే అతనికి దైవ సాక్షాత్కారమైంది మాత్రం ఎడారి ప్రదేశంలోనున్న జెరూసలెం లోని కొండ మీద.

హిబ్రూ బైబిల్ లోని బుక్ ఆఫ్ జెనెసిస్ లోని దేవుడు మరియు అబ్రహాం మధ్య జరిగిన సంభాషణల వివరాలు లభిస్తాయి. దేవుని ఆదేశం మేరకు అబ్రహాం జెరూసలెంకు వచ్చి దాని చుట్టుపక్కల ప్రదేశాన్ని అభివృద్ధి చేశాడు.

ఆయన మనవడు అంటే ఇసాక్ కొడుకు జాకోబ్ మహా పరాక్రమశాలి‌ .ఆయన దేవదూతతోనే పోరాటం చేశాడని తెలిపే కథలున్నాయి. ఇతని ధైర్యం, పరాక్రమాలను చూసి ఇతనికి ఇజ్రాయెల్ అనే బిరుదును దేవదూతలు ఇచ్చారు. ఇతడు తన భుజబలంతో ఒక దేశాన్ని నిర్మించాడు. ఆ దేశం పేరు ఇజ్రాయెల్ .భవిష్యత్తులో జాకోబ్ కు పుట్టిన 12 మంది పిల్లలు 12 యూదు తెగలుగా విడిపోయారు. ఇజ్రాయెల్ అంతటా వ్యాపించారు. యూదుల దేశం ఇజ్రాయెల్ పుట్టింది ఇలా.

యూదుల ప్రసిద్ధ రాజైన కింగ్ సోలమన్ జెరూసలెం కొండమీది పవిత్రభూమిలో ఒక భవ్యమైన దేవాలయాన్ని నిర్మించాడు. అప్పటినుండి ఆ కొండకు టెంపుల్ మౌంట్ అనే మరొక పేరు  జతగూడింది. ఈ దేవాలయం కట్టబడుంది 3000 సంవత్సరాల క్రితం. దీనిని జెరూసలెం చరిత్రలో మొదటి దేవాలయం లేదా ఫస్ట్ టెంపుల్ అని పిలుస్తారు.

నాగరికతల మధ్య సంఘర్ష ఉత్తుంగస్థితిలో ఉన్న కాలమది. బాబిలోనియన్లు యూదుల మీద దాడి చేసి జెరూసలెంను వశపరచుకుని,  అక్కడి దేవాలయంలోని అపార సంపదను దోచుకుని , ఆ దేవాలయాన్ని నేలమట్టం చేశారు. ఇది యూదుల మీద జరిగిన మొదటి ఆక్రమణ.
అయితే యూదులు నిరంతర పోరాటం తర్వాత తమ పవిత్రభూమిని మళ్ళీ వశపరచుకుని 500 సంవత్సరాల తర్వాత.. అంటే ఇప్పటికి సుమారు రెండున్నర వేల ఏళ్ళ క్రితం మళ్ళీ తమ దేవాలయాన్ని జెరూసలెం లోని అదే స్థలంలో కట్టారు. దీనిని సెకండ్  టెంపుల్ అంటారు.

ఇదంతా జరిగిన ఆరువందల ఏళ్ళ తర్వాత జెరూసలెం లో మరొక ప్రముఖ సంఘటన జరిగింది. యూదు ఆలోచనలను ధిక్కరించి నేనే దైవ పుత్రుడిని అని ఏసుక్రీస్తు మతప్రచారం  ప్రారంభించాడు. ఇది యూదులకు కన్నెర్ర చేసింది. సాధారణంగా ఒక కొత్తమతం పుట్టుకొచ్చే సమయంలో ఎదురయ్యే వ్యతిరేకతలను, ఏసుక్రీస్తు కూడా ఎదుర్కోవలసి వచ్చింది.ఏసుక్రీస్తును ఇదే జెరూసలెం లోని కొండమీదే యూదులు శిలువ వేశారు. తద్వారా ఈ యూదులకు ఒక ప్రబల శత్రువర్గం పుట్టుకొచ్చింది. అదే క్రైస్తవం.

రాజ్యాధికారం దొరికేవరకూ ఎదురుచూసిన క్రైస్తవ మతానుయాయులు రోమన్ సామ్రాజ్యం తమ చేతిలోకి రాగానే యూదుల మీద విరుచుకుపడ్డారు. క్రీస్తు శకం 70 లో రోమన్లు యూదుల మీద  ప్రతీకారం తీర్చుకుని, ఆ కొండ మీదున్న సెకండ్ టెంపుల్ ను ధ్వంసం చేశారు.అయితే ఆ సెకండ్ టెంపుల్ పశ్చిమ భాగంలోని ఒక గోడ మాత్రం ధ్వంసం కాలేదు.అది నేటికీ ఉంది. వెస్ట్రన్ వాల్ అని పిలవబడే ఆ గోడ నేటికీ ప్రపంచంలోని నలుమూలలా ఉన్న యూదులకు అత్యంత పరమపవిత్ర స్థలం.

