అప్పుడు అమిత్ షాను అరెస్ట్ చేసిన ఆఫీసర్ ఇప్పుడు తమిళనాడు DGP

221

తమిళనాడు కొత్త డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (DGP) నియామకం వివాదాస్పదం అయ్యింది. MK స్టాలిన్ నేతృత్వంలో కొత్తగా DMK ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక… కాస్త ఆచితూచి వ్యవహరించే స్టాలిన్… మరీ బీజేపీతో తాడో పేడో తేల్చుకునేలా వ్యవహరించరులే అనుకున్నారు చాలా మంది. కానీ ఆయన తీరు చూస్తుంటే… కమలంతో కుస్తీకి రెడీ అన్నట్లుగానే ఉంది. ఐపీఎస్ ఆఫీసరైన పి. కందస్వామిని… DGPగా నియమించారు. ఈ కందస్వామి… 2010లో అమిత్ షాను అరెస్టు చేశారు. ఇప్పుడు కేంద్ర హోంమంత్రిగా ఉన్న అమిత్ షా… అప్పట్లో గుజరాత్ రాష్ట్ర హోంమంత్రిగా ఉన్నారు. సోహ్రబుద్దీన్ షేక్ ఎన్‌కౌంటర్ కేసులో ఆయన్ని అరెస్టు చేశారు కందస్వామి. ఇప్పుడు ఆయన్ని విజిలెన్స్ అండ్ యాంటీ కరప్షన్, డీజీపీగా తమిళనాడు ప్రభుత్వం నియమించింది.