కోవిడ్ ఆస్పత్రిలను సమీక్షించిన మంత్రులు కొడాలి నాని,పేర్ని నాని

183

విజయవాడ, మే 15:మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణ ప్రసాదు పిర్యాదు మేరకు ఇబ్రహీంపట్నంలోని కోవిడ్ హస్పటల్ లో నెలకొన్న పరిస్థితులను శనివారం రాష్ట్ర పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు (నాని), రాష్ట్ర సమాచార, రవాణా శాఖ మంత్రి పేర్ని వెంకట్రామయ్య (నాని) లు స్వయంగా సమీక్షించారు. ఈ సందర్బంగా హస్పటల్ యాజమాన్య నిర్లక్ష్య వైఖరి, దోపీడి గురించి పెషెంట్ల కుటుంబ సభ్యులు మంత్రులు కొడాలి నాని, పేర్ని నాని, జిల్లా కలెక్టర్ ఇంతియాజ్ లకు వివరించారు. విచారణ అనంతరం కలెక్టర్ కార్యాలయంలో సమావేశం నిర్వహించి హస్పటల్ పై తగు నిర్ణయం తీసుకోనున్నారు. గన్నవరం శాసనసభ్యులు వల్లభనేని వంశీమోహన్,  జాయింట్ కలెక్టర్ శివశంకర్ తదితరులు పాల్గొన్నారు