వ్యాక్సిన్ పై సర్వ హక్కులూ కేంద్రం చేతిలోనే ఉన్నాయి

234

– సుప్రీంకు అఫిడవిట్ లోనే స్పష్టం చేసిన కేంద్రం
– బాబూ.. ఇంతకీ నీవు, నీ కొడుకు టీకా వేయించుకున్నారా..!?
– వ్యాక్సిన్ వస్తే.. ముందు మీ అమ్మ, నాన్నలకు వేయిస్తావా.. లేక నీవే వేసుకుంటావా లోకేష్..?-  వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు) సజ్జల రామకృష్ణారెడ్డి   

కోవిడ్ వ్యాక్సిన్లు, ఆక్సీజన్, మందుల సరఫరా- వాటి పర్యవేక్షణపై గత పదిరోజులుగా చంద్రబాబు, టీడీపీ, ఆ పార్టీ అనుకూల మీడియా పనిగట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం, ముఖ్యమంత్రి  జగన్ పై చేస్తున్న దుష్ప్రచారానికి.. డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్ అండ్ సర్వీసెస్ కు సంబంధించి కేంద్రం ఈరోజు సుప్రీంకోర్టుకు సమర్పించిన అఫిడవిట్ తో తెరపడిందని వైయస్ఆర్సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు(ప్రజా వ్యవహారాలు)  సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు. వ్యాక్సిన్ పై సర్వ హక్కులూ కేంద్రం చేతిలోనే ఉన్నాయని, ఈ విషయం సుప్రీంకోర్టులో వేసిన అఫిడవిట్ లోనే కేంద్రం స్పష్టం చేసిందని తెలిపారు. వాస్తవాలను వక్రీకరించి రాష్ట్ర ప్రభుత్వం వ్యాక్సిన్లు కొనటం లేదంటూ చంద్రబాబు, ఎల్లో మీడియా దుష్ప్రచారాలు చేస్తున్నాయని మండిపడ్డారు.  సుప్రీంకు కేంద్రం ఇచ్చిన అఫిడవిట్ ను చదివి మాట్లాడండి అని సజ్జల హితవు పలికారు.

దేశాన్ని వణికిస్తోన్న కోవిడ్ మహమ్మారి నేపథ్యంలో డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ఎసెన్షియల్ సప్లైస్ అండ్ సర్వీసెస్ కు సంబంధించి సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించిన కేసులో.. వ్యాక్సిన్ల ఉత్పత్తి, రాష్ట్రాల జనాభాను బట్టి ఆయా రాష్ట్రాలకు నెలవారీ వ్యాక్సిన్ల సరఫరా, కేంద్ర టాస్క్ ఫోర్స్ ద్వారానే రాష్ట్రాలకు ఎంత మేర ఆక్సీజన్, మందులు, వ్యాక్సిన్లు ఇవ్వాలో పర్యవేక్షిసున్నామని కేంద్ర ప్రభుత్వం అఫిడవిట్ రూపంలో తెలియజేసిందని తెలిపారు.  సుప్రీంకోర్టుకు కేంద్రం సమర్పించిన అఫిడవిట్ లో, ఈ అంశాలపై రాష్ట్రాలకు ప్రత్యేక హక్కులేమీ లేవని, పూర్తిగా కేంద్రం పర్యవేక్షణలోనే ఇవన్నీ జరుగుతున్నాయని 19వ పేజీలోని 16వ పాయింట్, అలానే 186 పేజీలోని కేంద్రం ఏర్పాటు చేసిన టాస్క్ ఫోర్స్ అంశాలను ఈ సందర్భంగా సజ్జల మీడియాకు చదివి వినిపించారు.

