తెలంగాణలో మారిన బ్యాంకుల టైమింగ్స్..

233

తెలంగాణలో లాక్‌డౌన్‌ నేపథ్యంలో బ్యాంకుల పనివేళల్లో మార్పులు చోటు చేసుకున్నాయి. ఇవాళ్టి (గురువారం) నుంచి ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు బ్యాంకులు పనిచేయనున్నాయి. బ్యాంక్‌లో 50% సిబ్బందితో సేవలు అందించనున్నారు. ఈ నెల 20 వరకు ఈ పనివేళలు కొనసాగుతాయి. తెలంగాణ సర్కార్ లాక్ డౌన్ నిర్ణయం తీసుకోవడంతో స్టేట్ లెవెల్ బ్యాంకర్స్ కమిటీ నిన్న సమావేశమై.. ప్రభుత్వ నిర్ణయానికి సహకారం అందిస్తూనే వినియోగదారులకు కూడా సేవలు అందించాలని ఈ నిర్ణయం తీసుకుంది.   బ్యాంక్‌లో 50% సిబ్బంది మాత్రమే హాజరు కావాలని..రోజు విడిచి రోజు విధులకు హాజయ్యేలా స్టాఫ్ కు సర్క్యులర్ జారీ చేసింది.