వ్యాక్సిన్ల కోసం పలుకుబడి ఉపయోగిస్తావా బాబూ..!

334

భారత్ బయోటెక్ రామోజీ బంధువులదే..వ్యాక్సిన్ల కోసం పలుకుబడి ఉపయోగిస్తావా బాబూ..!
– రాష్ట్రానికి సరిపడా కోవాగ్జిన్ ఇండింట్, డబ్బు ఎవరికి పంపించాలో చెప్పండి చంద్రబాబూ..!
– వ్యాక్సిన్ కోసం పలుమార్లు ప్రధానితో చర్చించిన సీఎం  జగన్.. భారత్ బయోటెక్ కు సీఎం నేరుగా ఫోన్
– వ్యాక్సిన్‌ కేటాయింపులు పూర్తిగా కేంద్రం చేతుల్లోనే వున్నాయి
– రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్లు ఎప్పటికప్పుడు ఉచితంగా వేస్తున్నాం

“వ్యాక్సిన్లు ఎందుకు వేయటం లేదని రోజూ పని గట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం పై దుష్ప్రచారం చేస్తున్న చంద్రబాబు, ఆయన అనుకూల మీడియాను సూటిగా ప్రశ్నిస్తున్నాం. కోవాగ్జిన్ రామోజీ బంధువులదే కదా.., మీ  పలుకుబడిని ఉపయోగించి రాష్ట్రానికి సరిపడా వ్యాక్సిన్లు ఇప్పిస్తారా  చంద్రబాబూ…” అని వ్యవసాయ శాఖ మంత్రి  కురసాల కన్నబాబు సూటిగా ప్రశ్నించారు.

రాష్ట్రానికి సరిపడా కోవాగ్జిన్ వ్యాక్సిన్లు ఇప్పిస్తామని భారత్ బయోటెక్ నుంచి లేఖ ఇప్పిస్తే… ఇండింట్, డబ్బు ఎవరికి పంపించాలో చెబితే వారికి పంపిస్తామని మంత్రి తెలిపారు. కేంద్ర మార్గదర్శకాల ప్రకారం రాష్ట్రంలో 18 ఏళ్ళకు పైబడ్డ ప్రతి ఒక్కరికీ ఉచితంగా వ్యాక్సిన్ వేసేందుకు ఈ ప్రభుత్వం సిద్ధంగా ఉందని, ఇందుకు అవసరమైన వ్యాక్సిన్ల కోసం ఇప్పటికే ముఖ్యమంత్రి  జగన్ మోహన్ రెడ్డి పలుమార్లు ప్రధానితో చర్చించారని, భారత్ బయోటెక్ కంపెనీ యాజమాన్యంతో సీఎం నేరుగా ఫోన్ చేసి మాట్లాడారని తెలిపారు.

వ్యాక్సిన్లు పూర్తిగా కేంద్రం పరిధిలోనే ఉన్నాయని తెలిసికూడా, అబద్ధాలు ప్రచారం చేసి, ప్రభుత్వంపై దుష్ప్రచారం చేస్తున్న మీ దిగజారుడుతన రాజకీయం పతనానికి పరాకాష్ట అని చంద్రబాబుపై మంత్రి కన్నబాబు ధ్వజమెత్తారు. ప్రతిపక్ష నేత చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన అతిపెద్ద వైరస్ అని  కన్నబాబు విమర్శించారు. కాకినాడలోని క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ జాతీయ విపత్తులోనూ బాధ్యతగా వ్యవహరించకుండా చంద్రబాబు సిగ్గుమాలిన రాజకీయం చేస్తున్నాడని మండిపడ్డారు.

–   కరోనాను ఎదుర్కోనేందుకు సీఎం  వైయస్ జగన్   ప్రణాళికాబద్ధంగా చర్యలు తీసుకుంటున్నారు. వైద్యులు, సిబ్బంది కొరత లేకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. ఆక్సీజన్ అందుబాటులోకి తీసుకురావడం, కోవిడ్ కేర్ సెంటర్లను పెంచడం ద్వారా ప్రజలకు భరోసా కల్పిస్తున్నారు. మంచికోసం యజ్ఞం జరుగుతూ వుంటే… దానిని భగ్నం చేసే రాక్షసుల్లా ప్రతిపక్షనేత చంద్రబాబు వ్యవహరిస్తున్నాడు.

