అవును.. వాళ్లు భారతీయులే కదా?

634

ఒక కరోనా బెడ్ మీద ఇద్దరిని పెడితే, ఒక మనిషి శవంగా మారినా కూడా, రెండు గంటల పాటు అదే శవంతో పక్కనే పడుకోవడం ఆ రోగికి ఎంత నరకం…. ఇటువంటి పని చేసింది మన భారతీయుడేగా?

600 రూపాయల పల్స్ ఆక్సిమీటర్ ను 3 వేలకు అమ్మేది తోటి భారతీయుడేగా?

కరోనా పేషెంట్ ని రెండుగంటల దూరం ఉన్న హాస్పిటల్ చేర్చడానికి లక్ష (ప్రైవేట్అంబులెన్సెస్) అడిగింది మన భారతీయుడేగా?

800 రూపాయల రేమిడిసివిర్ ను 40వేలు కి అమ్మేది మన భారతీయుడేగా?

40వేలు విలువ చేసే తొలసిజుమాబ్ ఇంజక్షన్ 10 లక్షలకు బ్లాక్ మార్కెట్ చేసేది మన భారతీయుడేగా?

రోగుల అస్సహాయ స్థితిని ఆదాయవనరుగా చూస్తున్న కొన్ని కార్పొరేట్ హాస్పిటల్స్ ను నడిపేది మన భారతీయుడేగా?

చివరికి కరోనా మృతుల అంత్యక్రియలను కూడా వ్యాపారంగా మార్చింది మన భారతీయుడేగా?

ప్రపంచంలో ఈ సమయంలో ఇంత అరాచకం ఎక్కడన్నా ఉందా?

మన దగ్గర ఇంత కుళ్ళు పెట్టుకొని, ప్రభుత్వం ఏదో చెయ్యలేదు, డబ్బులు ఉన్న పెద్దవాళ్ళు సాయం చెయ్యటం లేదు అని వాపోవటం ఎందుకు?

దేశమంటే మట్టికాదోయ్,
దేశమంటే మనుషులోయ్ అని గురజాడ వారు చెప్పినట్లు
మనిషిలో మార్పు రానంత వరకు, వ్యవస్థల్లో మార్పురాదు, ఈ దేశం బాగుపడదు. ప్రధానమంత్రి గారు ఒక్కరే ఏమి చేయగలరు ?

                                                                                    – డాక్టర్ మల్లీశ్వరి