ఈటల కుటుంబీకుల అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలపై విచారణ

349

ఈటల రాజేందర్ కుటుంబీకుల అసైన్డ్ భూముల కబ్జా ఆరోపణలపై మాసాయిపేట తహసీల్దార్ మాలతి, వెల్దుర్తి తహసీల్దార్‌ సురేష్‌ విచారణ చేపట్టారు. అనంతరం తహసీల్దార్లు మీడియాతో మాట్లాడుతూ అచ్చంపేటలోని జమున హ్యాచరీస్‌ భూ వివాదంపై గ్రామ కార్యదర్శులను పిలిచి స్టేట్‌మెంట్లు రికార్డు చేశామని తెలిపారు. 2018లో అసైన్డ్ భూముల క్రమబద్ధీకరణకు ఎన్ఓసీ తీసుకున్నారని, 2019లో మరోసారి పంచాయతీ కార్యదర్శులపై ఒత్తిడి తెచ్చి.. ఎన్‌వోసీ తీసుకున్నారని తహసీల్దార్లు పేర్కొన్నారు. హకీంపేటలో జమున హ్యాచరీస్‌ ఫీడ్ ప్లాంట్ కడుతోందని, అనుమతి లేనందున ఆపేయాలని గ్రామకార్యదర్శి 2 సార్లు చెప్పారని, 5.35 ఎకరాలలో అనుమతి లేకుండా రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు గుర్తించి ఆపేశారని తహసీల్దార్లు చెప్పారు. 90 ఎకరాలకు చెందిన 75 మంది రైతులకు నోటీసులు ఇచ్చామని, 26, 27, 28 తేదీల్లో పూర్తిస్థాయిలో సర్వే చేస్తామని తహసీల్దార్లు పేర్కొన్నారు.