జెరూసలెంలో ఉండగా మాత్రమే కేవలం రబ్బీలు ( యూదు మత గురువులు ) మాత్రమే సెకండ్ టెంపుల్ లోపలికి వెళ్ళేవారట.సాధారణ యూదులకు ఈ దేవాలయం లోపలికి ప్రవేశం ఉండేదికాదు.అందువల్ల సంప్రదాయ యూదులు ఇప్పటికీ కూడా వెస్ట్రన్ వాల్ కు దూరంనుండే నమస్కరిస్తారు.పొరబాటున కూడా ఆ గోడకు అటువైపున్న భూమి మీద కాలు కూడా పెట్టరు.అంతటి తీవ్రమైన ధార్మిక నమ్మకం యూదులలో ఉంది.

హ్యాడ్రియన్ చక్రవర్తి కాలంలో యూదులు జెరూసలెం కోసం మరొక ప్రముఖ యుద్ధం చేశారు. దీంతో కోపగించుకున్న హ్యాడ్రియన్,  ఆ దేశానికి ఉన్న ఇజ్రాయిల్ అనే పేరునే తొలగించి యూదులకు బద్ధ శత్రువులైన సిరియన్లు, పాలస్తీనియన్లకు అధికారాన్ని అప్పగించి  ఆ దేశపు పేరును సిరియా మరియు పాలస్తీనా అని పేరుమార్చాడు.

అంతేకాదు జెరూసలెంను దాని రాజధానిగా ప్రకటించాడు. ఇంతటితో అతనికి యూదుల మీద ద్వేషం చల్లారలేదు.అక్కడినుండి ఒక్కొక్క యూదు శిశువును ఎత్తి విసిరేసేవరకూ అతడి సైన్యం విశ్రమించలేదు.దాంతో యూదులు తమ మాతృభూమిని వదిలేసి, ప్రపంచపు నలుచెరగులా వెళ్ళాల్సివచ్చింది.ఇదే సమయంలో అక్కడికి వచ్చినవాడు మహమ్మద్ పైగంబర్.

ఖురాన్ ప్రకారం  క్రీస్తుశకం 621లో మహమ్మద్ , బురాక్ అనే ఎగిరే గుర్రం మీద కూర్చొని మక్కా‌నుండి జెరూసలెంకు వచ్చాడట. అక్కడి నుంచి అతడు మళ్ళీ అదే గుర్రం మీద కూర్చొని నేరుగా స్వర్గానికి ఎగిరెళ్ళి అక్కడ దేవుడితో కాసేపు సంభాషించి మళ్ళీ జెరూసలెం లో దిగాడు అని ముస్లింల నమ్మకం. ఇదంతా జరిగింది ఏడవ శతాబ్దంలో అన్నది గమనించండి.

అసలే అనేకమంది ప్రజల రక్తపాతంతో, సామాజిక శాంతిని భగ్నం చేసిన వివాదాస్పద భూమిలో మహమ్మద్ పైగంబర్ తన గుర్రాన్ని దించడం మరింత వివాదానికి కారణమైంది. ఆయనకు చెందిన ఎగిరే గుర్రం ఒకట్రెండు కిలోమీటర్లు అటోఇటో ఎక్కడైనా దిగిఉంటే మతాలమధ్య జరిగిన తోపులాట, రక్తపాతం , అమాయకుల ఊచకోత తప్పేవి.

ముస్లింలు ఈ ప్రదేశాన్ని హర్ అల్ ఆమ్ శరీఫ్ అని పిలుస్తారు. క్రీస్తుశకం 632 లో మహమ్మద్ చనిపోయాడు. తర్వాత నాలుగేళ్ళకు ఉమైత్ ఖలీఫా  నాయకత్వంలో జెరూసలెం మీద దాడి జరిగింది. దాంతో జెరూసలెం బైజాంటైన్ సామ్రాజ్య పరిపాలనలో భాగమైంది. రోమన్ క్రైస్తవుల చేతిలో ఉన్న జెరూసలెం పవిత్రభూమి ముస్లింల వశమైంది.

