రాష్ట్రంలో సీబీసీఐడీ వ్యవహరిస్తున్నతీరు దారుణంగా ఉంది.

612

సునీల్ కుమార్ పై  భార్య పెట్టిన కేసులను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకొని,ఆయుధంగా చేసి కక్షసాధింపులకు వాడుకుంటోంది.   
•  ఆల్ ఇండియా సర్వీసుల నుంచి వచ్చే అధికారులు నిష్పక్షపాతంగా, నిర్భయంగా, నిజాయితీతో వ్యవహరించాలి.
• దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో అలా జరగడంలేదు.
• ఐపీఎస్, ఐఏఎస్ లుగా ఉన్నవారు తమకులభించే పదవులు, రిటైర్మెంట్ తర్వాత ఒనగూరే ప్రయోజనాల గురించి ఆలోచిస్తూ, పాలకుల రాజకీయ కక్షసాధింపుల్లో భాగస్వాములవుతున్నారు.
• రాష్ట్రంలో సీబీసీఐడీ వ్యవహరిస్తున్నతీరు దారుణంగా ఉంది.
• సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని 60ఏళ్ల మహిళపై అత్యుత్సాహం చూపిన సీబీసీఐడీ, న్యాయస్థానాలను అవమానించేలా, న్యాయమూర్తులనుదూషిస్తూ మాట్లాడినవారిపై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు?
• ప్రభుత్వ ఆదేశాలతో దూకుడుగా వ్యవహరించే సీబీసీఐడీ, రాష్ట్రహైకోర్ట్ ఆదేశాలనుఎందుకు ఖాతరు చేయడంలేదు?
• సీబీసీఐడీ అధికారి సునీల్ కుమార్ పై  ఆయన భార్య పెట్టినకేసులను ప్రభుత్వం తనకు అనుకూలంగా మలుచుకుంది.
• కులాల ప్రస్తావన చేసిన ముఖ్యమంత్రి, మంత్రులు, ఇతర ప్రభుత్వ పెద్దలపై సీబీసీఐడీ ఎందుకుచర్యలు తీసుకోలేదు?
• దళితులకు శిరోముండనాలుచేసి, వారిని అవమానించిన వారిని సీబీసీఐడీ ఏం చేసింది?
• సునీల్ కుమార్ సీబీసీఐడీ అధికారిగా పనికిరాడు. ఆయన్ని తక్షణమే ఆ బాధ్యతల నుంచి తప్పించాలి.  
• సునీల్ కుమార్ లాంటి అధికారులు ప్రభుత్వ ఉచ్చులో పడి, తమ తెలివితేటలు, వ్యక్తిత్వాన్ని తాకట్టు పెట్టవద్దని కోరుతున్నాం.
• ప్రభుత్వానికి కొమ్ముకాసే సునీల్ కుమార్ లాంటి అధికారులంతా ఒక్కసారి వారు  భవిష్యత్ తో ఎదుర్కోబోయే సమస్యల గురించి ఆలోచిస్తే మంచిది.  

రాజ్యాంగంలో ముఖ్యభాగమైన రాష్ట్ర పాలనావ్యవస్థ పనితీరు గురించి మాట్లాడానికి చాలా బాధగా ఉందని, శాసనవ్యవస్థ, కార్యనిర్వాహక వ్యవస్థ, న్యాయవ్యవస్థలు దేనికదే స్వయం ప్రతిపత్తి కలిగి ఉండాలని, అప్పడే పాలన సజావుగా, ప్రజా రంజకంగా సాగుతుందని టీడీపీ నేత, మాజీ ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్ స్పష్టంచేశారు. శనివారం ఆయన జూమ్ యాప్ ద్వారా తన నివాసం నుంచి విలేకరులతో మాట్లాడారు.

