డిసెంబర్ నాటికి దేశంలోని ప్రతి ఒక్కరికి వ్యాక్సిన్ పూర్తి చేస్తాం

340

న్యూఢిల్లీ: కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి జి. కిషన్ రెడ్డి  న్యూఢిల్లీలోని తన అధికార నివాసం నుంచి ఈరోజు విర్చ్యువల్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో మంత్రి కిషన్ రెడ్డి కరోనా కట్టడి లో భారత ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని అందరికీ డిసెంబర్ నాటికి వ్యాక్సినేషన్ పూర్తిచేస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పటివరకూ దేశంలో 18 కోట్ల మందికి కేంద్ర ప్రభుత్వం ఉచితంగా వ్యాక్సిన్ ఇచ్చిందని తెలియజేశారు. రాహుల్ గాంధీ తో పాటు ఇతర రాజకీయ నాయకులు బిజెపి పై మోడీ పై ఎన్ని విమర్శలు చేసినా అవి పట్టించుకోకుండా ప్రజల రక్షణే ధ్యేయంగా కేంద్రం పని చేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు.

కరోనాపై జరుగుతున్న యుద్ధంలో ఫ్రంట్లైన్ వారియర్స్, ప్రభుత్వ ఉద్యోగులు ,మీడియా ప్రతినిధులు కోల్పోతున్నామని అయినా కూడా ప్రజలను రక్షించేందుకు ఆర్మీ , ఆర్ పి ఎఫ్, హోం శాఖకు చెందిన 11 లక్షల  పారామిలటరీ ఫోర్స్ రిలీఫ్ యాక్టివిటీస్ లో  పనిచేస్తున్నాయని దేశంలోని అన్ని ఆర్మీ, రైల్వే, ఎస్ఐ, కంటోన్మెంట్,aiims ఆస్పత్రులు కూడా కోవిడ్ సేవలు అందిస్తున్నాయని మంత్రి తెలిపారు. ప్రపంచంలో మొదటి 5 నాణ్యతగల టీ కాలలో కోవగ్జిన్,కోవెషీల్డ్ ఉన్నాయని వాటి పార్ములా ఎక్స్చేంజ్ ద్వారా మరికొన్ని కంపెనీలు ఉత్పత్తిని పెంచుతాయని కిషన్ రెడ్డి తెలిపారు.

జనాభాలో పెద్ద దేశంగా ఉన్న మన దేశంలో  130 కోట్ల మందికి రెండు డోసులు వ్యాక్సిన్ ఇవ్వాలంటే 300 కోట్ల డోసు తయారు చేసుకోవాలని మంత్రి తెలిపారు .పుణెకి చెందిన సిరం కంపెనీ అమెరికాకు చెందిన  ఆస్ట్రా జనిక్  కంపెనీతో కలసి కోవే షీల్డ్ తెచ్చిందని ఇతర కంపెనీల్లో కూడా ఈ టీకాను తయారు చేసేందుకు ఫార్ములా పేటెంట్ రైట్స్ కోసం ప్రయత్నిస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. సిరం కంపెనీ ఈ మే,జూన్ నెలలో ఒక్కో నెలకి   6 కోట్ల 5 లక్షల లెక్క ఉత్పత్తి చేస్తూ డిసెంబర్ నాటికి నెలకు 11 కోట్ల 50 లక్షల డోస్ పెంచుతుందని కిషన్ రెడ్డి తెలిపారు. భారత ప్రభుత్వం మరియు భారత్ బయోటెక్ తీసుకువచ్చిన కోవాగ్జిన్ టీకా డోసులను మరో 4 కంపెనీలకు(ఇండియన్ ఇమ్యునలిజికల్,అప్కిన్ బయోఫార్మా,bipcol, గుజరాత్ biotech కంపెనీలకు)

