బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో ఈటల భేటీ

315

మాజీ మంత్రి ఈటల పలువురు రాజకీయ నేతలతో వరుసగా భేటీలు అవుతున్నారు. తాజాగా ఆయన బీజేపీ ఎంపీ ధర్మపురి అరవింద్‌తో సమావేశం అయ్యారు.  తాజా రాజకీయ పరిణామాలపై వారు చర్చించనట్లు తెలుస్తోంది. అంతకు ముందు రాజ్యసభ సభ్యులు డీ.శ్రీనివాస్‌ ఇంటికి వెళ్లిన ఈటల గంట పాటు ఆయనతో చర్చలు జరిపారు. ఈ క్రమంలో ఎంపీ ధర్మపురి అరవింద్‌ను సైతం ఈటల కలిశారు. దీంతో బీజేపీ ఎంపీ అరవింద్‌తో ఈటల భేటీ ఆసక్తికరంగా మారింది.

అరవింద్‌ కన్నా ముందు ఆయన డీఎస్‌తో సమావేశం అయ్యారు. దాదాపు గంటన్నర పాటు డీఎస్‌తో పలు అంశాలపై చర్చించారు ఈటల. ఇప్పటికే మాజీ ఎమ్మెల్సీ రాములు నాయక్‌, మాజీ ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ఎల్లారెడ్డి మాజీ ఎమ్మెల్యే ఏనుగు రవీందర్‌రెడ్డిలతో కూడా ఈటల భేటీ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఈటల రాజేందర్‌.. టీఆర్‌ఎస్‌ రాజ్యసభ సభ్యుడైన డీఎస్‌తో భేటీ కావటం రాజకీయంగా చర్చనీయ అంశంగా మారింది. ఇక గత కొన్ని రోజులుగా డీఎస్‌ టీఆర్‌ఎస్‌ పార్టీ పరమైన కార్యకలాపాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. దీంతో ఆయనతో పాటు… ఆయన కుమారుడు అరవింద్‌తో ఈటల భేటీ ఆసక్తికరంగా మారింది.