కాపాడడంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండండి

366

నానితో కలిసి టాస్క్‌ఫోర్స్, మినిట్స్ సమావేశం.

కాపాడడంలో ప్రతి క్షణం అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) ఆదేశించారు. సోమవారం కృష్ణా జిల్లా గుడివాడ పట్టణంలోని క్యాంప్ కార్యాలయంలో రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) తో కలిసి కోవిడ్ పై టాస్క్ ఫోర్స్, మినిట్స్ సమావేశాన్ని నిర్వహించారు.

    ఈ సందర్భంగా మంత్రి కొడాలి నాని మాట్లాడుతూ గుడివాడ ఏరియా ప్రభుత్వాసుపత్రిలోని కోవిడ్ కేంద్రానికి అవసరమైన ఆక్సిజన్ కొరత, అంతరాయం లేకుండా చూడాలని వైద్య, విద్యుత్ శాఖల అధికారులను ఆదేశించారు. ఆక్సిజన్ కొనుగోలు కోసం నిధులు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటానని, అన్ని మార్గాల్లో ఆక్సిజన్ ను సమకూర్చుకోవాలని సూచించారు. ప్రస్తుతం గుడివాడ కోవిడ్ కేంద్రంలో 20 ఆక్సిజన్ బెడ్స్ ఉన్నాయని, మరో 10 ఆక్సిజన్ బెడ్స్ తో పాటు ఇంకో 20 నాన్ ఆక్సిజన్ బెడ్స్ ఏర్పాటుకు చర్యలు చేపట్టాలన్నారు. కోవిడ్ కేంద్రంలోని ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్లకు విద్యుత్ సరఫరాలో ఎటువంటి అంతరాయం కలుగకుండా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అలాగే కోవిడ్ కేంద్రంలో 3 షిఫ్ట్ లకు మొత్తం ఆరుగురు మున్సిపల్ పారిశుద్ధ్య సిబ్బందిని అందుబాటులో ఉంచాలని మున్సిపల్ కమిషనర్ పీజే సంపత్ కుమార్‌కు మంత్రి కొడాలి నాని సూచించారు.
    రాష్ట్ర రవాణా, సమాచార శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) మాట్లాడుతూ కోవిడ్ బెడ్స్ ఏర్పాటు, ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ల కోసం అన్ని ప్రయత్నాలూ చేస్తామన్నారు. వైద్య సిబ్బంది నియామకం కోసం చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతిరోజూ రాత్రి 8 గంటల నుండి ఉదయం 8 గంటల వరకు ఇద్దరు పోలీసుల సెక్యూరిటీ ఉండేలా చూస్తామన్నారు. వైద్యుల కొరత లేకుండా చూస్తామన్నారు. డీ టైప్ సిలిండర్లను పెంచేందుకు కృషి చేస్తానని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఏరియా ప్రభుత్వాసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ ఎస్ ఇందిరాదేవి, ఆర్ఎంవో డాక్టర్ విద్యాధరి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సురేష్, వైసీపీ రాష్ట్ర నేత దుక్కిపాటి శశిభూషణ్, మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ అడపా బాబ్జి, పార్టీ జిల్లా స్టీరింగ్ కమిటీ సభ్యుడు మండలి హనుమంతరావు, పార్టీ పట్టణ అధ్యక్షుడు గొర్ల శ్రీను, పాలడుగు రాంప్రసాద్, నందివాడ మండల అధ్యక్షుడు పెయ్యల ఆదాం, రూరల్ మండల అధ్యక్షుడు మట్టా జాన్ విక్టర్, నాయకులు జోగా కిషోర్, పెద్ది కిషోర్ తదితరులు పాల్గొన్నారు.