జాబ్ వర్క్ ఇచ్చి సెప్టెంబర్ నుంచే ఉత్పత్తి ప్రారంభించి  డిసెంబర్ నాటికి 15 కోట్ల 50 లక్షల డోసులను నెలకు  ఉత్పత్తి చేయనుందని కిషన్ రెడ్డి తెలిపారు.రష్యాకి చెందిన sputnik టీకా ను రెడ్డి లాబ్స్ ద్వారా పేలాసియా,హెటేరో,విర్చో, స్టేడిస్, గ్లాండ్ ఫార్మా, shilpha medicare లాంటి 7 కంపెనీలతో ఒప్పందం చేసుకొని డిసెంబర్ లోపల 7 కోట్ల 2 లక్షల డోస్ లను ఉత్పత్తి చేయనుందని,అంతేకాకుండా ఆలోపు నేరుగా రష్యా నుంచి స్నూత్నిక్ వ్యాక్సిన్ ను దిగుమతి చేసుకుంటామని కిషన్ రెడ్డి తెలిపారు. జయాడాస్ గెడిలా సెప్టెంబరు నుంచి ఉత్పత్తులు చేస్తుందని,హైదరాబాద్ biolagical ఈవెంట్స్ జాన్సన్ జాన్సన్ తో కలిసి ఒక డోస్ తోనే సరోపోయే వ్యాక్సిన్ ను నెలకు 5 కోట్ల చొప్పున సెప్టెంబర్ నుంచి ఉత్పత్తి ప్రారంభిస్తోందని,సిరం మరో నోవాక్సిన్ కలసి కొత్త ఫార్ములతో నెలకు 5 కోట్ల వ్యాక్సిన్ తయారు చేస్తుందని, మొత్తం 16 కంపెనీలు తమ ఉత్పత్తులు ను భారత్ కు టీకాలు అందజేయనున్నాయని…అవి
మేలో 8కోట్ల 80 లక్షల
జూన్ 10 కోట్లు
జులై లో 17 కోట్ల 8లక్షలు
ఆగస్టు లో 19 కోట్ల 16 లక్షలు
సెప్టెంబర్ లో 42 కోట్ల 12 లక్షలు
అక్టోబర్ లో 46 కోట్ల72లక్షలు
నవంబర్ 56కోట్ల2లక్షలడిసెంబర్ 59కోట్ల 32 లక్షల లెక్కన ఈ మె నుంచి డిసెంబర్ వరకు 259 కోట్ల 22 లక్షల వ్యాక్సిన్ డోస్ భారత్లో ఉత్పత్తి అవుతున్నాయని కిషన్ రెడ్డి తెలిపారు. వచ్చే ఏడాది మొదటి మూడు నెలల్లో 300 కోట్ల డోస్ లు వ్యాక్సిన్ ఉత్పత్తి, వినియోగం జరుగుతుందని,చిన్నపిల్లలతో సహా జనాభా 150 కోట్ల లెక్కన 300 కోట్ల డోస్ కి భారత ప్రభుత్వం ప్రణాళిక రచించిందని కిషన్ రెడ్డి తెలిపారు. అంతేకాకుండా W.H.O,F.D.I అనుమతులు ఉన్న వ్యాక్సినేషన్ టెక్నాలజీని 24 గంటల్లో దిగుమతి చేసుకునే విధంగా అనుమతులు ఇచ్చామని ,ప్రపంచంలో అన్ని కంపెనీలతో ఒప్పందాలు చేసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

ప్రపంచంలో వాక్సినేషన్ లో 30 కోట్లతో చైనా మొదటి స్థానంలో ఉంటే 26 కోట్లతో అమెరికా రెండో స్థానంలో ఉందని 18 కోట్లతో 3వ స్థానంలో ఉన్న భారత్ అక్టోబర్  నాటికి మొదటి స్థానానికి వెళ్తామని కిషన్ రెడ్డి తెలిపారు. వ్యాక్సినేషన్ విషయంలో ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఢిల్లీ నుంచి మొదలుపెడితే కుగ్రామంలో ఉన్న చివరి రైతు వరకు ఈ వ్యాక్సిన్ను కేంద్ర ప్రభుత్వం ఇస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. ఉత్పత్తి అవుతున్న టీకలో 50% కేంద్ర ప్రభుత్వం కొనుగోలు చేసి రాష్ట్రాలకు నేరుగా పంపిస్తుందని, వివిధ రాష్ట్రాలు ఫార్మా కంపెనీలు కూడా నేరుగా గ్లోబర్ టెండర్స్ ద్వారా వ్యాక్సిన్ ను కొనుగోలు చేసుకోవచ్చని కిషన్ రెడ్డి తెలిపారు.

