కరోనా బాధితులకు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ అందజేత

312

-ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు అభ్యర్థన మేరకు దానం
-నరసరావుపేట ప్రభుత్వాసుపత్రికి గ్రీన్ కో సంస్థ వారు విరాళం
దాతల సాయంతో మరిన్ని ఏర్పాట్లు చేస్తాం – ఎంపీ లావు శ్రీకృష్ణ దేవరాయలు

కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఆస్పత్రులను నిరంతరం పర్యవేక్షిస్తూ..మెరుగైన వసతులు ఏర్పాటు జరిగేలా నరసరావుపేట పార్లమెంట్ సభ్యులు లావు శ్రీకృష్ణదేవరాయలు చొరవ చూపుతున్నారు. ఆయా ఆస్పత్రుల్లో మెరుగైన సౌకర్యాల కల్పన జరిగేలా, ఆక్సిజన్ కొరత తీరేలా, సిబ్బంది నియామకాలు జరిగేలా అధికారులతో సంప్రదింపులు చేస్తున్నారు. ఈ ఆపద కాలంలో  సహృదయంతో చేతనైన సాయాలు చేయాలన్న ఎంపీ అభ్యర్థన మేరకు దాతలు ముందుకు వస్తున్నారు. ఎంపీ అభ్యర్థన మేరకు గ్రీన్ కో సంస్థ వారు కరోనా బాధితులకు 10 ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్   అందజేశారు.  గ్రీన్ కో సంస్థకు చెందిన చలమలశెట్టి అనిల్, సహచరులు సుమారు రూ.15లక్షల వ్యయంతో వీటిని నరసరావుపేట, లింగంగుంట్ల లోని ఏరియా వైద్యశాలకు  అందించారు. వీటిని సోమవారం ఎంపీ శ్రీకృష్ణ దేవరాయలు, ఎమ్మెల్యే గోపి రెడ్డి శ్రీనివాస్ రెడ్డి, సబ్ – కలెక్టర్ శ్రీవాస్ నపూర్ ఆస్పత్రి సిబ్బందికి అందజేశారు. వాటి పని తీరును ఎంపీ స్వయంగా పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ.. నరసరావుపేట పార్లమెంట్ పరిధిలో కరోనా ఆస్పత్రుల్లో సౌకర్యాలు, మెడిసిన్ కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. సుమారు 200పైగా బెడ్ల తో కరోనా బాధితులకు చికిత్స అందిస్తున్న ఈ ఆస్పత్రికి సిబ్బంది చాలా అవసరం. మా అభ్యర్థన మేరకు గుర్తింపు ఉన్న వైద్యులు ఈ ఆస్పత్రిలో సేవలు అందిస్తున్నారు. వారికి ఎంపీ అభినందనలు తెలిపారు. మరిన్ని ఏర్పాట్లు చేయుటకు దాతలను కోరామని, వారు కూడా సాయాలు చేయుటకు సిద్దంగా ఉన్నట్లు చెప్పారు. రెండు, మూడు రోజుల్లో లింగంగుంట్లలో మరిన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వివరించారు.