ఎంపవర్ అండ్ ఎక్సెల్ వారి ఆధ్వర్యంలో జేవియర్స్ కు 30 బెడ్స్ బహుకరణ…

279

– ప్రారంభించిన ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు

వినుకొండ: కరోనా వైరస్ ఉద్ధృతి నేపథ్యంలో దాతలు స్వచ్ఛందంగా ముందుకు రావడం అభినందనీయమని ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు అన్నారు. అమెరికాకు చెందిన స్వచ్చంద సంస్థ ఎంపవర్ అండ్ ఎక్సెల్ ఫౌండర్ ప్రెసిడెంట్, సిఈవో ఆయేషా చారగుల్ల, విజయవాడకు చెందిన ఇండియా చాప్టర్ హెడ్ కరణం కళ్యాణ్ కృష్ణ కుమార్ మానవత్వాన్ని చాటుకున్నారన్నారు. స్థానిక తహశీల్దార్ అనిల్ కుమార్, ఆర్ఐ జానీ బాషా మరియు ఆ సంస్థ ప్రతినిధి,సీనియర్ జర్నలిస్ట్ వాసిరెడ్డి రవిచంద్ర తదితరులు కోరిన వెంటనే వారు అంగీకరించి ఒక్క రోజులో 30 బెడ్స్ ని వినుకొండ లోని సెయింట్ ఆన్స్ జేబీఎస్ ఆస్పత్రిలో కరోనా బాధితుల సౌకర్యార్థం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సందర్భంగా ఏర్పాటూ చేసిన ప్రత్యేక వార్డుని స్థానిక ఎమ్మెల్యే బొల్లా బ్రహ్మనాయుడు ప్రారంభించి మాట్లాడారు. వెనుకబడిన వినుకొండ ప్రాంతంలో ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించి అమెరికాకు చెందిన ఎన్నారై ఆయేషా ఆధ్వర్యంలో అక్కడి డోనర్స్ ముందుకు వచ్చి 2 లక్షలు విలువ చేసే బెడ్స్ ను ఏర్పాటు చేయడం సంతోషకరమని ఇలాంటి దాతృత్వం కలిగిన వ్యక్తులను ఆదర్శంగా తీసుకొని కరోనా మహమ్మారి నివారణకై సహాయ సహకారాలు అందిస్తూ సేవ చేసేందుకు పలువురు ముందుకు రావాలని ఆయన కోరారు.

కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ డా.దస్తగిరి, వైస్ చైర్మన్ రాజేష్ కన్నా, సర్పంచ్ దేవరాజు, దండు చెన్నయ్య, చిన్నబ్బాయి, డాక్టర్ శ్రీనివాస్ రెడ్డి, మైనర్ ఇరిగేషన్ నోడల్ అధికారి ఏ ఈ మురళి, ప్రముఖ న్యాయవాది ఎంఎన్ ప్రసాద్ తదితరులు ఆర్గనైజేషన్ దాతృత్వాన్ని కొనియాడారు. వాలెంటీర్లు బోడపాటీ దిలీప్ కుమార్, గద్దె భాను తదితరులు పాల్గొన్నారు.