ఇప్పుడు నాదేశం మృత్యువు వలయంలో చిక్కింది…!

250

అసమర్థ పాలక వర్గాల
దుర్నీతి అవినీతి బంధుప్రీతికి
ఇప్పుడు నాదేశం
శవాల దిబ్బగా మారిపోయింది

చుట్టు కరోనా రోగుల బంధువుల
మౌన రోదనాలు ఒకవైపు

ఎప్పుడు ఎవరు చనిపోయిన
వార్త వింటామో
తెలియని దుస్థితి

అంబులెన్స్ సైరన్ మోతలు
చావు గంటికల్లా
స్మశాన వాటికలో

అర్ధరాత్రి అర్థంకాని భాషలో
ఏవో జంతువుల ఆర్తనాదాలు

నిరాశ నిస్పృహ గుండెల్లో
అలజడి ఆందోళన ఎందుకు
ఇంతటి
దురావస్థకు కారణమెవరు

విజ్ఞాన శాస్త్రం ద్వారా అంతరిక్షంలోకి
విహారించిన మానవుడు
గుడి,మసీదు,చర్చి అనే కల్పిత

మూఢనమ్మకాలతో
పతనం అంచుకు చేరిన

దుర్గతిని చూసి నిస్సహాయంగా
నిలబడి చూస్తూండిపోయిన
విజ్ఞాన శాస్త్రం

నేనిప్పుడు విశ్వగురునని
విర్రవీగి రొమ్ము చాచిన
ఆ మరగుజ్జు జ్ఞానులెక్కడా

తమ అసమర్థతను
కప్పిపుచ్చుకోవడానికి
పక్కదేశంపైనో

తన దేశ ప్రజలైన ఇతర మతాల
ప్రజలనో నింధారోపణాలతో
కాలంగడిపే పాలకుడి నుండి
ప్రజలు ఇంతకంటే
ఇంకేం ఆశించగలరు

రాతియుగాల పుక్కిటి పురాణా
అంధవిశ్వాస భక్తజన భజనకీర్తాధినేత
అసమర్థుతకు
ఓట్లేసి గెల్పించిన ప్రజలకు
అర్థమయ్యే లోపే

మరో భావోద్వేగపు బహిరంగ
చర్చకు తెరలేపే సన్నివేశాలను
ప్రజలు,ప్రపంచం చూడాలేమో…

ఇప్పుడు నాదేశం మృత్యువు
వలయంలోచిక్కింది నేనిప్పుడు
సైన్స్ అనే ఆయుధంతోనే
జయిస్తానను

నా ప్రజలకిప్పుడు ప్రపంచానికి
జ్ఞానం నేర్పిన

సిద్ధార్థుడి
భౌతిక జ్ఞానం వైపు ఆలోచించమని
వేడుకుంటాను…

 (అక్షర దండియాత్ర)