ఏయ్ సజ్జలా.. ఎవడ్రా నువ్వు.. నిప్పులు చెరిగిన రఘురామ

347

ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డిపై నర్సాపురం ఎంపీ రఘురామ కృష్ణ రాజు నిప్పులు చెరిగారు. ఏయ్ సజ్జలా ఎవడ్రా నువ్వు అంటూ తీవ్రస్థాయిలో వ్యాఖ్యలు చేశారు. తనను టార్గెట్ చేస్తూ ప్రత్యేకంగా మనుషులను నియమించారని.. సోషల్ మీడియాలో ఇష్టానుసారం వ్యాఖ్యలు చేయిస్తున్నారని ఆయన ఆరోపించారు. సోమవారం నాటి రచ్చబండ కార్యక్రమంలో మాట్లాడిన ఆయన.. సజ్జల సూచన మేరకు తనకు సుమారు ఒక వంద ఫోన్ కాల్స్ వచ్చాయి జగన్ రెడ్డి అని సీఎం జగన్ ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ‘‘నేను ఖాళీగా ఉంటానా రెడ్డీ. నీ దగ్గర నా మనుషులు కూడా ఉన్నార్రా. సజ్జల… సారీ బిజ్జల దిశానిర్దేశంతో.. నన్ను అసహనానికి గురి చేసి కేసులు వేద్దామని ప్లాన్ చేసినట్టు వాళ్లు చెప్పారు’’ అని ఆయన అన్నారు.

‘‘నీ ప్రభుత్వం పతనావస్థలో ఉంది. మీ కుట్రలను త్వరలోనే బయటపెడతాను. సైబర్ క్రైమ్ పోలీసులకు ఇవాళ నా వ్యక్తిగత కార్యదర్శి వెళ్లి ఫిర్యాదు చేశాడు. ఏపీ ప్రభుత్వం నుంచి ప్రాణహాని ఉందని లేఖలో తెలిపాను. వైసీపీ నుంచి బెదిరింపు కాల్స్ వస్తున్నాయని ఫిర్యాదులో పేర్కొన్నాను. నన్ను ట్రాప్ చేయడానికి ఓ మహిళ ద్వారా మెసేజులు పంపుతున్నారని చెప్పాను. ఏయ్ సజ్జల ఎవడ్రా నువ్వు.. ఆఫ్ట్రాల్ నువ్వో జర్నలిస్ట్.. అనధికార హోంమంత్రిలా వ్యవహరిస్తున్నావు. మహిళా హోంమంత్రికి ఎలాంటి అధికారాలు ఇవ్వకుండా అన్నీ వ్యవహారాలు చేస్తున్నావు. బహిరంగ చర్చకు సిద్ధమా… నువ్వు చెప్పేది నువ్వు చెప్పు.. నేను చెప్పేది నేను చెబుతా’’ అని సవాల్ విసిరారు.

‘‘బుద్ధి తెచ్చుకో.. పిచ్చి పిచ్చి వేషాలు వేయకు. కోర్టులు ఉన్నాయి. మీ వెదవ వేషాలు కనిపెట్టడానికి కోర్టులు ఉన్నాయి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నారన్న అహంకారం వద్దు. సజ్జల, వైఎస్ జగన్ మీ పరిధిల్లో ఉండండి. మీ చేతుల్లో పోలీసులు ఉన్నారని రెచ్చిపోకండి’’ అని రఘురామ ఆగ్రహం వ్యక్తం చేశారు