రంగు మారింది,గాయాలు లేవు!

318

ఎంపీ రఘురామ రాజు రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారింది కానీ, బయటికి గాయాలు కనిపించడం లేదని డాక్టర్లు తమ మెడికల్ రిపోర్టులో స్పష్టం చేశారు.ఎంపీ రఘురామ రాజుకు సంబంధించిన మెడికల్ రిపోర్టును పోలీసులు హైకోర్టుకు సమర్పించారు. ఈ నివేదికను హైకోర్టు న్యాయవాదులకు చదివి వినిపించింది. రఘురామ కాళ్లు వాచి ఉన్నాయని, రెండు పాదాలకు, అరికాలుకు రంగు మారిందని, కానీ బయటికి గాయాలు కనిపించడం లేదని పేర్కొన్నారు. రఘురామకు గుండె నొప్పి ఉందని ఫిర్యాదు చేశారని, నాలుగున్నర నెలల క్రితం గుండెకు శస్త్రచికిత్స జరిగిందని, వెంటనే కార్డియాలజిస్ట్‌కు పంపామని స్పష్టం చేశారు. . ప్రస్తుతం ఆయన ఆరోగ్యం, గుండె నిలకడగానే ఉందని వైద్యులు తమ రిపోర్టులోస్పష్టం చేశారు.  నెఫ్రాలజిస్ట్ దగ్గరకు కూడా పంపామని, నార్మల్‌ గానే ఉందని వైద్యులు స్పష్టం చేశారు. .