ఎంపీని కొట్టడం దుర్మార్గమైన చర్య

293
  - యలగాల నూకాలమ్మ

మేధావులారా మాట్లాడండి. ఎంపీ ని కొట్టడం దుర్మార్గమైన చర్య. రఘురామ కృష్ణరాజును శారీరకంగా హింసించడం పైశాచికత్వమే. ఇలాంటి రాక్షస చర్యను జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు,  ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఇన్చార్జి. యలగాల నూకానమ్మ తీవ్రంగా ఖండించారు.
భారత రాజ్యాంగానికే మాయని మచ్చ.  ఇలాంటి చర్య ప్రజాస్వామ్యనికే  తూట్లు పొడిచినట్లుంది. సి బి సి ఐడి-  పోలీస్ స్టేషన్లోనే కొట్టి తరువాత ప్లోర్ మీద నడవమని  మళ్లీ కొట్టడం, నడవలేని పరిస్థితిలో ఉంచారంటే,  ఏ విధంగా హింసించారో అర్థమవుతుంది. గౌరవ ఎంపీనే  కోడితే  ఇక సామాన్యుడి పరిస్థితి  ఏంటి  ? ఇలాంటి చర్య పోలీస్ వ్యవస్థకే  మాయని మచ్చ. ప్రభుత్వ  ఏకపక్ష నిర్ణయాలు, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రశ్నిస్తే  అక్రమ కేసులు పెట్టి కోడతారా?  మేధావులారా మాట్లాడాలి. లేకుంటే రౌడీలు, గుండాలు, రెచ్చిపోతారు.   రాష్ట్రం సర్వనాశనమౌతుంది. కరోనా నుండి ప్రజల ప్రాణాలను కాపాడి, రాష్ట్రాభివృద్ధిపై  దృష్టి పెట్టాలని  ప్రభుత్వానికి యలగాల నూకానమ్మ  హితవు పలికారు.