ఘోర కలి

313

ఈ దేశంలో
తిండిలేనివాళ్ళే కాదు
గిన్నెలు లేనివాళ్ళు కోకొల్లలు!
దరిద్రం పట్టిపీడిస్తున్నప్పుడు
ధర్మం నాలుగుపాదాలపై ఏమికర్మ
నలబై పాదాలపై నడుస్తుంది!
నాలుగు మెతుకులు నోటికెళ్ళనివాడు
అన్యాయాలను ఎలా ఎదిరిస్తాడు?
మానవత్వం చచ్చిన చోట
పెద్దగా ఆశించడం దండగే!

ఇలాంటి ఘోరాలు ఎన్ని చూడాలో!
ఇలాంటి నేరాలు ఇంకెన్ని వినాలో!
భవిష్యత్ స్పష్టంగానే కనిపిస్తోంది!
ఇప్పుడు గిన్నె లాక్కిపోయినోడు
రేపు అన్నం లాక్కుపోడనే గ్యారెంటీ లేదు!
తట్టుకునే ధైర్యం ఉందా?
అయితే బ్రతుకుండు!!

 – డా.గూటం స్వామి
                                                                                 (9441092870)