కోటికి పైగా కుటుంబాలకు ఉచితంగా బియ్యాన్ని పంపిణీ చేశాం

281

– నిత్యావసరాల పంపిణీ ప్రక్రియ 68.82 శాతం పూర్తి
– రాష్ట్ర పౌరసరఫరాల శాఖ మంత్రి కొడాలి నాని

గుడివాడ, మే 15: రాష్ట్రంలో ఒక కోటి 47 లక్షల 27 వేల 764 బియ్యం కార్డులు ఉన్నాయని, వీటిలో మే నెలకు సంబంధించి ఇప్పటి వరకు ఒక కోటి 01 లక్షల 35 వేల 993 కార్డులకు ఉచితంగా నాణ్యమైన సార్టెక్స్ బియ్యాన్ని సరఫరా చేసినట్టు రాష్ట్ర పౌరసరఫరాలు, వినియోగదారుల వ్యవహారాల శాఖ మంత్రి కొడాలి శ్రీవెంకటేశ్వరరావు (నాని) చెప్పారు. శనివారం కృష్ణాజిల్లా గుడివాడలో మంత్రి కొడాలి నాని విలేఖర్లతో మాట్లాడారు.

గత ఏడాది కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విధించిన లాక్ డౌన్ ఆంక్షల కారణంగా పేదలు ఆకలితో ఉండకూడదన్న ఉద్దేశ్యంతో 16 విడతలుగా పౌరసరఫరాల శాఖ ఆధ్వర్యంలో తెల్లరేషన్ కార్డు కల్గివున్న ప్రతి కుటుంబానికి నిత్యావసర సరుకులను ఉచితంగా అందజేశామన్నారు. కరోనా సెకండ్ వేవ్ తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ఈ ఏడాది మే, జూన్ నెలల్లో బియ్యం కార్డులున్న కుటుంబాల్లో ఒక్కో సభ్యుడికి 10 కేజీలు చొప్పున నాణ్యమైన బియ్యాన్ని ఉచితంగా పంపిణీ చేయాలని సీఎం జగన్మోహనరెడ్డి నిర్ణయం తీసుకున్నారని చెప్పారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా బియ్యం కార్డుదారులకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం 68.82 శాతం పూర్తయిందని చెప్పారు. కర్నూలు జిల్లాలో 76.17 శాతం, ప్రకాశం జిల్లాలో 74.29 శాతం, వైఎస్సార్ కడప జిల్లాలో 73.88 శాతం, అనంతపూర్ జిల్లాలో 76.32 శాతం, పశ్చిమగోదావరి జిల్లాలో 70.96 శాతం, చిత్తూరు జిల్లాలో 69.41 శాతం, గుంటూరు జిల్లాలో 68.68 శాతం, విజయనగరం జిల్లాలో 70.75 శాతం, విశాఖపట్నం జిల్లాలో 65.40 శాతం, తూర్పుగోదావరి జిల్లాలో 63.98 శాతం, కృష్ణాజిల్లాలో 63.68 శాతం, శ్రీకాకుళం జిల్లాలో 64.90 శాతం, నెల్లూరు జిల్లాలో 57.61 శాతం పంపిణీ ప్రక్రియను పూర్తిచేసినట్టు తెలిపారు. ఇదిలా ఉండగా ప్రకాశం జిల్లాలో మొత్తం 9 లక్షల 96 వేల 073 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 7 లక్షల 39 వేల 983 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేశామన్నారు.
అలాగే కర్నూలు జిల్లాలో మొత్తం 12 లక్షల 13 వేల 940 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 లక్షల 24 వేల 750 కార్డులకు, పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 12 లక్షల 42 వేల 454 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 81 వేల 663 కార్డులకు, వైఎస్సార్ కడప జిల్లాలో మొత్తం 8 లక్షల 13 వేల 453 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 6 లక్షల 01 వేల 009 కార్డులకు, చిత్తూరు జిల్లాలో మొత్తం 11 లక్షల 54 వేల 977 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 01 వేల 681 కార్డులకు, విశాఖపట్నం జిల్లాలో మొత్తం 12 లక్షల 72 వేల 917 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 32 వేల 561 కార్డులకు, విజయనగరం జిల్లాలో మొత్తం 6 లక్షల 95 వేల 821 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 4 లక్షల 92 వేల 305 కార్డులకు, అనంతపూర్ జిల్లాలో మొత్తం 12 లక్షల 16 వేల 927 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 9 లక్షల 28 వేల 833 కార్డులకు, గుంటూరు జిల్లాలో మొత్తం 14 లక్షల 78 వేల 955 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల 15 వేల 831 కార్డులకు, తూర్పుగోదావరి జిల్లాలో మొత్తం 16 లక్షల 44 వేల 964 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 10 లక్షల 52 వేల 532 కార్డులకు, కృష్ణాజిల్లాలో మొత్తం 12 లక్షల 98 వేల 567 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 8 లక్షల 27 వేల 014 కార్డులకు, శ్రీకాకుళం జిల్లాలో మొత్తం 8 లక్షల 11 వేల 716 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల 26 వేల 814 కార్డులకు, నెల్లూరు జిల్లాలో మొత్తం 8 లక్షల 87 వేల 002 బియ్యం కార్డులు ఉండగా ఇప్పటి వరకు 5 లక్షల 11 వేల 017 కార్డులకు ఉచితంగా బియ్యాన్ని అందజేసినట్టు మంత్రి కొడాలి నాని తెలిపారు.