అప్పటికే అక్కడ క్రైస్తవులు ఒక భవ్యమైన చర్చి నిర్మించి ఉన్నారు. పునరుత్థానపు రోజున ఏసు ఇక్కడినుండే మళ్ళీ లేచొస్తాడనే గాఢమైన నమ్మకం క్రైస్తవులది.
జెరూసలెంను వశపరచుకున్న ఖలీఫా, అక్కడొక మసీదు కట్టించి దానికి అల్ అక్సా మసీదు అని పేరెట్టాడు. ఏ రాయి మీదనుండి మహమ్మద్ కు చెందిన ఎగిరే గుర్రం ఆకాశంలోకి ఎగిరిందో , ఆ రాయి ఉన్న ప్రదేశంలో డూమ్ ఆఫ్ ది రాక్ అనే మరొక మసీదు కట్టి దాని గోపురానికి బంగారు రేకు  తొడిగించారు. ఒక వాదన ప్రకారం ఇశ్రాయేలుల మొదటి దేవాలయం ఉన్న స్థలంలోనే ఉద్దేశపూర్వకంగా ముస్లింలు ఈ ఈ మసీదును కట్టారు అని మధ్యప్రాచ్య చరిత్రకారులు చెబుతారు.

అలా క్రైస్తవులు జెరూసలెంను కోల్పోయారు. ఖలీఫా మీద కత్తులు నూరుతూ , శత్రువులను ప్రేమించండి అనుకుంటూపోతే తమకిక భవిష్యత్తు ఉండదనుకుని,  అనేక దేశాళో ఉన్న క్రైస్తవులను ఏకంచేసి.. ఇస్లాంకు వ్యతిరేకంగా సంఘటిత పోరాటానికి పోప్ పిలుపునిచ్చాడు. ఆ పవిత్రయుద్ధానికి ఆయన పెట్టిన పేరు క్రుసేడ్లు. 1099 జులైలో క్రైస్తవులు పెద్ద యుద్ధం చేసి ముస్లింలనుండి జెరూసలెంను మళ్ళీ వశపరచుకున్నారు.

అయితే అరబ్బులు తమ మూడవ అతి పవిత్ర క్షేత్రాన్ని అంత సులభంగా వదలిపెడతారా ?
జెరూసలెం లో క్రైస్తవుల పాలన బలహీనపడే వరకూ ఎదురుచూసి, 88 ఏళ్ళ తర్వాత 1187 లో భారీ రక్తపాతాన్ని సృష్టించి ముస్లింలు గెలిచారు. ఆనాడే ఇక్కడి మసీదుల నిర్వహణ చూసుకోవడానికి వక్ఫ్ సమితి నియామకమైంది. జెరూసలెం పవిత్రభూమిలోకి ముస్లిమేతరులకు ప్రవేశాన్ని నిషేధించారు.
అయితే సప్త సముద్రాలు దాటి విస్తరించిన యూదులు మాత్రం, వచ్చే నూతన సంవత్సర సబ్బత్ ఆచరణను జెరూసలెం పవిత్రగోడ ముందు చేసుకుంటాను అనే సంకల్పాన్ని ఒక తరంనుండి మరో తరానికి అందజేస్తూనే పోయారు.

మా పూర్వీకుల స్థలమైన ఇజ్రాయెల్ ను తిరిగి పొందాలని , జెరూసలెం మీద తమ పవిత్రక్షేత్రం మళ్ళీ నిర్మాణమవ్వాలనే యూదుల కల నిరంతర గర్భంలో పిండంలాగా పెరగసాగింది. భారతదేశంలో తప్ప మిగిలిన అన్ని దేశాలలో చిత్రహింస, అత్యాచారం, అవమానాలకు గురై,  చివరకు హిట్లర్ గ్యాస్ ఛాంబర్లలోకి తోయబడి 60 లక్షల మంది తమవారి శవాలను దాటుకుంటూ యూదులు సజీవంగా వచ్చి తన పూర్వీకుల త్యాగబలిదానాలకు సాక్షి అయిన ఇజ్రాయెల్ నేలమీద అడుగు మోపారు.
19 వ శతాబ్ద ప్రారంభంలో ప్రపంచ నలుమూలలనుండి యూదులు, తమదైన దేశాన్ని నిర్మించుకోవడానికి తిరిగి రాసాగారు. పాలస్తీనా అని పిలవబడుతూ అరబ్బుల పిడికిలిలో ఉన్న తమ స్వస్థలానికి వచ్చి అక్కడ స్థలాలను కొనుక్కుని చట్టబద్ధంగా నివసించసాగారు.

