ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్‌ఆర్‌ మృతి

149

చైనాలో పుట్టిన కరోనా వైరస్  ఇండియాలో కల్లోలం సృష్టిస్తోంది. కరోనా మహమ్మారితో ప్రముఖ జర్నలిస్ట్, నటుడు టీఎన్ఆర్ (తుమ్మల నరసింహారెడ్డి ) మృతి చెందారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో నిన్న కోమాలోకి వెళ్లారు. వెంటిలేటర్ పై వైద్యం అందించినా.. ఆయన పరిస్థితి మెరుగు పడలేదు. ఆయన ఆరోగ్యం మరింత చేయి దాటడంతో.. కాసేపటి క్రితమే టీఎన్ఆర్ మృతి చెందారు. కాచిగూడలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో టీఎన్ఆర్  మృతి చెందారు. ఆయన మృతి వార్తా వినగానే..ఇటు జర్నలిస్ట్ లోకం, అటు చిత్ర పరిశ్రమ విషాదంలోకి వెళ్ళింది. యూ-ట్యూబ్ ప్రసారమయ్యే..  ఫ్రాంక్లి విత్ టీఎన్ఆర్ షోతో ఆయన బాగా పాపులర్ అయ్యారు. ఇక ఆయన మృతి పట్ల.. తెలుగు సినీ ప్రముఖులు దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు.