రఘురామకృష్ణంరాజు అరెస్టుపై బండి సంజయ్ ఫైర్

231

కరీంనగర్ ప్రెస్ రిలీజ్

హైదరాబాద్:ఆంధ్ర ప్రదేశ్ కు చెందిన ఎంపీ రఘురామ కృష్టం రాజును ఏపీ సీఐడీ పోలీసులు హైదరాబాద్ లో అరెస్టు చేసిన తీరు చాలా దారుణంగా ఉందని బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, ఎంపీ  బండి సంజయ్ కుమార్, ఆగ్రహం వ్యక్తం చేశారు.

రఘురామకృష్ణంరాజు అరెస్టుపై సంజయ్ ఏమన్నారంటే… ‘ ఒక ఎంపీని ఈడ్చుకెళ్తారా… బలవంతంగా కారులోకి తోస్తారా? ఒక గౌరవ ఎంపీని ఏపీ పోలీసులు అరెస్టు చేయడానికి లోక్ సభ స్పీకర్ అనుమతి లేకున్నప్పటికీ తెలంగాణ ప్రభుత్వం ఏవిధంగా అనుమతించింది?

తెలంగాణాలో ప్రజాస్వామ్య ప్రభుత్వ పాలన కొనసాగుతోందా … లేక తమ మిత్రుడైన ఏపీ సీఎం కోసం అన్నీ నిబంధనల్ని తుంగలోకి తొక్కి నియంతృత్వ పాలన చేస్తున్నారో అర్థం కావట్లేదు. మఫ్టీ లో వచ్చిన వాళ్ళను చూస్తుంటే పోలీసులో.. కిడ్నాపర్లో అర్థం కాలేదు. ఎంపీ గారిని కిడ్నాప్ చేశారో, అరెస్టు చేశారో ఆయన కుటుంబ సభ్యులకు కొద్దీ సేపు అర్థం కాలేదంటే పరిస్థితి ఎంత దారుణమో తెలుస్తోంది రఘురామ కృష్ణం రాజుకు 4 నెలల కిందట హార్ట్ సర్జరీ అయింది. ఒక హార్ట్ పేషెంట్ తో పోలీసులు వ్యవహరించే తీరు ఇదేనా? ప్రాణాలను అరచేత పట్టుకుని హైదరాబాద్ హాస్పిటలకు వస్తున్న ఏపీ అంబులెన్సు లను బార్డర్ లో ఆపేస్తున్నతెలంగాణా సర్కార్ ఒక గౌరవ ఎంపీని అరెస్టు చేసేందుకు ఏవిధంగా పోలీసులను రాష్ట్రంలోకి అనుమతించింది. వేరే రాష్ట్రం నుంచి వస్తున్న అంబులెన్సులను ఎందుకు ఆపారని గౌరవ హైకోర్టు చీవాట్లు పెట్టిన ఈ ప్రభుత్వానికి బుద్ధిరాలేదు.

లాక్ డౌన్ నిబంధనలను అధిగమించి, కరోనా వ్యాప్తిని పట్టించుకోకుండా పదుల సంఖ్యలో ఏపీ సీఐడీ పోలీసులను ఇంత అత్యవసరంగా రాష్ట్రంలోకి అనుమతించాల్సిన అవసరం ఏమి ఉండే? కొన్నాళ్లు ఆగితే రఘురామకృష్ణం రాజు దేశం వదిలి పారిపోయేవారా? గౌరవ ఎంపీకి ఎన్నో రకాల ప్రివిలేజేస్ ఉంటాయని ఏపీ, తెలంగాణ పోలీసులకు తెలియదా? ఒక ఎంపీని అరెస్టు చేయాలంటే గౌరవ స్పీకర్ అనుమతి తీసుకోవాలన్న ఇంగిత జ్ఞానం ఏపీ పోలీసులకు లేకున్నా… మన రాష్ట్రంలో ఉన్న ఎంపీని ఎట్లాంటి వారెంట్ లేకుండా ఏవిధంగా ఆ పోలీసులకు ఏవిధంగా అప్పగించింది. రాజకీయ ప్రత్యర్థులను ఎదుర్కోలేక రెండు రాష్ట్రాల సీఎంలు ఇట్లాంటి అప్రజాస్వామిక విధానాలకు పాల్పడుతున్నారు. కరోనా నుంచి ప్రజల్ని కాపాడే విషయంలో రెండు రాష్ట్రాల ముఖ్యమంత్రుల మధ్య సమన్వయం కుదరడం లేదు కాని… రాజకీయ రాక్షస క్రీడలో మాత్రం రెండు రాష్ట్రాల సీఎంలు మంచి సమన్వయంతో పనిచేసుకుంటున్నారు  ’