జపాన్‌లో భారీ భూకంపం

708

జపాన్‌లో మరో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్‌ స్కేల్‌పై 6.0 తీవ్రతతో భూ ప్రకంపనలు వచ్చాయని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మోలజీ వెల్లడించింది. హోన్‌షు తూర్పు తీరంలో ఉదయం 5:28 గంటలకు భూ ప్రకంపనలు వచ్చాయని పేర్కొంది. అణు విద్యుత్ కేంద్రానికి సమీపంలో భూకంపం సంభవించినప్పటికీ ఇప్పటి వరకు నష్టం జరిగినట్లు ఎలాంటి నివేదికలు రాలేదని పేర్కొంది. ఇదిలా ఉండగా , ‘రింగ్‌ ఆఫ్‌ ఫైర్‌’ భూకంప జోన్‌లో జపాన్‌ ఉందని, దీంతో భారీ భూకంపాలు సంభవిస్తున్నాయని ఇక్కడి అధికారులు వెల్లడించారు.