జగన్ ఓ మూర్ఖపు ముఖ్యమంత్రి: లోకేష్

244

రాష్ట్రంలో దారుణమైన పాలన కొనసాగుతోందని, జగన్ రెడ్డి నియంత కంటే ఘోరంగా కక్ష పూరిత రాజకీయాలు నడుపుతున్నాడని టీడీపీ నేత, పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ మేరకు ట్విటర్ వేదికగా వరుస ట్వీట్లతో సీఎం జగన్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు. ప్ర‌జ‌ల ప్రాణాల ర‌క్ష‌ణ ప‌ట్టించుకోకుండా, త‌న క‌క్ష తీర్చుకోవ‌డానికే ప్ర‌భుత్వ యంత్రాంగాన్ని వాడుతున్న మూర్ఖ‌పు ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌రెడ్డి అని మండిపడ్డారు. ‘ప్ర‌భుత్వంపై ప్ర‌జ‌ల‌కు విశ్వాసం కోల్పోయేలా వ్యాఖ్య‌లు చేశార‌ని ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును అరెస్ట్ చేశారు.స‌ర్కారుపై విశ్వాసం లేద‌ని 5 కోట్ల ఆంధ్రులూ బ‌హిరంగంగానే ప్ర‌క‌టిస్తున్నారు. వారంద‌రినీ అరెస్ట్ చేస్తారా? 7ఏళ్ల లోపు శిక్ష ప‌డే కేసుల్లో అరెస్టులు చేయవద్ద‌ని సుప్రీంకోర్టు ఈ మధ్యనే ఆదేశించింది. ఆ ఆదేశాలను కూడా లెక్క చేయ‌కుండా.. వై కేట‌గిరి భ‌ద్ర‌త‌లో ఉన్న ఓ ఎంపీని, అది కూడా బైపాస్ స‌ర్జ‌రీ చేయించుకుని ఇంట్లో ఉంటున్న సొంత పార్టీ వ్యక్తిని.. ఆయ‌న పుట్టిన‌రోజునే అరెస్ట్ చేయించ‌డం జగన్ సైకో మ‌న‌స్త‌త్వానికి నిద‌ర్శ‌నం’ అంటూ లోకేష్ తీవ్ర ఆరోపణలు చేశారు. అంతేకాకుండా ఏపీ క్రైమ్ ఇన్వెస్టిగేష‌న్ డిపార్ట్‌మెంట్(సీఐడీ) సీఎం ఇండివిడ్యువ‌ల్ డిపార్ట్‌మెంట్‌గా మారిపోయిందని ఆరోపించారు. ప్ర‌శ్నిస్తే సీఐడీ అరెస్టులు, ఎదిరిస్తే ఏసీబీ దాడులు, వైసీపీలో చేర‌క‌పోతే జేసీబీతో ధ్వంసం, లొంగ‌క‌పోతే పీసీబీ త‌నిఖీలు. ఇదీ నియంత సైకో జ‌గ‌న్‌రెడ్డి పాల‌న‌ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ రెడ్డి అసమర్థతను ఎత్తిచూపి, ప్రభుత్వాన్ని ప్రశ్నించిన ఎంపీ ర‌ఘురామ‌కృష్ణంరాజును అరెస్ట్ చేయడాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నానని లోకేష్ స్పష్టం చేశారు.