యుద్ధ విమానాల ద్వారా ఇప్పటికే విదేశాల నుంచి ఆక్సిజన్ను సరఫరా చేస్తున్నామని, 85 ట్రైన్ ల ను స్పెషల్ గా ఆక్సిజన్ కోసమే వినియోగిస్తున్నామని, గత ఏడాది 5700 మెట్రిక్ టన్నుల ఉత్పత్తి అయితే ఈ మే నెలలో 9446  మెట్రిక్ టన్నుల ఆక్సిజన్ ఉత్పత్తి చేసుకుంటున్నామని, గతంలో నాలుగు లక్షల ముప్పై ఐదు వేలు సిలిండర్లు ఉంటే ఇప్పుడు 11 లక్షల 19వేలు సిలిండర్లు అందుబాటులో ఉన్నాయని ,600 నుంచి900 ఆసుపత్రిలో ఆక్సిజన్ను  అందుబాటులోకి  తెచ్చామని, వెంటిలేటర్ను రెండు వేల నుంచి అదనంగా యాభై ఒక్క వెయ్యి వెంటిలేటర్ను మనదేశంలో  స్వదేశీయంగా కూడా తయారు చేసుకున్నామని కిషన్ రెడ్డి తెలిపారు. గాలి ద్వారా ఆక్సిజన్ తయారు చేసుకునే పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్లను ఇప్పటివరకు దేశవ్యాప్తంగా గాంధీ ఆసుపత్రి రెండిట్లో కలుపుకుని 52 నెలకొల్పమని మొత్తం 1594 ప్లాంట్లను రాబోయే నెలల్లో నెలకొల్పుతామని కిషన్ రెడ్డి తెలిపారు.

వెంటిలేటర్ల విషయానికి వస్తే ఏపీకి ఇప్పటివరకు అక్కడ పెరుగుతున్న కేసులు మరణాల బట్టి 4960 వెంటిలేటర్లు 16 లక్షల n95 మాస్కులు,3లక్షల 19 వేల PPE kits ఇచ్చామని,తెలంగాణ కు 1400 వెంటిలేటర్స్,15 లక్ష n95,2లక్షల81వేల PPE kits ఇచ్చామని కిషన్ రెడ్డి తెలియజేశారు. ఇప్పటివరకు రెమిడీస్ వేర్ మూడు కోట్ల నాలుగు లక్షలు ఇంజక్షన్లు దిగుమతి చేసుకున్నామని 9000 ఆక్సిజన్ కాన్సెంట్రేట్ లను 5690 వెంటిలేటర్ను ఇతర దేశాల నుంచి దిగుమతి చేసుకున్నామని యుద్ధ ప్రాతిపదికన కేంద్రం చర్యలు తీసుకుంటుందని, రెండు లక్షల కోట్ల మిగులు బడ్జెట్ అవసరమైతే మరింత డబ్బులు వాడైనా ప్రజలను రక్షించు ఉంటామని కిషన్ రెడ్డి తెలిపారు. ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రజలు ప్రభుత్వాలు కలిసికట్టుగా కరోన డెత్ రేట్ తగ్గించే విధంగా పనిచేయాలని కిషన్ రెడ్డి కోరారు. కరోన రోగుల కోసం రైల్వే ఈ ఎస్ ఐ కంటోన్మెంట్ మిలటరీ ఎయిమ్స్ ఆసుపత్రిలో కూడా ఉపయోగిస్తున్నా మని బీబీనగర్లో 200 బెడ్స్ తో ఎయిమ్స్ ఆస్పత్రిని సిద్ధం చేస్తున్నామని కిషన్ రెడ్డి తెలిపారు.

