వైద్య సిబ్బందిపై దాడి చేసిన పోలీసులను సస్పెండ్ చేయాలి !

440

ఏపిఎన్జివో సంఘం రాష్ట్ర సంఘ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు.

విజయవాడ, 13-5-2021:-  కుటుంబాల శ్రేయస్సును, తమ ఆరోగ్య పరిస్తితులను లెక్కచేయక, కరోనా బారిన ప్రజలను కాపాడుటయే తమ భాద్యతగా గుర్తుంచి, సేవలు చేయుచున్న వైద్య సిబ్బందిపై నిన్న (బుధవారం) రాజమహేంద్రవరంలో దాడి చేసిన సి.ఐ. దుర్గాప్రసాద్, ఇతర సిబ్బందిని వెంటనే సస్పెండ్ చేయాలనీ ఏపిఎన్జివో రాష్ట్ర సంఘ అధ్యక్ష్య, ప్రధాన కార్యదర్శులు  నలమారు చంద్ర శేఖర్ రెడ్డి, బండి శ్రీనివాసరావులు పత్రికా ప్రకటన ద్వారా ప్రభుత్వాన్ని, డి.జి.పి.  గౌతం సవాంగ్ ని డిమాండ్ చేసారు .

కరోనా మొదట దశలో పోలీసులు ప్రదర్శించిన అత్యుత్సాహంతో అనేకమంది ప్రజలు పడ్డ కష్టనష్టాలను దృష్టియందుచుకొని, రాష్ట్ర అత్య్యున్నత నాయయస్థానం ఇచ్చిన ఆదేశములను అనుసరించి ప్రభుత్వం ఇప్పటి కర్ఫ్యూ ప్రకటించిన వెంటనే పోలీస్ శాఖను ఉద్దేశించి డి.జి.పి  గౌతమ్ సవాంగ్  కర్ఫ్యూ మాటున ప్రజలను ఇబ్బందుల పాలు చేసే పోలీసుల పట్ల కఠినంగా వ్యవహరిస్తామని స్పష్టమైన ఆదేశాలను ఇస్తూ, పత్రిక ముఖంగా కూడా ప్రకటించినప్పటికీ ఇటువంటి సంఘటనలు జరగటం దుర దృష్ట్రకరమని వారు అన్నారు. తమ గుర్తింపు కార్డులను చూపినప్పటికి పోలీసులు దురుసుగా ప్రవర్తించటం వంటి చర్యలను చూస్తే, ఇక మీదట వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది ఎవరు విధులు నిర్వహించలేని పరిస్థితులు కల్పించిన వారవుతారని, తద్వారా ప్రజల ప్రాణాలతో చెలగాటమాడే ఇటువంటి దుందుడుకు పోలీసులుపై చర్యలు తీసుకొని, ఫ్రంట్ లైన్ వారియర్స్ అయిన వైద్య ఆరోగ్య శాఖా సిబ్బందికి మరియు ఇతర శాఖల ఉద్యోగులకు ధైర్యాన్ని, స్తైర్యాన్ని ఇవ్వవలిసిన భాద్యత ప్రభుత్వంపై ఉందని, కావున వెంటనే నర్సు హేమలత దంపతులపై అమానుషంగా ప్రవర్తంచిన సి.ఐ దుర్గాప్రసాద్ ఇతర సిబ్బందిని సస్పెండ్ చేయాలని వారు కోరారు.

అలాగే నిన్న రాత్రి పోలీసు స్టేషనులో బాధిత దంపతులతో రాజీ ప్రయత్నాలను నెరిపిన పోలీసు అధికారులపై కూడా చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ కరోనా కష్టకాలంలో ఫ్రంట్ లైన్ వారియర్స్ ను అన్ని విధాల ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని వారు పేర్కొంటూ, ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని, రాష్ట్ర డి.జి.పి గౌతం సవాంగ్ ని, తూర్పు గోదావరి జిల్లా కలెక్టరు, పోలీసు సూపరిటెండెంటు మరియు ఇతర అధికారులను కోరారు.

ఇటువంటి సంఘటనలు రాష్ట్రంలో మరెక్కడ జరగకుండా, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖా మాత్యులు, హోం శాఖ మాత్యులు తమ తమ సిబ్బందికి తగు ఆదేశాలు ఇవ్వాలని వారు విజ్ఞప్తి చేసారు.ముఖ్యంగా హేమలత దంపతులకు తగిన రక్షణ కల్పించాలని అలాగే ఇతర ఫ్రంట్ లైన్ వారియర్స్ అందరికీ తగిన రక్షణ కల్పించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. వెంటనే సి.ఐ దుర్గాప్రసాద్ ఇతర పోలీస్ సిబ్బందిని సస్పెండ్ చేసి బాధితులకు న్యాయం చేయాలని వారు విజ్ఞప్తి చేసారు.