– కోవిడ్ నియంత్రణకు ప్రభుత్వం చేస్తున్న యజ్ఞంను నాశనం చేసేలా చంద్రబాబు అబద్దాలు, వదంతులతో ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. నిత్యం పక్కరాష్ట్రంలో ఉండి జూమ్‌ కాన్ఫెరెన్స్‌ల ద్వారా వదంతులను వ్యాప్తి చేస్తున్నాడు.

–   విపత్తు సమయంలో ప్రతిపక్ష నేతగా బాధ్యతగా వ్యవహరించకుండా, తన పార్టీ శ్రేణులతో ఉద్యమాలు చేయించడం దారుణం.

– ఎన్‌ 440 కె అనే వేరియంట్ కర్నూలు నుంచి వ్యాపిస్తోందని స్వయంగా చంద్రబాబు  ప్రచారం చేశాడు. చివరికి జాతీయ మీడియాలోనూ టిడిపి నాయకులు దీనిని ప్రచారం చేయడం వల్ల నేడు ఇతర రాష్ట్రాలు మన ప్రజల పట్ల అనుమానంతో చూస్తున్నాయి. ఒకవైపు సైంటీస్ట్‌లు, సిసిఎంబి, కేంద్రప్రభుత్వ రంగ సైంటీస్ట్‌లు ఇది నిజం కాదు, పచ్చి అబద్దం అని పదేపదే చెబుతున్నా కూడా వినకుండా కర్నూలు వేరియంట్‌ పేరుతో వదంతులు వ్యాప్తి చేశాడు.

– చంద్రబాబు ఒక ఉగ్రవాదిలా సైంటీస్ట్‌లు చెప్పిన దాన్ని కూడా పట్టించుకోకుండా.. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నాడు. ఇలాంటి అబద్దాలు చెప్పే వారిని కట్టడి చేయాలని, కేసులు పెట్టాలని ప్రజలు కోరుకుంటున్నారు.

–   చంద్రబాబు ఈ రాష్ట్రానికి పట్టిన ఒక పెద్ద వైరస్. తన రాజకీయం కోసం ఏదైనా చేస్తాడు, ఎలాంటి అబద్దాన్ని అయినా ప్రచారం చేస్తాడు. జీవిత కాలంలో ఇలాంటి విపత్తు ఎదురవుతుందనే అంచనా వేయలేని పరిస్థితుల్లో ఈ ప్రభుత్వానికి సరైన సలహాలు ఇవ్వాలనే కనీస ఇంగిత జ్ఞానం కూడా ఆయనకు లేదు.

– ఈ రాష్ట్రంలో అశాంతిని చంద్రబాబు కోరుకుంటున్నాడు. ఎక్కువ మంది ప్రాణాలు కోల్పోతే, సీఎం  వైయస్ జగన్ కి అపప్రథ రావాలని కోరుకుంటున్నాడు. చంద్రబాబు సిగ్గూశరం వదిలేసి, దుర్మార్గంగా ప్రవర్తిస్తున్నాడు. ప్రస్తుతం ఈ రాష్ట్రంలో వైరస్‌కు, మనిషికి మధ్య పోరాటం జరుగుతుందో… చంద్రబాబుకు, ప్రభుత్వానికి మధ్య పోరాటం జరుగుతుందో అర్థంకాని స్థితి కల్పించాడు.

– చంద్రబాబు చెప్పే అబద్దాలు, వదంతులను ప్రజలు నమ్మవద్దని కోరుతున్నాం.

–   చంద్రబాబు పిలుపుతో టిడిపి నేతలు వ్యాక్సిన్లు వేయాలంటూ ప్లకార్డులు పట్టుకుని, తమ ఇళ్ళలో ఫోటోలకు ఫోజులు ఇస్తూ నిన్న ధర్నాలు చేశారు. 14 ఏళ్ళు సీఎంగా చేసిన వ్యక్తికి వ్యాక్సిన్‌లు ఎవరు కేటాయిస్తున్నారో కనీసం తెలియదా? ఆమాత్రం జ్ఞానం లేదా? నిమిషానికి ఒకరు చనిపోతున్నా ఈ సీఎంకు పట్టడం లేదంటూ ధర్నాల్లో తప్పుడు ప్రచారం చేయించాడు. ఈ దేశంలో సీరం, భారత్ బయోటెక్‌లు మాత్రమే కోవిడ్ వ్యాక్సిన్ ఉత్పత్తి చేస్తున్నాయి. కేంద్రప్రభుత్వ ఆదేశాల మేరకే రాష్ట్రాలకు ఆ వ్యాక్సిన్లు కేటాయిస్తున్నారు. వ్యాక్సిన్ ఇస్తామన్నా కూడా ఈ ప్రభుత్వం కమీషన్ల కోసం కొనుగోలు చేయడం లేదంటూ అచ్చెన్నాయుడు సిగ్గుమాలిన అబద్దాలతో విమర్శలు చేశాడు.