ఈ సందర్భంగా విలేకరులు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్తూ మంత్రి…
పాజిటివ్ కేసులు డెత్ రేటు అవసరాలకనుగుణంగా కేంద్రం ఆయా రాష్ట్రాలకు మెడికల్ కోటాను కేటాయిస్తుంటాని ,దీనికోసం అధికారులతో కూడిన ప్రత్యేక టాస్క్ ఫోర్స్ పనిచేస్తుందని కిషన్ రెడ్డి తెలిపారు. దేశంలో సప్లై బట్టి ఆయా రాష్ట్రాల అవసరాలను బట్టి వెంటనే మెడికల్ కేర్ ను అందించడం జరుగుతుందని కిషన్ రెడ్డి తెలిపారు.ఇందులో పీఎం గాని ఎవరి పాత్ర ఉండదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణకి ఇచ్చిన 1400 వెంటిలేటర్లు ఇటీవల తాను విజిట్ చేసిన ఓ ఆస్పత్రిలో 100 వెంటిలేటర్స్ కు సీల్ కూడా తీయలేదని పారా మెడికల్ సిబ్బందికి వెంటిలేటర్ పై అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని కిషన్ రెడ్డి అన్నారు. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలు ఆక్సిజన్ను గ్రీన్ ఛానల్ ద్వారానే ఆసుపత్రులకు అందేలా చర్యలు తీసుకోవాలని తిరుపతిలో జరిగిన రుయా సంఘటన దురదృష్టకరమని కిషన్ రెడ్డి అన్నారు.

కరోన  కేసులు మరణాలు దాచి  పెట్టడం మంచి పద్ధతి కాదని ఇటీవల మాజీ మంత్రి ఈటెల కూడా ఈ విషయంలో ఒప్పుకున్నారని  స్మశానకమిటీ నుంచి వస్తున్న సమాచారం గతంలో తేడా ఉన్న ఇప్పుడు కొంచెం వాస్తవాలకు దగ్గరగా ఉన్నట్లు అనిపిస్తుంది అని కిషన్ రెడ్డి అన్నారు. తెలంగాణకు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే కేసులో రిత్యా అవసరమైతే ప్రభుత్వం అడిగితే మెడికల్ కోటపెంచే అవకాశం ఉంటుందని కిషన్ రెడ్డి అన్నారు. ఈ విపత్కర పరిస్థితుల్లో కొన్ని మీడియా చానల్లో కేంద్రానికి, మోడీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అబద్ధాలు ప్రచారం చేసినా మేమెప్పుడూ ప్రెస్ ఫ్రీడమ్ కి చర్యలు తీసుకోలేదని కానీ ఏపిలో ప్రెస్ ఫ్రీడమ్ పై  నిషేధం విధించడం మంచిది కాదని కిషన్ రెడ్డి స్పష్టం చేశారు. ఏపీలో ఇతర రాష్ట్రాల్లో విలేకరులపై ప్రెస్ ఫ్రీడమ్ పై జరుగుతున్న దాడులకు త్వరలోనే సమాచార మంత్రి ప్రకాశ్ జవదేకర్ తో మాట్లాడతానని, అన్ని రాష్ట్రాల్లో జర్నలిస్టులను వారియర్ గా గుర్తించి పత్రికా రంగానికి పూర్తి స్వేచ్ఛ ఇవ్వాలని కిషన్ రెడ్డి అన్నారు.

కరోనా విషయంలో ప్రజలు జాగ్రత్తగా వ్యవహరించాలని,లా క్‌డౌన్‌ సమయంలో బయటికి వెళ్ళినా తగిన జాగ్రత్తలు పాటించాలని కిషన్ రెడ్డి కోరారు. ప్రజల సహకారం లేనిదే ఏ ప్రభుత్వం కట్టడి చేయలేదని ఈ విషయంలో ప్రజల సహకారం ప్రభుత్వాలకు అవసరమని కిషన్ రెడ్డి ప్రజలకు విజ్ఞప్తి చేశారు.