ఏపీ వారి ఓట్లు కావాలి కానీ…

545

ఏపీ వారి ఓట్లు కావాలి కానీ.. వాళ్ళకు వైద్యం మాత్రం ఇవ్వరా ?అని బిజేపి ఎమ్యెల్యే రాజసింగ్ తెలంగాణ సర్కార్ పై నిప్పులు చెరిగారు. ఏపీ నుంచి వచ్చే అంబులెన్సులను ఆపడం సరైన చర్య కాదని మండిపడ్డారు. సిఎం కెసిఆర్ హైదరాబాద్ ను మెడికల్ హాబ్ అని అంటారు.. హైదరాబాద్ వైద్యం కోసం వస్తే.. నిబంధనలు పెడతారా ? అని నిలదీశారు. ఏపీ నుంచి వచ్చే రోగులను ఆపడం చాలా దారుణమన్నారు. ఇది ఇలా ఉండగా.. తెలంగాణ సరిహద్దు పుల్లూరు చెక్ పోస్టు వద్ద బారులు తీరాయి ఏపీ అంబులెన్సులు.  హైద్రాబాద్ వెళ్లేందుకు అనుమతి నిరాకరిస్తున్నారు తెలంగాణ పోలీసులు.  పడిగాపులు కాచి అంబులెన్సులోనే  ఇద్దరు రోగులు ప్రాణాలు కోల్పోయారు. అటు పదుల సంఖ్యలో వెనక్కు వెళ్లిపోయాయి అంబులెన్సులు.