మలేసియాలో రేపటి నుంచి లాక్ డౌన్

585

కరోనా పాజిటివ్‌ కేసులు పెరుగుదలతో మలేషియా ప్రభుత్వం దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ను విధించింది. ఈ నెల 12 నుంచి జూన్‌ 7వ తేదీ వరకు కొనసాగుతుందని ఆ దేశ ప్రధాని ముహ్యుద్దీన్‌ యాసిన్‌ వెల్లడించారు. మలేషియా కరోనా థర్డ్‌ వేవ్‌ను ఎదుర్కొంటోందని, ఇది జాతీయ సంక్షోభాన్ని రేకేత్తిస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. సామాజిక సమావేశాలతో పాటు ప్రయాణాలన్నీ నిషేధిస్తున్నట్లు తెలిపారు. విద్యా సంస్థలు మూసివేబడుతాయని.. అయితే, ఆర్థిక కార్యకలాపాలు కొనసాగుతాయన్నారు.