1.  వాస్తవం ఇలా ఉంటే… ప్రతిపక్ష నేత చంద్రబాబు, టీడీపీ నేతలు, వారికి పొద్దున లేచిన దగ్గర నుంచి అర్థరాత్రి వరకు భజన చేస్తూ అబద్ధాలను ప్రచారం చేస్తున్న వారి అనుకూల మీడియా ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ 5, ఈటీవీలు..  వ్యాక్సిన్ కొనుగోలుకు రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ తీసుకోవడం లేదని, డబ్బులు కేటాయించడం లేదని, ఇక వ్యాక్సిన్లు కష్టమేనని, అందుకే మరణాలు సంభవిస్తున్నాయని దుష్ప్రచారం చేస్తోంది. దాంతో లేనిపోని భయాలు తలెత్తి వ్యాక్సినేషన్ సెంటర్లకు జనం పెద్దఎత్తున హాజరవ్వడం, దానివల్ల కోవిడ్ మరింత వ్యాప్తి చెందేందుకు అవకాశం ఏర్పడటం జరుగుతుంది. వీరి దుష్ప్రచారం ఎంత స్థాయికి వచ్చిదంటే.. కమీషన్ల కోసం, ప్రజల ప్రాణాలను ఫణంగా పెడుతున్నారని  టీడీపీ నేతలు బరితెగించి మాట్లాడుతున్నారు. వాస్తవాలేమిటో, రాష్ట్ర మంత్రులు, ప్రభుత్వ అధికారులు రోజూ మీడియా సమావేశాలు పెట్టి, కేంద్రానికి రాసిన లేఖలు, రాష్ట్రానికి వచ్చిన వ్యాక్సిన్లు, ఆక్సీజన్ సరఫరా, మందులు సరఫరా అన్నీ ఆధారాలతో సహా చెబుతున్నా… ఎల్లో ముఠాల గుంపుగా తయారైన టీడీపీ, దాని అనుకూల మీడియా ప్రజలను మరింత రెచ్చగొట్టి, రోడ్ల మీదకు తీసుకువచ్చి.. కోవిడ్ వ్యాప్తి చేసి, వారి ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నాయి. ఈ గుంపు కుట్రలు చూస్తుంటే.. రాష్ట్రంలో ప్రజలు బతకాలని అనుకోవడం లేదనిపిస్తుంది. ప్రజలను రెచ్చగొట్టి, రోడ్ల మీదకు తీసుకొచ్చి, కోవిడ్ వ్యాప్తి చేయాలని చూస్తున్న ఈ పచ్చ గుంపుకు ఏ శిక్ష వేయాలి..?

2. కోవిడ్ లాంటి మహమ్మారి ప్రజల ప్రాణాలను తోడేస్తున్న ఈ సంక్షోభ సమయంలో..  ప్రభుత్వ యంత్రాగానికి, ప్రభుత్వానికి మద్దతుగా నిలబడి, మంచి సలహాలు ఇచ్చి, సివిల్ సొసైటీని ముందుకు తీసుకెళ్ళాల్సిన బాధ్యత కలిగిన ప్రతిపక్షం, ఒక వర్గం మీడియా ఇందుకు విరుద్ధంగా ప్రజలను రెచ్చగొట్టి, రాష్ట్రంలో మరింత సంక్షోభం తేవాలని కుట్రలు పన్నడం ఏమిటి..? ప్రతి దానినీ, ప్రతి సంక్షోభాన్ని అవకాశంగా మలచుకోవడం, దానిని డబ్బుగా ఎలా మార్చుకోవాలో గత 5 ఏళ్ళ పదవీకాలంలో బాగా వంటబట్టించుకున్న చంద్రబాబు, దానిని దృష్టిలో ఉంచుకునే ఈ సంక్షోభంలోనూ ఇటువంటి దుష్ప్రచారం చేస్తున్నాడు.

3. మన ఇంట్లో ఏదైనా సమస్య వస్తే.. మనసు పెట్టి, ఎలాంటి తపనతో పనిచేస్తామో… అలానే ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు అధికార యంత్రాంగం మొత్తాన్ని క్షేత్రస్థాయిలోకి దించి కోవిడ్ మహమ్మారిని సమర్థవంతంగా ఎదుర్కొంటున్నారు. కేంద్రానికి పదే పదే లేఖలు రాసి వ్యాక్సిన్ లు తెప్పించడం దగ్గర నుంచి ఆక్సీజన్ సరఫరా పెంచడం, ఆసుపత్రుల్లో బెడ్లు పెంచడం, కొత్తగా డాక్టర్లు, సిబ్బందిని నియమించి ప్రజల ప్రాణాలను కాపాడటం కోసం, ముఖ్యమంత్రి, ప్రభుత్వయంత్రాంగం అంతా సమన్వయంతో పనిచేస్తుంటే.. చంద్రబాబు, ఎల్లో మీడియా బండలు వేస్తుంది.
– ప్రపంచ వ్యాప్తంగా వ్యాక్సిన్ డీ లైసెన్సింగ్ చేసే  విషయంపై .. డబ్ల్యుటీవోలోనూ చర్చలు జరుగుతున్నాయి. భారత్ బయోటెక్ వ్యాక్సిన్ పేటెంట్‌పై కేంద్రానికి కూడా హక్కు ఉంది. భారత్ బయోటెక్ పేటెంట్‌ను డీ లైసెన్సింగ్ చేసి ఉత్పత్తి  పెంచేందుకు.. కేంద్రానికి సీఎం వైఎస్ జగన్ లేఖ కూడా రాస్తారు. ప్రభుత్వానికి సలహాలు ఇవ్వాల్సిన బాధ్యతను వదిలేసి.. జూమ్‌లో ప్రజలను చంద్రబాబు రెచ్చగొడుతున్నారు. రామోజీరావు బంధువు భారత్ బయోటెక్ నుంచి వ్యాక్సిన్ ఇప్పించవచ్చు. మరోవైపు ఆక్సీజన్ సామర్థ్యాన్ని పెంచుకునేందుకు నేవీ, ఇతర రాష్ట్రాలతో మాట్లాడి తెప్పించుకుంటున్నాం. రాష్ట్రానికిసరిపడా వ్యాక్సినేషన్, ఆక్సిజన్, రెమిడెసివర్ లాంటి మందులు ఎలా తెప్పించాలని అధికార యంత్రాంగం అంతా పనిచేస్తుంది.