రెండవ ప్రపంచ యుద్ధంలో టర్కీ ని లొంగదీసుకున్న బ్రిటిషర్లు , వారి ఆధీనంలో ఉన్న పాలస్తీనా భూమిని రెండు భాగాలుగా పంపకం చేశారు. అరబ్బులకు పాలస్తీనా, యూదులకు ఇజ్రాయెల్ .ఇదంతా జరిగింది 1948 లో. ముస్లింల తీవ్ర వ్యతిరేకత ఉన్నా వారి ఛాతీ మీద తలెత్తి నిలబడింది ఇజ్రాయెల్. నలువైపులా ముస్లిందేశాలు, మధ్యన ఇజ్రాయెల్. అనుకోకుండా జరిగిన ఈ పరిణామంతో దిక్కుతోచని షేకులు  గడ్డాలను సవరించుకుంటూ కాళ్ళుచేతులు పిసుక్కున్నారు.

ఐక్యరాజ్యసమితి కి తమకు రాజధానిగా జెరూసలెం ను ఇవ్వాలని యూదులు విన్నవించుకున్నారు. పట్టుబట్టారు. అయితే యూదులకు భూభాగాన్నివ్వడంవల్ల బాగా కోపంగా ఉన్న అరబ్బులు,  జెరూసలెం ను కూడా పోగొట్టుకుంటే మరింత కృద్ధులవుతారని గ్రహించిన బ్రిటిషర్లు.. దానిని యూదులకు గాని, అరబ్బులకు గాని ఇవ్వలేదు. దాన్ని ఐక్యరాజ్యసమితి కి అప్పగించారు.

కొంతకాలంపాటు జెరూసలెం శాంతంగా ఉండింది. అయితే పాలస్తీనా తురకల దురద వారిని మౌనంగా కూర్చోనివ్వలేదు.1967 లో జెరూసలెం ను వశపరచుకోవడానికి అరబ్బు దేశాల సహకారంతో పాలస్తీనా సిద్ధమైంది. దీనిగురించి ముందుగానే సమాచారం సేకరించిన ఇజ్రాయిల్,  ప్రపంచ యుద్ధ చరిత్రలో అత్యంత వ్యూహాత్మక యుద్ధం అని పిలవబడే ఆరు రోజుల సమరానికి నాంది పలికింది. ఒంటరి దేశం అని భావించి, గుంపుగా వచ్చిన అరబ్బులు ఇజ్రాయెల్ చావుదెబ్బలకు పిరుదులు కాలిన కుక్కల్లాగా ఒక మూలకు సర్దుకున్నారు.

అప్పటివరకూ మానవత్వమే చట్టం అని జెరూసలెంను వశపరచుకోకుండా వదిలేసిన యూదులు,  దాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నారు. ఏదో పీకుతామని వెళ్ళి మూతులు పగలగొట్టించుకున్న అరబ్బులు సంప్రదింపులకు వచ్చారు. అప్పటివరకూ టెంపుల్ మౌంట్ మీద వక్ఫ్ పట్టు ఉండేది. ఇజ్రాయెల్ కాసింత ఉదారత్వంతో దీనిలో ఏ మార్పు చేయలేదు. ముస్లింలతో ఒక ఒప్పందం చేసుకుంది. టెంపుల్ మౌంట్ బాధ్యతను జోర్డాన్ దేశానికి అప్పగించడం, యూదులకు అక్కడ ప్రార్థనకు అవకాశం కల్పించడం ఈ ఒప్పందంలో ముఖ్య అంశం.

అయితే ఈ ఒప్పందంపట్ల ఛాందస ముస్లింలతో బాటు ఛాందస యూదులకు సదభిప్రాయం లేకపోయింది. ముస్లింలు అల్ అక్సా మసీదు ఆవరణలోకి ముస్లిమేతరులు కాలు పెట్టడాన్ని కూడా సహించేవారు కాదు.అలాగే ఈ ఒప్పందంలో యూదులకు కేవలం పర్యాటకులుగా వచ్చిపోవడానికి మాత్రమే అనుమతి ఉంది తప్ప, పూజ చేయడానికి హక్కు లేదు.ఇది యూదులకు సహించరానిదైంది.జెరూసలెంను తమ బాహుబలంతో గెలిచాక కూడా ,దాన్ని సంపూర్ణంగా ఇజ్రాయెల్ తన వశం చేసుకోకుండా ముస్లింలతో ఒప్పందం చేసుకోవడమెందుకు అనేది వారి ప్రశ్న.

2014 లో జెరూసలెం యూదుల పుణ్యభూమి అని ప్రకటించిన ఒక యూదు నాయకుడిని, పాలస్తీనా తీవ్రవాదులు చంపడానికి విఫలయత్నం చేశారు. అది తీవ్రమైన గొడవకు కారణమైంది. ఈ సంఘటన తర్వాత ముస్లింలను టెంపుల్ మౌంట్ నుండి దూరంగా పెట్టడం జరిగింది.  ఇదీ ఇజ్రాయెల్ పాత చరిత్ర.

శ్రీకాంత్ శెట్టి