రాటుదేలుతున్న రాజుగారు!

526
( సతీష్ )
రఘురామకృష్ణంరాజు గారు…!అనేక సందేహాలకు సమాధానం చెబుతున్నారు.

జగన్ లాంటి వ్యక్తికి కంటిలో నలుసు లా మారటం ..ముందు లైట్ తీసుకున్నారు…‌కాని వ్యతిరేక స్వరాన్ని ఆసక్తి గా ఆలకించారు.
తర్వాత.‌ఇసుక..మద్యం..తదితర అవకతవక నిర్ణయాలను ఆయన విమర్శించినప్పుడు ఆలోచనలో పడ్డారు.
తర్వాత ప్రభుత్వ విధానాలను..ప్రజల కోణంలో ..ప్రజల గొంతు ను వినిపించటాన్ని స్వాగతిస్తున్నారు.
విమర్శల తీవ్రత పెరిగిన తర్వాత ఆయన ధైర్యాన్ని మెచ్చుకోకుండా ఉండలేకపోతున్నారు.
రాజుగార్ని ఇన్నాళ్ళు..సంపన్నుడు..విలాస పురుషుడు..కోడిపందాల సరదాల మనిషి..మంచి ఆతిధ్యం ఇచ్చే..వ్యక్తి ..!
స్నేహపాత్రుడు..అనుకున్నవారు..ఇప్పుడు ఒకింత ఆశ్చర్య చకితులవుతున్నారు.
ఆయన తెగింపు..తెగువ ..విషయం ..ప్రజల్లోకి తీసుకెళుతున్న తీరు కచ్చితంగా అందరికీ చేరుతుంది.
ఆయన చెప్పే తీరు ఏకపక్ష దాడి లాగ కాకుండా…హావభావాలు..వెటకారం..ఒక్కోసారి పగలబడి నవ్వుకునేలా ఉంటున్నాయి.
సమకాలీన నాయకులెవరూ..ఇలా చెప్పటం లేదు.
ఆయన రచ్చబండ..లో..విషయం..తెరవెనుక భాగోతాలు..బూట్లు నాకే యవ్వారాలను బట్టబయలు చేస్తున్నారు.
మేకవన్నె పులులు..జిత్తులమారి నక్కల బుద్ది బద్దలు కొడుతున్నారు.
చాలా పద్దతిగా..చక్కగా..వివరంగా..ఏం జరుతుంది..ఏం జరగబోతుంది..అన్నది తెలియచేస్తున్నారు.
బెయిల్ రద్దు పిటీషను..కనీసం రెండుకోట్ల మంది అభిమానులను సంపాదించి పెట్టి ఉంటుంది.
అదే సమయంలో వారు కొంత సంయమనం పాటిస్తే..వారి రచ్చబండ కోసం యావత్తు తెలుగు ప్రజలు ఎదురు చూసే పరిస్ధితి రావచ్చు.
ఒక్క సైకో ఫాన్స్ కి మాత్రం నచ్చడు ఆయన..అది సహజం..!
రాజు గారు..శ్రీరెడ్డి లాంటి వారికి స్పందించవద్దు.
కాకపోతే అంతకు మించిన వారిచేత ఆమెకు కౌంటర్ ఇప్పించాలి.
రాజుగారు జగన్ వ్యతిరేకుల మనసు గెలుచుకున్నారు.‌పార్టీలతో సంబంధం లేకుండా..!
ఆ తెగింపు ..ధైర్యం ఆయనదేనా..వెనుక ఎవరున్నారన్న సందేహం తో సంబంధం లేకుండా ..ఆయనకు అభిమానులు..పెరిగారు. మొత్తం మీద రాజు గారు..సూపర్!