–   జీనోమ్ వ్యాలీని తానే సృష్టించానని, భారత్ బయోటెక్ ఈ రోజు వ్యాక్సిన్ తయారవ్వడానికి తాను ఇచ్చిన సహకారమే కారణమని చంద్రబాబు రోజూ చెప్పుకుంటున్నాడు. ఈ రాష్ట్రానికి చెందిన భారత్ బయోటెక్ చంద్రబాబుకు వత్తాసు పలికే ఈనాడు అధినేత రామోజీరావు బంధువులదే. రామోజీరావు కుమారుడి వియ్యంకుడికి చెందిన భారత్‌బయోటెక్‌ నుంచి చంద్రబాబు తన పలుకుబడి ఉపయోగించి ఈ రాష్ట్ర ప్రజలకు వ్యాక్సిన్‌ ఇప్పించగలడా? రాష్ట్రానికి సరిపడా మొత్తం వ్యాక్సిన్లు ఇప్పిస్తామని భారత్ బయోటెక్ నుంచి లెటర్ ఇప్పిస్తానంటే, అందుకు అవసరమైన ఖర్చు రూ.1600 కోట్లు చంద్రబాబు చెప్పిన వారి ఖాతాలో జమ చేయడానికి ప్రభుత్వం సిద్దంగా వుంది. ఎవరికి ఇండెంట్ పంపాలో చంద్రబాబు చెప్పాలి. వ్యాక్సిన్ ఖర్చుకు అదనంగా వాళ్ళు చేస్తున్న దానికి ఇంకా  డబ్బు ఇవ్వాలన్నా చంద్రబాబుకు ఇచ్చేందుకు ఈ ప్రభుత్వం సిద్దంగా ఉంది.

–   దేశంలోని 130 కోట్ల జనాభాకు వ్యాక్సిన్లు వేయాలంటే ఎంత సమయం పడుతుంది? అనే అంచనా ప్రకారం, కేంద్రం అన్ని రాష్ట్రాలకు వ్యాక్సిన్ కేటాయిస్తోంది. జూలై, ఆగస్టు నాటికి తమ ఉత్పత్తి పెంచకుంటామని రెండు కంపెనీలు చెబుతున్నాయి. ఆ మేరకు రెండు కంపెనీలు నెలకు 16 కోట్లకు తమ ఉత్పత్తిని పెంచడం, రష్యా నుంచి స్ఫుత్నిక్ వ్యాక్సిన్ కూడా వస్తే వ్యాక్సిన్ల కొరత చాలా వరకు తగ్గుతుంది. ఇది వాస్తవ పరిస్థితి. ఈ రాష్ట్రంలో 18-45 సంవత్సరాల వయస్సు వున్న వారికి ఉచితంగా రాష్ట్రప్రభుత్వం వ్యాక్సిన్ వేసేందుకు ఎంత ఖర్చు అయినా, దానిని భరించేందుకు ప్రభుత్వం సిద్దంగా వుందని సీఎం  వైయస్ జగన్   ప్రకటించారు.

