ఎవరు గొప్పవారు,ఆలోచించండి?

659

కరోనాని అంతం చేయడానికి ఏ జ్యోతిష్కుడు గాని.. ఏ బాబా  గాని..ఏ మంత్ర కాడు గానీ…మేమున్నాం అని వాళ్ళ మహిమలు చూపడానికి రారు.. ఎవడు నా తాయెత్తు కట్టుకో తగ్గిపోతుందని చెప్పడు.
ఏ ఫాస్టర్ కూడా మహిమ జలమో లేక తైలమో ఇచ్చి ఈ ప్రపంచాన్ని ఆదుకుంటామని ఎవడూ రానే రాడు. యజ్ఞ యాగాలను చేయడం వల్ల,వేదాలు వల్లే వేయడం వల్ల,బైబిల్,ఖురాన్ చదివి ప్రార్థనలు చేయడం వల్ల కరోన కామ్ గా ఉండదు.

ఇప్పుడు నీకు నాకు ఈ ప్రపంచానికి కుల, మత, వర్గ, జాతి, లింగ, ధనిక, పేద వంటి తేడా లేకుండా ఈ మహమ్మారి నుండి కాపాడేది ఒక్క వైద్యుడే. ఆయన శాస్త్రవేత్త గా మారి అహర్నిశలు కష్టపడుతున్నాడు. కొంతమంది ప్రాణాలు సైతం పోగొట్టుకున్నారు@

లక్షల,కోట్ల సంవత్సరాల క్రితమే, పుష్పక విమానాలు వున్నాయని, ప్లాస్టిక్ సర్జరీ లు వున్నాయని, ఒకే అండం తో వందల మంది ని పుట్టించే శక్తి వున్నదని చెప్పేవారంతా, అద్భుత మహిమలు ఉన్నవారని చెప్పినవాళ్లంతా చేతులెత్తేస్తే, మనం అలాంటి మోసగాళ్లపై కనీసం వారి వైపు ఊహ కూడా మళ్ళించలేక పోతున్నాము. వారిని ప్రశ్నించలేక పోతున్నాం. కానీ శాస్త్రవేత్తలు మేమున్నామని అభయమిస్తున్నారు..
ఏ కాలంలోనైనా నిజమైన మానవ శ్రేయస్సు కోరేది కేవలం విజ్ఞానమే…

శాస్త్రవేత్తలు-డాక్టర్లు లేకపోతే మన జీవన విధానం సాంకేతికంగా,ఆరోగ్య పరంగా ఇంకా పూర్వకాల జీవన విధానం లోనే ఉండేవాళ్ళం. వారి ప్రయోగాల వల్ల ఎలాంటి మహమ్మారి వ్యాధినయినా జయిస్తున్నాం.
మన పూర్వీకులు ఊరకనే అనలేదు మంత్రాలకు చింతకాయలు రాలవని, ఇట్టి విషయం మీకు కూడా తెలుసు. అయినా మూఢ నమ్మకాలతో నిండిపోయిన మన మైండ్ మారదు పూజలు-పురస్కారాలు,ప్రార్థనలు తగ్గించి మూఢ నమ్మకాలను వదిలేద్దాం..వీటికి బదులు..
ఆరోగ్య నియమాలు పాటిద్దాం.. సైన్స్ ని శాస్త్రవేత్తలను గౌరవిద్దాం.. కరోనా కట్టడికి  పాటు పడుతున్న అభినవ ఋషులు పారిశుద్ధ్య కార్మికులను , పోలీసులను , వైద్యులను  ప్రైజ్ చేద్దాం. మానవాళి మనుగడకై వ్యాక్షిన్ కోసం అవిశ్రాంతంగా  కృషిచేస్తున్న విజ్ఞాన శాస్త్రవేత్తలు మనందరికీ తీపికబురు త్వరలోనే అందించగలరని ఆశిద్దాం.