ఇస్రాయెల్ గురించి…

769

ఓ 5 లేదా 6 ఏళ్ల క్రితం అనుకుంటా..
ఈనాడు న్యూస్ పేపర్ లో ఇజ్రాయెల్ గురించి ఓ న్యూస్ చూసా…
ఆ ఫోటో తీసి పెట్టుకున్నా కానీ ఎక్కడో స్టోరేజ్ లో ఉంటుంది..
ఆ న్యూస్ లోని సారాంశం..

” మా ఇజ్రాయెల్ మీద నిన్న అర్ధరాత్రి శతృదేశానికి సంబంధించిన యుద్ధవిమనాలు విరుచుకుపడ్డాయి, మేము వాటిని సమర్ధవంతంగా తిప్పికొట్టాము..
తర్వాత మా మీద దాడి చేసిన వారిపై మేము కూడా ఎదురుదాడికి దిగాము కానీ వాళ్ళు దాన్ని ఎదుర్కోలేక ప్రాణాలు పోగొట్టుకున్నారు ఇందులో మా తప్పేముంది. ”

– ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నేతన్యాహు స్టేట్మెంట్

మమ్మల్ని కొట్టారు మేము తట్టుకున్నాం..
మేము కొట్టాం తట్టుకోలేక చచ్చిపోయారు.. దానికి మేమేం చేయాలి..
అని చాలా సింపుల్ గా ప్రపంచదేశ మీడియాకి చెప్పాడు ఎవడ్రా వీడు అనుకుని అప్పుడు ఇజ్రాయెల్ గురించి చూడటం మొదలుపెట్టా..

* చుట్టూ సుమారు 50  ముస్లిం దేశాలు,
* అందులో పాతిక పైగా ఉగ్రవాద భావజాలం తో నిండిపోయిన దేశాలు
* ఇజ్రాయెల్ మీద ఎప్పుడు పగతో రగిలిపోయే దేశాలు..
* ఇజ్రాయెల్ చూస్తే యూదా దేశం..
* మన యేసు ని కొట్టి చంపేసిన దేశం..
* పట్టుమని కోటి మంది జనాభా కూడా ఉండరు
* అనంతపురం జిల్లా అంత వైశాల్యం కూడా ఉండదు..

ఏంట్రా వీళ్ళ తెగింపు అనుకున్నా..
కానీ అది తెగింపు కాదు దేశభక్తి అని తరువాత అర్ధం అయింది..
కోటి మంది జనాభా ఉన్న దేశంలో కోటి మందికి ఇజ్రాయెల్ అంటే ప్రేమ , ప్రాణం .ఇజ్రాయెల్ కోసం అవసరం అయితే ఆ కోటి మంది చావడానికి సిద్ధం..
60 లక్షల మంది యూదులను క్రైస్తవుడైన హిట్లర్ ఊచ కొత కోసి చంపేస్తే
ఆ చరిత్ర ని ఎప్పటికీ మర్చిపోకూడదని ఇజ్రాయెల్ ప్రభుత్వం 60 లక్షల మంది పేర్లను నిరంతరం వినిపించేలా ఒక మ్యూజియం లో వాయిస్ ఏర్పాటు చేసింది, ఆ మ్యూజియం మొత్తం ఇజ్రాయెల్ పై ప్రపంచం లో ఉన్న అన్ని దేశాలు చేసిన దాడులు దానివల్ల చనిపోయిన యూదుల మారణహోమాలు, అత్యాచారాలకి సంబంధించి ఉంటుంది.

ఈ మ్యూజియంకి వచ్చిన ప్రతీ యుదుడికి రక్తం మరుగుతుంది తన జాతిపై జరిగిన దాడి గుర్తొస్తుంది , మళ్ళీ ఇక భవిష్యత్ లో అలా జరిగే అవకాశం ఇవ్వకూడదు అనే కసి కలుగుతుంది..
అందుకే ఇజ్రాయెల్ పై ఎవడైనా దాడి చేయాలి అని ఆలోచన రాగానే వీల్లే ముందు దాడి చెసి వాళ్ళని సర్వనాశనం చేస్తారు…

ఇప్పుడు మన దేశంకి వద్దాం మన దేశంలో సేవ్ సిరియా, సేవ్ పాలస్తీనా అని వాళ్ళు ముస్లింలు అయినంత మాత్రాన వాళ్ళకి సపోర్ట్ చేసేవాడు మన ఇంటిపక్కనే ఉంటాడు.. పాకిస్థాన్ ఇండియపై క్రికెట్ లో గెలిస్తే పండగ చేసుకునే వాళ్ళు మన హైదరాబాద్ నడి బొడ్డులో ఉంటారు,చైనాపై మనం దాడి చేస్తే ఏడ్చేవాళ్ళు కమ్యూనిస్ట్ , నాస్తిక ,హేతువాద సంఘాల రూపంలో ఉంటే,అమెరికా బ్రిటన్ దేశస్థులు మా పూర్వీకులు అని చెప్పుకునే పాస్టర్ లు ప్రతీ ఊర్లో ఉంటారు..వీళ్లంతా ఒక రకమైన దేశవ్యతిరేకులు..

ఇక మన చరిత్ర చెప్పే నాధుడే లేడు, మన జాతి మీద ఎన్ని దాడులు జరిగాయో భావితరాలకు చెప్పే ఉధ్యేశం ఇప్పటివరకు భారతదేశంలో ఏ ప్రభుత్వానికి లేదు.. అసలు చరిత్ర మీద చిత్తశుద్ధి ఉన్న ప్రభుత్వం ఇంతవరకు ఒక్కటి కూడా లేదు.. మలినం అయిపోయిన పాఠ్యపుస్తకాలు..మసక బారిన చరిత్ర.. విదేశీయుల కి బానిసలం అనుకునే బావదాస్యం. మన భారతీయులకు అలవాటు ఐపోయింది.. లేదు చేశారు..

చరిత్రను బలవంతంగా భారతీయ యువకుల మెదళ్లలోకి వివిధ రూపాల్లో చెప్పిస్తే తప్ప భావితరాలకి భారతదేశం, హిందు ధర్మం మిగలదు.. ఇది ఖచ్చితంగా అతిత్వరగా చేయవలసిన పని.. దీనిపై హిందు సమాజం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉంది..

– కళ్యాణ్ కుమార్ చెట్లపల్లి
(శివశక్తి)