ఇసుక ప్రవేటు  కాంట్రాక్టర్  దోపిడి అరికట్టాలి !

115

ఉచిత  ఇసుక పాలసీ అమలు చేయాలి!!
కార్మికులు తొలగించొద్దు సిఐటియు  డిమాండ్!!

రాష్ట్ర ప్రభుత్వం  ఏపీఎండీసీ  శాండ్ కార్పొరేషన్ తప్పుకొని, తమిళనాడులోని శేఖర్ రెడ్డి ఓనరు
జయ ప్రకాష్ పవర్  వెంచర్ లిమిటెడ్ ప్రైవేట్ కంపెనీకి  కట్టబెట్టారని  ఏపీ  శాండ్ ఎంప్లాయిస్ యూనియన్ సిఐటియు అనుబంధం   రాష్ట్రకన్వీనర్  సిహెచ్ చంద్రశేఖర్  విలేకర్ల సమావేశం లో ఆరోపించారు .  జే పి సి కాంట్రాక్టర్ మే 14 శుక్రవారం నుండి బాధ్యతలు స్వీకరించారు. మొదటి రోజే  దోపిడి ప్రారంభించారు, గతంలో ఏపీఎండీసీ  ఇసుక టన్ను 375 రూపాయలు ఉండగా, నేడది జెసిపి కాంట్రాక్టర్ కి 475 రూపాయలుకు  పెంచి ప్రజల పైన భారం మోపారు, కానీ కాంట్రాక్టర్ మాత్రం   ఆన్లైన్ లో కాకుండా మాన్యువల్ గా 625 రూపాయలు తో బ్లాక్ లో  అమ్ముతున్నారని తెలిపారు.  శాండ్ కార్మికుల్ని అనేకచోట్ల  తొలగిస్తున్నారని, తమిళనాడు నుంచి కార్మికులు తెచ్చుకొని   పని చేయించుకుంటున్నారని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి  శ్రీ వైయస్ జగన్మోహన్ రెడ్డి గారు స్థానికులకు 75% ఉపాధి కల్పిస్తామని ఇచ్చిన జీవో కాగితాలకు పరిమితమైందని ఆరోపించారు. ఇసుక దోపిడీ నీ  అరికట్టడంలో వైసిపి ప్రభుత్వం పూర్తిగా విఫలం అయింది అన్నారు, గత రెండు సంవత్సరాల నుండి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత  ఇసుక దొరకక 50 లక్షల మంది  భవన నిర్మాణ కార్మికులకు పనులు లేక  మరోపక్క కరోనాతో అర్ధాకలితో  అలమటిస్తున్నారు అని ఆందోళన వ్యక్తం చేశారు. సబ్ కాంట్రాక్టు రద్దు చేయాలని, ప్రస్తుతం పని చేస్తున్న కార్మికులను కొనసాగించాలని  డిమాండ్ చేశారు. అసలు ప్రకృతిలో వచ్చే ఇసుకను ధర పెట్టి అమ్మడం ఏమిటని ప్రశ్నించారు. జగన్మోహన్రెడ్డి ఏమైనా పంట పెట్టి సాగు చేసి ఉత్పత్తి చేస్తున్నాడా  అని ప్రశ్నించారు.  ఏడాది కష్టపడే పంట పండించే  బియ్యం కిలో రూపాయికే ఇస్తుంటే, ఇసుక మాత్రం కిలో 6 నుండి పది రూపాయలకు అమ్ముతున్నారని ఇదే ప్రభుత్వం దోపిడి ప్రభుత్వ మా అని ప్రశ్నించారు.  ఇసుక ఇది అతిపెద్ద కుంభకోణం అన్నారు.దీనితో అభివృద్ధి ఆగిపోతుందని, పేదవాడి ఇల్లు కట్టుకునే పరిస్థితి లేదని, కాంట్రాక్టర్లు  బినామీ మంత్రులు మాత్రమే బాగుపడతారని తెలిపారు. తక్షణం ఇసుక ప్రైవేటుపరం రద్దు చేయాలని,  ఏపీ శాండ్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించాలని డిమాండ్ చేశారు.  దీని కోసం అందరూ పోరాటానికి సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. స్థానికులుకు  ఉపాధి కల్పించాలని ఎక్కడికక్కడ  నిలదీయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏపీ వ్యవసాయ కార్మిక సంగం జిల్లా నాయకులు ఎస్ .చెన్నయ్య, సి ఐ టి యు మండల కన్వీనర్ గంగాపూర్ సుధాకర్ పాల్గొన్నారు.