4. దేశంలో ఎక్కడా లేని విధంగా కోవిడ్ ను సైతం ఆరోగ్య శ్రీ కింద చేర్చి.. లక్షల మంది వైద్య సేవలు అందిస్తున్నఏకైక ప్రభుత్వం ఇది. గతంలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉండగా, రూ. 600 కోట్లు ఆరోగ్యశ్రీ బకాయిలు పెట్టి వెళ్ళారు. వాటిని కూడా తీర్చిన ఘనత ఈ ప్రభుత్వానిదే.
– ఏ రాష్ట్రంలో లేని విధంగా 104 లాంటి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేసి, రోగులకు 24 గంటలూ సేవలందిస్తూ, 10 నుంచి 15 వేల ఆక్సీజన్ బెడ్స్ పెంచి,  16నుంచి20 వేల మందికి పైగా డాక్టర్లను, సిబ్బందిని రిక్రూట్ చేసి ప్రజల ప్రాణాలను కాపాడేందుకు ఈ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తుంది. వ్యాక్సిన్లు సరఫరా చేస్తే.. ప్రతి రోజు 6 లక్షల వ్యాక్సిన్లు వేసే సామర్థ్యం ఏపీకి ఉంది. నెల రోజుల్లో వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేస్తాం.

5. కోవిడ్ బారిన పడకుండా కర్ఫ్యూ విధించి, ఎప్పటికప్పుడు ప్రజల్ని చైతన్యవంతుల్ని చేస్తూనే, వ్యాక్సినేషన్ పై ఒక భరోసా ఇచ్చి రాష్ట్రంలో 18 ఏళ్ళు పైబడిన వారందరికీ దశల వారీగా వ్యాక్సిన్ వేసేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ప్రయత్నిస్తుంటే.. చంద్రబాబు ఆ పని చేయనిస్తే కదా..?
– రిస్క్ ఎక్కువ ఉన్న 45-60 ఏళ్ళ వయసు కలిగిన వారికి తొలి ప్రాధాన్యంగా వ్యాక్సిన్ లు వేయాలని చూస్తున్నాం. వీరికి రెండో డోస్ వేసేందుకే ప్రస్తుతం వ్యాక్సిన్లు సరిపోకుంటే… 18-45 ఏళ్ళ వయసు వారికి ఎందుకు వేయడం లేదని చంద్రబాబు, ఎల్లో మీడియా ప్రజల్ని రెచ్చగొట్టడం ఏంటి?  ప్రజల ప్రాణాలకు సంబంధించిన నిర్ణయం తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఒక ప్రణాళికబద్ధంగా ప్రభుత్వం పనిచేస్తుంది.
– మన కుటుంబంలో పెద్దవాళ్ళను ఎలా చూసుకుంటామో.. అదే ప్రాధాన్యత ఇద్దామనుకుంటే, దానిపైనా గొడవ చేసి యువకులను రెచ్చగొట్టాలని చూశారు.
– చంద్రబాబు,  లోకేష్ వ్యాక్సిన్ లు వేసుకున్నారో లేదో తెలియదు. వ్యాక్సిన్ వస్తే, ముందుగా మీ నాయనకో, అమ్మకో ఇప్పిస్తావా, లేక వారికంటే ముందుగా నీవే వ్యాక్సిన్ వేసుకుంటావా లోకేష్…? ఒకవేళ 45 ఏళ్ళ లోపు వయసు ఉన్న వారు దొడ్డిదారిన వ్యాక్సిన్  వేసుకున్నా అది తప్పే అవుతుంది.

