ముస్లింసోదరులకు బండారు దత్తాత్రేయ రంజాన్ శుభాకాంక్షలు

357

రంజాన్  పర్వదినాన్ని పురస్కరించుకొని హిమాచల్ ప్రదేశ్ రాజ్ భవన్ లో గవర్నర్  బండారు దత్తాత్రేయ  ముస్లింసోదరులు సోదరీమణులకు పండ్లు, మిఠాయిలను అందించి రంజాన్  పండుగ శుభాకాంక్షలు తెలిపారు.

రంజాన్  పర్వదినాన్ని పురస్కరించుకొని ప్రస్తుతం నెలకొన్న కోవిడ్ పరిస్థితుల దృష్ట్యా పరిమిత సంఖ్యలో హిమాచల్ రాజ్ భవన్ లో నేడు తనను కలిసిన ముస్లిం సోదరులు సోదరీమణులకు  పండ్లు, మిఠాయిలను అందించి రంజాన్ పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ఈ పర్వదినం సందర్భంగా బండారు దత్తాత్రేయ.., కేంద్రమంత్రి ముక్తార్ అబ్బాస్ నక్వీ , కేరళ గవర్నర్  ఆరిఫ్ మొహమ్మద్ ఖాన్  , మణిపూర్ గవర్నర్ నజ్మా హెప్తుల్లా , తెలంగాణ హోమ్ స్ఖఖామాత్యులు  మహమూద్ అలీ , సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి శ్ఖాద్రీ , మాజీ కేంద్రమంత్రి షానవాజ్ హుస్సేన్, తెలంగాణ రాష్ట్ర బీజేపీ మైనార్టీ మోర్చా అధ్యక్షులు అఫ్సర్ పాషా కి,   సిపిఐ నాయకులు మాజీ పార్లమెంట్ సభ్యులు అజిజ్ పాషా , జాతీయ వక్ఫ్ బోర్డు సభ్యులు శ్హనీఫ్ అలీ , బిజెపి జాతీయ మైనారిటీ మోర్చా నాయకులు లాయక్ అలీ తదితర ప్రముఖులకు, ఇతర ముస్లిం సమాజ పెద్దలకు  చరవాణిలో శుభాకాంక్షలు తెలిపారు. . అలాగే భారత క్రికెట్ మాజీ కెప్టెన్ అజారుద్దీన్, క్రికెటర్ సిరాజ్, శాసనమండలి సభ్యులు మహమ్మద్ సలీం, బోధన్ శాసనసభ్యులు షకీల్ అహ్మద్, తెలంగాణ రాష్ట్ర మైనారిటీ కమిషన్ చైర్మన్ కుమార్ఉద్దీన్, తెలంగాణ రాష్ట్రం నుంచి తొలి మహిళా సివిల్ సర్వీసెస్ అధికారిని జమీల్ ఫాతిమా  కూడా శుభాకాంక్షలు తెలిపారు.

కరోనా  వైరస్ మహమ్మారి విజృంభిస్తున్న ఈ సమయంలో అందరూ ప్రభుత్వం నిర్దేశించిన తగు జాగ్రత్తలు పాటిస్తూ, ఏ మాత్రం అధైర్యం చెందకుండా మహమ్మద్ ప్రవక్త పట్ల దృఢమైన విశ్వాసం కనబరచి  ఆ అల్లాహ్ కరుణాకటాక్షాలు పొంది విజేతలుగా నిలవాలని  దత్తాత్రేయ  పిలుపునిచ్చారు.
పవిత్ర రంజాన్ మాసంలో 30 రోజులుగా కఠిన ఉపవాస దీక్షలు పాటించి నేడు నెలవంక దర్శనంతో ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు జరుపుకుంటున్న ఉభయ తెలుగు రాష్ట్రాల ముస్లిం సోదర సోదరీమణులందరికీ హిమాచల్ ప్రదేశ్  గవర్నర్ బండారు దత్తాత్రేయ  హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. ఈ ఈద్-ఉల్-ఫితర్ వేడుకలు ముస్లింల సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీక అని వారు పేర్కొన్నారు. రంజాన్  పండుగ అందరి జీవితాలలో సుఖ,శాంతులను, సౌభాగ్యాలను వర్ధింప జేయాలని, అదే విధంగా అందరిలో సరికొత్త ఉత్తేజాన్ని నింపి, ప్రతీ కుటుంబం ఆనందంతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నట్లు తెలిపారు.