104 సేవలపై జగన్ కీలక నిర్ణయం..

95

రాష్ట్రంలో క‌రోనా కేసులు పెద్ద సంఖ్య‌లో న‌మోద‌వుతున్న త‌రుణంలో ఏపీ ముఖ్య‌మంత్రి వైఎస్ జ‌గ‌న్ స‌మీక్షను నిర్వ‌హించారు.  ఈ స‌మీక్ష‌లో కీల‌క నిర్ణ‌యాలు తీసుకున్నారు.  104 వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని ఆదేశించారు.  104 కు ఫోన్ చేసిన వెంట‌నే అవ‌స‌రం మేర‌కు బెడ్‌ల‌ను ఇచ్చే విధంగా వ్య‌వ‌స్థ‌ను బ‌లోపేతం చేయాల‌ని వైఎస్ జ‌గ‌న్ అధికారుల‌ను ఆదేశించారు.  బెడ్లు అవ‌స‌రం లేని వారిని క‌రోనా కేర్ సెంట‌ర్ల‌కు పంపాల‌ని, ప్ర‌తి ఆసుప‌త్రిలో ఆరోగ్య మిత్ర‌ను త‌ప్ప‌నిస‌రిగా అమ‌లు జ‌రిగేలా చూడాల‌ని జ‌గ‌న్ పేర్కోన్నారు.  ఇక వ్యాక్సినేష‌న్ కేంద్ర ప్ర‌భుత్వ ప‌రిధిలో ఉంద‌ని, కేంద్రం నిర్ణ‌యించిన కోటా మేర‌కే వ్యాక్సిన్ కొనుగోలు చేయాల్సి ఉంటుంద‌ని అన్నారు.  ఈ విష‌యం తెలిసి కూడా కొంద‌రు కావాల‌ని రాజ‌కీయాలు చేస్తున్నారని అన్నారు.