మాట నిలుపుకున్న గురజాల ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి

473

పిడుగురాళ్ల లో 500 పడకలతో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాట్లు పూర్తి
ప్రారంభోత్సవానికి సిద్ధం
గురజాల ఆర్డీవో పార్థసారథి వెల్లడి

పిడుగురాళ్ల సాయి తిరుమల ఆక్స్ఫర్డ్ పాఠశాలలో 500 బెడ్ల తో కోవిడ్ సెంటర్ ఏర్పాట్లు పూర్తి చేసుకొని ప్రారంభానికి సిద్ధంగా ఉన్నట్లు గురజాల ఆర్డీవో పార్థసారథి తెలిపారు

కరోనా సెకండ్ వేవ్ ఉధృతంగా వున్న నేపథ్యంలో ఆస్పత్రులలో బెడ్ లు దొరక్క ప్రజలు ఇబ్బంది పడుతున్న విషయాన్ని గమనించిన గౌరవ శాసనసభ్యులు కాసు మహేష్ రెడ్డి ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లి పల్నాడులో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటు చేయవలసిందిగా కోరారని తెలిపారు.

ఈ నేపథ్యంలో గౌరవ జిల్లా కలెక్టర్ పిడుగురాళ్ల లో కోవిడ్ కేర్ సెంటర్ ఏర్పాటుకు తగు చర్యలు తీసుకోవాల్సిందిగా ఆదేశించినట్లు ఆర్డిఓ తెలిపారు

నలుగురు డాక్టర్ల నిరంతర పర్యవేక్షణలో కోవిడ్ కేర్ సెంటర్ నడపబడుతుందని
ఆర్డీవో పార్థసారథి తెలియజేశారు