–  టిడిపి రాష్ట్ర అధ్యక్షుడుగా అచ్చెన్నాయుడు సిగ్గూశరం లేకుండా, ప్రజల పట్ల బాధ్యత లేకుండా మాట్లాడుతున్నాడు. ఈ రాష్ట్రానికి నాలుగు కోట్ల టీకాలు కావాలని భారత్ బయోటెక్ సంస్థకు సీఎం గారు స్వయంగా ఫోన్ చేసి మాట్లాడారు. అధికారులు కూడా వివిధ స్థాయిల్లో లేఖలు రాశారు. ఈనెల 24వ తేదీ రాసిన లేఖలో మాకు 4.08 కోట్ల  కోవిడ్ వ్యాక్సిన్ కావాలని కోరాం. ఈ రాష్ట్రంలో 18-45 వయస్సు వున్న 2.04 జనాభాకు వ్యాక్సిన్ల కోసం మీరు చెప్పిన కమర్షియల్ రేట్లు చెల్లిస్తామని ఆ లేఖలో కోరాం. దీనిపై భారత్ బయోటెక్  స్పందిస్తూ కోవాగ్జిన్ 3,43,930 యూనిట్లు ఎపికి సరఫరా చేయమని కేంద్రం చెప్పిందని, దాని ప్రకారం 1.25 లక్షల యూనిట్లు సరఫరా చేస్తున్నామని ఈ నెల 4వ తేదీన లేఖ రాసింది.

– మనం అడిగే 4 కోట్లు ఎక్కడ, వచ్చే లక్షా పాతిక వేల డోసులు ఎక్కడ? ఇవి ఎలా ప్రజలందరికీ సరిపోతాయి? అలాగే మే 1వ తేదీ నుంచి 9,91,700 కోవిషీల్డ్  వ్యాక్సిన్లు అందిస్తామని కేంద్రం చెప్పింది. మొదటి డోస్ వేసుకున్న వారికి రెండో డోస్ సకాలంలో వేయాల్సి వుంది. ప్రాధాన్యతగా వారికి రెండో డోస్ అందించాలని సీఎం గారు నిర్ణయం తీసుకున్నారు. ఈ నెలాఖరు నాటికి 45 ఆపై వయస్సు వారికి రెండోడోస్ కూడా పూర్తి చేయబోతున్నాం.

–   ఈ దేశంలో ఒక్కరోజులో ఆరు లక్షల వ్యాక్సినేషన్ చేయించిన ఏకైక ప్రభుత్వం మనది. మరే రాష్ట్రానికి ఇటువంటి సామర్థ్యం లేదు.   వైయస్ జగన్ అధికారంలోకి రాగానే వాలంటీర్, సచివాలయ వ్యవస్థలను  తీసుకురావడం వల్ల ఇది సాధ్యమైంది. వాస్తవాలు ఇలా వుంటే చంద్రబాబు, అచ్చెన్నాయుడు, లోకేష్‌లు ఇష్టారాజ్యంగా అబద్దాలు ప్రచారం చేస్తున్నారు. సులువుగా వ్యాక్సిన్ దొరుకుతున్నా, ఈ ప్రభుత్వం కొనుగోలు చేయడం లేదనే విధంగా మాట్లాడుతున్నారు. వ్యాక్సిన్ల కోసం ప్రజలు బారులు తీరారంటూ తమ అనుకూల ఎల్లో మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతిలో పతాక శీర్షికల్లో వార్తలు రాయిస్తున్నారు. ప్రజలను భయబ్రాంతులకు గురి చేస్తున్నారు.

–   ఈ రాష్ట్ర జనాభా 5.30 కోట్లు, దానిలో 3.48 కోట్ల మంది వ్యాక్సిన్‌కు అర్హులు. ప్రతిరోజూ ఆరు లక్షల డోస్‌లు వేసి ఎంత వేగంగా ఈ రాష్ట్రాన్ని వ్యాక్సినేటెడ్ స్టేట్‌గా చేయాలని సీఎంగారు తపిస్తున్నారు. ఈ రాష్ట్రానికి మొత్తం 6.90 (రెండు డోసులు కలిపి) డోసులు కావాలి, అయితే ఇప్పటి వరకు వచ్చినవి 73.49 లక్షల డోసులు మాత్రమే. దీనిలో మే 6 తేదీ వరకు మొదటి డోసు వ్యాక్సిన్ వేసుకున్న హెల్త్ కేర్ వర్కర్లు 4,25,971 కాగా, రెండో డోసు వేయించుకున్నవారు 2,82,654 మంది.
45 ఏళ్ళు పై బడిన వారు 41,41,985 మంది మొదటి డోస్ వ్యాక్సిన్ వేయించుకున్నారు. వీరిలో 11,61,441 మంది రెండో డోస్ వేయించుకున్నారు.  మిగిలిన వారికి కూడా ప్రణాళికాబద్ధంగా వ్యాక్సిన్ వేయించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటోంది. ఇది వాస్తవ పరిస్థితి.