 రాజ్యాంగంలోని ఆర్టికల్ 53 కేంద్రంలోనూ, ఆర్టికల్ 154 రాష్ట్రంలోనూ పరిపాలనను గవర్నర్, రాష్ట్రపతులు నిర్వహించేలా విధివిధానాలు రూపొందించడం జరిగిందన్నారు. వారునేరుగా పాలన చేయడం కుదరదు కనుక, పాలనావ్యవస్థలో ఆల్ ఇండియా సర్వీసెస్ అధికారుల (ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్, మరికొన్ని) పాత్రను చొప్పించడంజరిగిందన్నారు. ఐఏఎస్, ఐపీఎస్ సర్వీసులు అనేవి కేవలం ప్రభుత్వాలకే జవాబుదారీతనంగా వ్యవహరించకుండా చట్టబద్దంగా వ్యవహరించాల్సి ఉందని  శ్రావణ్ కుమార్ అభిప్రాయపడ్డారు. కానీ దురదృష్టవశాత్తూ ఆంధ్రప్రదేశ్ లో ఆ రెండు వ్యవస్థలు నిర్వీర్యమైపోయి, రాజకీయ క్రీడలోభాగంగామారాయన్నారు. రాష్ట్రంలో సీబీసీఐడీ వ్యవహరిస్తున్నతీరు చాలాదారుణంగా ఉందని, అధికారంలో ఉన్న రాజకీయపార్టీ అండదండలతో ప్రతిపక్షనేతలపై కేసులుపెట్టడమే కాకుండా, చివరకు ఎంపీ స్థాయిలో ఉన్న అధికారపార్టీ వ్యక్తినే అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
       సీబీసీఐడికి రాష్ట్రస్థాయిఅధికారిగా ఉన్న పీ.సునీల్ కుమార్ ఐపీఎస్ నుంచి వచ్చారని, అటువంటి వ్యక్తి ఎవరికి లొంగకుండా, ఎటూకొమ్ముకాయకుండా వ్యవహరించాల్సి ఉందన్నారు. ధైర్యంగా, నిష్పక్షపాతంగా విధులు నిర్వహించాల్సిన అధికారే అత్యుత్సాహంతో కొన్నికేసులు నమోదుచేస్తున్నారని టీడీపీనేత స్పష్టంచే శారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా సోషల్ మీడియాలో పోస్టులు పెట్టారని చెప్పి, 60ఏళ్లు పైబడిన మహిళసహా, కొందరు యువతీయువకులపై గతంలో సీబీసీఐడీ అత్యుత్సాహంచూపిందన్నారు. అంతటితో ఆగకుండా, కొందరు ప్రతిపక్షనేతలపై కూడా సీబీసీఐడీ విభాగం పరిధికి మించి అత్యుత్సాహంచూపిందని శ్రావణ్ కుమార్ తేల్చిచెప్పారు. అదే సీబీసీఐడీ, న్యాయస్థానంపై అనుచిత వ్యాఖ్యలుచేసినవారిపై చర్యలు తీసుకోవాలని హైకోర్ట్ ఆదే శించినా ఇంతవరకు దానికిసంబంధించి ఎటువంటికేసులు నమోదు చేయలేకపోయిందన్నారు.
 అమాయక ప్రజలను, ప్రతిపక్షనేతలను, ప్రభుత్వాన్ని ప్రశ్నించేవారిని కేసులతో వేధిస్తున్న సీబీసీఐడీ ప్రజాస్వామ్యంలో ప్రజల గొంతుకగా మారినవారిని కూడా అరెస్ట్ చేయడం జరిగిందన్నారు. సునీల్ కుమార్ అధికారపార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ, వారుచెప్పింది వింటున్నారు తప్ప, ఎక్కడా నిష్పక్షపాతంగా, నిజాయితీగా వ్యవహరించడంలేదని టీడీపనేత స్పష్టంచేశారు. ఆయన వ్యక్తిగతంగాకూడా అనేక ఆరోపణలు ఎదుర్కొన్న సందర్భాలు గతంలో ఉన్నాయ న్నారు. సునీల్ కుమార్ పై ఆయన భార్య పెట్టిన 498(ఏ), వరకట్నవేధింపులకు సంబంధించిన కేసులు ఇప్పటికీ ఉన్నాయన్నారు. వాటిపై ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోకుండా, సునీల్ కుమార్ ని తన రాజకీయ కక్ష సాధింపులకు ఆయుధంగా వాడుతున్నట్లుగా తమకు అనిపిస్తోందన్నారు.
