మరోసారి మానవత్వం చాటుకున్న భూమన కరుణాకర రెడ్డి

276

గత సంవత్సరం కరోనా విజృంభించిన సమయం నుండి తిరుపతి శాసనసభ్యుడు  భూమన కరుణాకర రెడ్డి  ఆయన  కుమారుడు  భూమన అభినయ రెడ్డి  తిరుపతి నియోజకవర్గ ప్రజలకు అనుక్షణం అందుబాటులోనే ఉంటూ… సహాయక చర్యల్లో తమ వంతు సహాయం చేస్తూనే ఉన్నారు.

గత సంవత్సరం ఇలా తిరుపతి నియోజకవర్గ ప్రజల కోసం అనుక్షణం సహాయక చర్యల్లో ఉండటం కారణంగా ఎమ్మెల్యే కరుణాకర రెడ్డి  మరియు వారి కుమారుడు అభినయ రెడ్డికి రెండుసార్లు కరోనా వ్యాధి సోకిందనే విషయం తెల్సిందే.తిరుపతి నియోజకవర్గం నుంచి అత్యవసర పరిస్థితుల్లో ఏ ఒక్కరు సంప్రదించిన పార్టీలకు అతీతంగా సహాయ సహకారాలు అందించారు కరుణాకర రెడ్డి .

భూమన మానవత్వం చాటుకున్న వాటిల్లో ముఖ్యమైనది అనాధ శవాలకు దహన సంస్కారం. తిరుపతి నియోజకవర్గ పరిధిలో ప్రభుత్వ ఆసుపత్రిలో కరోనా కారణంగా చనిపోయిన వారికి దహన సంస్కారాలు చేయుటకు సొంత వారు ఎవరూ ముందుకు రాకపోవడం గమనార్హం.
వాటిని అలా వదిలి వేయకూడదని…. వారి ఆఖరి ప్రయాణం సగౌరవంగా సాగాలని ఆయన భావించారు.
అనాధ శవాలకు అన్నీ తానై దహన సంస్కారాలు చేసి మానవత్వం చాటుకున్న భూమన గార. ఈ రోజు కూడా ఏడు అనాధ శవాలకు అన్ని తానై దాన సంస్కారాలు చేశారు. ఈ విషయం సామాజిక మాధ్యమాల ద్వారా యావత్ దేశం మొత్తం తెలియడంతో ప్రధానమంత్రి కార్యాలయం వారు కూడా కోవిద్ రివ్యూ మీటింగ్ లో కరుణాకర రెడ్డి చేసిన మంచి కార్యక్రమాన్ని గుర్తించి అభినందనలు తెలియజేశారు.