కరోనాను కట్టడి చేయడంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఘోరంగా విఫలమైంది

215
  - యలగాల నూకాలమ్మ

యలగాల నూకానమ్మ

జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళ అధ్యక్షురాలు మరియు జాతీయ బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర  ఇంఛార్జి యలగాల నూకానమ్మ  మీడియాతో మాట్లాడుతూ ప్రధాని మంత్రి మోదీ,ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇద్దరు ఫెయిల్యూర్స్ లో పోటీ పడుతున్నారని అన్నారు,కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల అవగాహన రాహిత్యం వల్ల ప్రజలను కరోనా వైరస్ కభళిస్తోందని తెలిపారు,కరోనా నుంచి ప్రజలను రక్షించడంలో ఇప్పటికే కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చేతులెత్తేశాయని అన్నారు,మీ తిప్పలు మీరు పడండని ప్రజలను తీసుకువెళ్లి కరోనా వైరస్ కు అప్పగించారని సూచించారు,కరోనాతో మృతి చెందుతున్న వారిని ఎలాగో కాపాడటం లేదని కనీసం వారి పిల్లలను కాపాడటంలో కూడా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆమె మండిపడ్డారు,కోవిడ్ వైరస్ బారిన పడి చనిపోయిన వారి పిల్లలకు ఆశ్రయం కల్పించకుండా  ఎన్జీఓలకు అప్పగించడం దారుణమని అన్నారు,పిల్లల బాధ్యతను ఎన్జీఓలకు అప్పగించడం అంటే మహిళా అభివృద్ధి,శిశు సంక్షేమ శాఖ తమ బాధ్యత నుంచి తప్పించుకోవడమే అని ప్రశ్నించారు,ఎన్జీఓల ఎఫ్‌సిఆర్‌ఎ బ్యాంక్ ఖాతాలను ప్రభుత్వం చాలావరకు నిలిపివేయడంతో ఎన్జీఓ సంస్థలు ఆర్థిక సంక్షోభంలో ఉన్నాయని తెలిపారు,ఖాతాలను నిలిపివేయడం వల్ల వారు విదేశీ నిధులు పొందే అవకాశం లేదని సూచించారు,ప్రభుత్వం చేయాల్సిన పనిని ఎన్జీఓలకు అప్పగించి చేతులు దులుపుకోవడం సిగ్గుచేటు అని ఆమె తీవ్రంగా ఖండించారు,కేంద్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే ఎన్జీఓల బ్యాంకు ఖాతాలను పునర్ ప్రారంభించాలని అన్నారు,లేనిపక్షంలో ప్రభుత్వమే ఆ పిల్లల బాధ్యతను తీసుకోవాలని అన్నారు,రాష్ట్రవ్యాప్తంగా ఉన్న బాల సదన్లు,సంక్షేమ హాస్టళ్లలో పిల్లలను తీసుకొని వారిని రాష్ట్ర ప్రభుత్వం జాగ్రత్తగా చూసుకోవాలని ఆమె అన్నారు