  సునీల్ కుమార్ పై అతనిభార్య పెట్టిన కేసులను ప్రభుత్వం తనకు అనుకూలంగా మార్చుకుందన్నారు. ప్రభుత్వతీరుపై సునీల్ కుమార్ ఆలోచించాలని, దళితమహిళలపై ఈ రాష్ట్రంలో జరిగిన అవమానాలు, వేధింపులు, అత్యాచారాలపై ఎందుకుచర్యలు లేవో సమాధానంచెప్పాలని శ్రావణ్ కుమార్ డిమాండ్ చేశారు. కులప్రస్తావనచేయడం అనేది రాష్ట్రంలో నిత్యకృత్యమైపోయిం దని, ముఖ్యమంత్రే పలుసందర్భాల్లో ఆ ప్రస్తావనచేశారని, ఆయనతోపాటు మంత్రులు, ప్రభుత్వపెద్దలుకూడా కులాల ప్రస్తావనచేశారని, వారిపై ఎటువంటి చర్యలు తీసుకోని సీబీసీఐడీ కొందరిపైనే కేసులు పెట్టడమేంటన్నారు?  ఒక మహిళా అధికారి స్వయంగా తనను వేధిస్తున్నారని, తన సోదరుడు, తనతండ్రిపై కూడా పోలీసులు అకారణంగా కేసుల మోపారని ఆమెచెప్పిందన్నారు. రాష్ట్రప్రజలకు రాజకీయపార్టీలు ఏవైనాఉండొచ్చుకానీ, తనదాకా వచ్చేవరకు ఎవరికీ ఏమీ అర్థంకావడంలేదన్నారు.
గతంలో నాజీలపాలనలో పోలీసులు, ఇప్పుడున్న మాదిరే రాజకీయ కక్షసాధింపులకే ప్రాధాన్యత ఇచ్చారన్నారు. అదేమాదిరి ఇప్పుడురాష్ట్రంలో పోలీసురాజ్యం నడుస్తోందన్నారు. ఈ ప్రభుత్వం ఇంకామూడేళ్లే ఉంటుందని, ఆతరువాత సునీల్  కుమార్ సహా, అత్యుత్సాహంతో పనిచేస్తున్న ప్రతిఅధికారిని ఎవరుకాపాడతారో వారేగుర్తుంచుకోవాలని శ్రావణ్ కుమార్ సుతిమెత్తని హెచ్చరికతో ప్రశ్నించారు. ఆల్ ఇండియా సర్వీసులకుచెందిన అధికారులు, అధికారపక్షానికి పావులుగా మారి, పరిధిదాటివ్యవహరించడం మానుకుంటే వారికే మంచిదన్నారు. సునీల్ కుమార్ తనపరిధికిలోబడి, సామాన్యులకు న్యాయంజరిగేలా వ్యవహరించినప్పుడే ఆయనకు మంచిదన్నారు.
  శిరోముండనాలు జరిగిన దళితుల ఆర్తనాదాలు, ఆయన భార్య ఆయనపై చేస్తున్న అభియోగాలు సునీల్ కుమార్ కు ఎందుకు కనిపించడంలేదో ఆయనే ఆలోచించాలన్నారు. కులాల కుంపట్లు రగల్చడంద్వారా, రాష్ట్రాన్ని తమకుఅనుకూలంగా మలుచుకోవాలని చూసిన అధికారపక్షంలోని నాయకులపైకూడా సునీల్ కుమార్ చర్యలు తీసుకొని ఉండాల్సిందన్నారు. న్యాయవ్యవస్థ ఆదేశాలపై కూడా సునీల్ కుమార్ ఇదేవిధమైన దూకుడుకనబరచాలన్నారు. ప్రభుత్వం, అధికారపక్షం తన రాజకీయస్వార్థానికి ఐపీఎస్, ఐఏఎస్ లను వాడుకుంటోందని, ప్రభుత్వమిచ్చే పదవులు, రిటైర్మెంట్ తర్వాత లభించే ప్రయోజనాలగురించి ఆలోచించ కుండా,  రాజ్యాంగబద్ధంగానే నడుచుకోవాలని, స్వార్థప్రయోజనాలకోసం తెలివితేటలు, వ్యక్తిత్వాన్ని తాకట్టుపెట్టుకోవడం ఆల్ ఇండియా సర్వీస్ అధికారులకు తగదని శ్రావణ్ కుమార్ హితవుపలికారు. ప్రజలుకూడా సునీల్ కుమార్ లాంటి అధికారుల తీరుపై ఆలోచించాలన్నారు. అటువంటి వ్యక్తి చేతిలో సీబీసీఐడీ ఉండటం ఎంతమాత్రం తగదని, తక్షణమే ఆయన్ని ఆ బాధ్యతల నుంచి తప్పించాలని మాజీ ఎమ్మెల్యే డిమాండ్ చేశారు.