ప్రధాని ఆచూకీ ఎక్కడ?

273

దేశంలో కరోనా ఉధృతి వేళ ప్రధాని మోదీ కనిపించడం లేదని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కరోనా వ్యాక్సిన్లు, ఆక్సిజన్, మందులతో సహా ప్రధాని మోదీ కనిపించకుండా పోయారని, మనకు ఇక మిగిలింది మోదీ ఫొటోలే అని ట్విట్టర్ లో విమర్శించారు. దేశంలో ప్రస్తుతం వ్యాక్సిన్లు కూడా అందుబాటులో లేవని, కోవిడ్ సెకండ్ వేవ్ విజృంభణ తో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయని రాహుల్ ఆవేదన వ్యక్తం చేశారు