అవునా?.. అన్నీ మోదీనే చేశారా? అయితే..

930

మోడీ నిజంగానే ఫెయిల్ అయ్యాడు..
కరోనా కట్టడిలో నిజంగానే ఫెయిల్ అయ్యాడు..
ఢిల్లీ నుండి వచ్చి నీ మూతికి మాస్క్ పెట్టలేదు..
నీకు పనిలేపోయినా బైటికి వెళ్ళు వెళ్ళన్నాడు..

నీ ప్యాంటు జేబులో శానిటైజర్ పెట్టి పోలేదు..
దోస్తులతో దావత్ చేసుకుంటుంటే వచ్చి.. దూరం దూరం ఉండండని కాపలా కాయలేదు..
వ్యాక్సిన్లు వేసుకోవద్దని మనల్ని బాగా భయపెట్టాడు..

నిర్లక్ష్యంగా ఉండండి. మనల్ని ఎవరూ ఏమీ చేయలేరని చెప్పాడు..

ఇలా చాలా తప్పులు చేసాడు కదా…?

ఆశ్రద్దగా ఉన్నది మనం..
లైట్ తీసుకున్నది మనం..
తప్పులు చేసింది మనం..
నిర్లక్ష్యంగా ఉన్నది మనం..

మన తప్పుల్ని ఇంకొకరిమీద నెట్టి, మన తప్పుల్ని దాచడం..
మనం చేసుకున్న పాపాలను ఇతరులపై నెట్టి నిందించడం మాత్రం మంచిగా చేస్తాం..
ఇందులో మనం సిద్ధహస్తులం!

మనం మాస్క్ పెట్టుకోకుండా,శానిటైజర్ వాడకుండా, కరోనా అంటే లైట్ తీసుకున్నది మనం..
మళ్ళీ సెకండ్ వేవ్ మీదపడితే అప్పుడు మోడీ మీద ఏడుస్తాం!

వ్యాక్సిన్లు వేసుకుంటే చస్తున్నారు అని భయపెట్టిన అదే మీడియా ..ఇప్పుడు వ్యాక్సిన్స్ ఇవ్వడంలో మోడీ ఫెయిల్ అంటున్నారు..

కార్పొరేట్ల కోసమే తప్ప, ఈ వ్యాక్సిన్ల వల్ల ఉపయోగం లేదు అన్న కాంగ్రెస్,కమ్యూనిస్టులే.. ఇప్పుడు వ్యాక్సిన్లు ఏవి అని అడుగుతున్నారు?

ఆక్సిజన్ ప్లాంట్స్ పెట్టుకోమని అనుమతులు,నిధులు ఇచ్చినా పెట్టుకోని రాష్ట్ర ప్రభుత్వాలది మాత్రం తప్పు కాదు..
ఒక్క మోడీదే బాధ్యత కదా..?!

ప్రపంచమంతా ఇబ్బందుల్లో ఉంటే వ్యాక్సిన్లను ఆనాడు మోడీ ఉదారంగా పంపించాడు..
దీన్ని కూడా తప్పు పట్టిన ఎదవల ఏడుపుకు సమాధానం!
ఇప్పుడు అదే ప్రపంచం మళ్ళీ మనం ఇబ్బందుల్లో ఉంటే, తిరిగి మనకు ఊహించనంత సహాయం చేస్తుంది..
మంచి ఎప్పుడూ తిరిగి మంచి చేస్తుంది!
తప్పులు మనవి..నిందలు మాత్రం మోడీ కా ?…

టెస్టులు చేయని రాష్ట్రాలను ఎందుకు చేయడం లేదని ఎవ్వడు అడగడు..
వ్యాక్సిన్ వృదాచేసిన అసమర్థ రాష్ట్ర నాయకులను ప్రశ్నించడం చేతకాదు..
పేషేంట్లకు బెడ్లు, వసతులు కల్పించని రాష్ట్ర ప్రజాప్రతినిధులను అడిగే దమ్ములేదు..

కానీ..
అన్నిటికీ మోడీనే కారణం అని అనడానికి మాత్రం లగెత్తుకొస్తారు! ఏం చేస్తాం… అంతా భావదారిద్య్రం!!