6. రాష్ట్రంపై ఇన్ని దుర్మార్గాలు, కుట్రలు చేస్తున్న చంద్రబాబును అనటానికి ఎలాంటి మాటలు కూడా లేవు. ఉన్మాదం ఎక్కినవాడికి సహజంగా కుట్రలు ఉండవు. ఒకవైపు ఉన్మాదం.. మరోవైపు కుట్రలతో చంద్రబాబు తలకాయ నిండా విషం నింపుకున్న వ్యక్తిలా వ్యవహరిస్తున్నాడు. ఆయన పెంపకంలో పెరిగిన కొడుకు, ఎన్టీఆర్ తర్వాత పార్టీని తన గుప్పిట్లోకి తీసుకుని ఆ పార్టీ నేతల్ని, తన అనుకూల మీడియాను కూడా అలానే తయారు చేస్తున్నాడు.
– ప్రపంచ చరిత్రలో మురికి గుంటలో, దానిలో మాత్రమే శ్వాస పీల్చగలిగే క్రిములు ఏమైనా ఉంటే.. అలాంటి తెగకు చెందిన వ్యక్తి చంద్రబాబు. చంద్రబాబును ఈ మాటలు అనాలంటే బాధగా ఉంది, ఎందుకంటే ఆయన మా అందరికంటే సీనియర్ నాయకుల్లో ఒకరు.

7. కేంద్రం నియంత్రణలో ఉన్న వ్యాక్సినేషన్ గురించి రాష్ట్ర ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి దురుద్దేశాలు ఆపాదించి విమర్శలు చేయడం ఏమిటి..?
– నోరు తెరిస్తే చంద్రబాబు, ఆయన కొడుకు జగన్ రెడ్డి అనటం ఏమిటి..? ముఖ్యమంత్రి గారు అని అనలేరా…? అలా పిలవటం ద్వారా ప్రజలకు మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు…? రేపటి నుంచి బాబు నాయుడు అని మేం కూడా అంటాం.
– ఇది చంద్రబాబు, మాకు మధ్య జరిగే రాజకీయ యుద్ధం కాదు. ఇదొక రాష్ట్ర ప్రభుత్వం, 5 కోట్ల మంది ప్రజల ప్రాణాలు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ జనం చావు బతుకుల సమస్య. రాష్ట్ర ప్రభుత్వాన్ని నిబ్బరంగా పనిచేసుకోనివ్వాల్సిన పరిస్థితుల్లో బండలు వేసి, వ్యవస్థలను ఛిన్నాభిన్నం చేయాలని చూస్తున్నారు. వ్యాక్సినేషన్ సెంటర్లపై జనం పెద్దఎత్తున వచ్చి పడుతున్నారంటే, చంద్రబాబు రెచ్చగొట్టడం, ఆయన క్రియేట్ చేసిన భయానక వాతావరణం వల్లే.
– వ్యాక్సిన్లపై చంద్రబాబు ప్రజల్ని రెచ్చగొట్టడం అంటే.. ఇది దేశ ద్రోహం, రాజద్రోహం కిందకే వస్తుంది.
– ప్రజలను రెచ్చగొట్టి, కోవిడ్ వ్యాప్తికి కారణమై, మాస్ మర్డర్స్ వైపు చంద్రబాబు రాష్ట్రాన్ని తీసుకువెళ్ళాలనుకుంటున్నాడు.
– వీటిమీద ఎక్కడికక్కడ కేసులు పెట్టండి, నిలదీయండి అని చెబుతున్నాం. కుట్రపూరితంగా వ్యవహరిస్తూ, సమాజం మొత్తాన్ని ఇబ్బందుల్లోకి నెడుతున్న కొన్ని మీడియా సంస్థల పై కూడా మేం కూడా కేసులు పెడతాం.
– విజ్ఞులు, మేధావులు, పౌర సమాజాన్ని కూడా ప్రశ్నిస్తున్నాం. మీరూ రియాక్ట్ అవ్వాలి. ఇటువంటి వ్యక్తులపైన, మీడియా సంస్థలపైన కేసులు పెట్టాలి.