వర్క్ ఫ్రమ్ హోమ్ పై జగన్ రెడ్డి నిర్లక్ష్యం

274

సచివాలయ ఉద్యోగుల ప్రాణాలకు రక్షణ లేదు- కరోనాతో మరో ఉద్యోగి మృతి బాధాకరం- వర్క్ ఫ్రమ్ హోమ్ పై జగన్ రెడ్డి నిర్లక్ష్యం- పరుచూరి అశోక్ బాబు

రాష్ట్రంలో ప్రజలకే కాదు.. సచివాలయంలో పనిచేసే ఉద్యోగుల ప్రాణాలకు భద్రత లేకుండా పోయింది. ఇప్పటి వరకు దాదాపు 10 మంది సచివాలయ ఉద్యోగులు కరోనాతో ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది ఉద్యోగులు కరోనా బారిన పడ్డారు. రెవెన్యూ స్పెషల్ చీఫ్ సెక్రటరీ వద్ద పీఎస్ గా పనిచేస్తున్న పరమేష్ కరోనాతో పోరాడుతూ మృతి చెందడం బాధాకరం. సచివాలయ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించాలని ఎన్నో రోజులుగా డిమాండ్ చేస్తున్నా జగన్ రెడ్డి కనికరం చూపడం లేదు. ముఖ్యమంత్రి, మంత్రులు ఇంట్లో నుంచి కాలు బయట పెట్టకుండా ఉద్యోగులంతా ప్రభుత్వ కార్యాలయానికి రావాలని చెప్పడం కక్షసాధింపు చర్య కాదా? తాడేపల్లి ప్యాలెస్ నుంచి ముఖ్యమంత్రి కాలు బయట పెట్టి ఎన్ని నెలలు అవుతోంది? ఆరోగ్య శాఖ మంత్రి ఎన్ని ఆస్పత్రులను సందర్శించారు? ఉద్యోగుల ప్రాణాలు కాపాడేందుకు ఎలాంటి జాగ్రత్త చర్యలు చేపట్టడం లేదు. ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఉద్యోగులు తమ విధులు నిర్వర్తిస్తున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందోననే భయాందోళనలో ఉన్నారు. ఉద్యోగుల భద్రతను గాలికి వదిలేయడం శోచనీయం. తక్షణమే ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం కల్పించాలి. మరణించిన ఉద్యోగుల కుటుంబాలకు కోటి రూపాయల పరిహారం అందించాలి. కరోనా బారిన పడిన వారికి మెరుగైన చికిత్స అందించాలి.