పేలుళ్లలో చనిపోయిన ఒకొక్కరికి రూ. కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి

412

అనుమతి లేకున్నా మైనింగ్ చేయిస్తున్న అధికారులను సస్పెండ్ చేయాలి.
మైనింగ్ ఓనర్ పై 302 సెక్షన్  కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలి.
అక్రమ మైనింగ్ ద్వారా వచ్చిన  నిధుల్ని ప్రభుత్యం స్వాధీనం చేసుకోవాలి.
అక్రమ బైరటీస్ క్వారీ ప్రాంతాన్ని పరిశీలించిన మల్లెల, రెడ్యo

– కలసపాడు మండలం మామిళ్లపల్లె సమీపంలోని బైరటీస్ మండుగుండు పేలుళ్ళతో చనిపోయిన ఒక్కొక్కరికి రూ. కోటి రూపాయల పరిహారం చెల్లించడం తోపాటు అక్రమ  మైనింగ్ చేస్తున్న మైన్ ఓనర్ నుండి అక్రమంగా తరలించిన ముగ్గురాళ్లకు సంబందించిన కోట్ల రూపాయల నిధుల్ని తక్షణం ప్రభుత్యo స్వాధీనం చేసుకోవాలని తెదేపా కడప పార్లమెంట్ అధ్యక్షుడు మల్లెల లింగారెడ్డి, తెదేపా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి రెడ్యo వెంకటసుబ్బారెడ్డి డిమాండ్ చేసారు. మందుగుళ్ళు పేలుళ్ళతో 10 మంది చనిపోయిన బైరటీస్ క్వారీని ఆదివారం ఉదయం రెడ్యo, మల్లెల లింగారెడ్డి కలిసి పెద్ద ఎత్తున పాల్గొన్న  తెదేపా శ్రేణులతో కలిసి పరిశీలించి, సంఘటన గూర్చి ఆరా తీశారు.

అనంతరం రెడ్యo, మల్లెల విలేకరులతో మాట్లాడుతూ బైరాటీస్ క్వారికి సంబంధించి పర్మిషన్ రద్దు చేసినా అక్రమంగా  మైనింగ్ చేస్తున్నప్పటికి మైనింగ్ అధికారులు మైనింగ్ ఓనరతో కుమ్మక్కై, లాలూచిపడి చూసి చుడనట్లు వ్యవహరించడంతోనే ఇంతటి ఘోర దుర్ఘటన జరిగిందని వారు ఆగ్రహం  వ్యక్తం చేసారు. అక్రమ మైనింగ్ కు తోడ్పాటు అందించిన మైనింగ్ అధికారులను సస్పెండ్ చేయాలని, వారి అక్రమాలు రుజువు అయితే వారిని ఉద్యోగాల నుంచి శాశ్వతంగా తొలగించాలని డిమాండ్ చేసారు. అక్రమ మైనింగ్ కు పాల్పడిన మైనింగ్ ఓనర్ పై 302 సెక్షన్ కింద కేసు నమోదు చేసి తక్షణం అరెస్ట్ చేయాలని వారు డిమాండ్ చేశారు. తెదేపా ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, మాజీ మంత్రి సిద్దా రఘవరావు తదితరుల నుండి అక్రమ మైనింగ్ పేర కోట్లది రూపాయల ను జరిమానా విధించారని, ఇక్కడ జరిగిన అక్రమ మైనింగ్ పై పూర్తిస్థాయిలో జరిమానా విధించాలని వారు డిమాండ్ చేసారు.మైనింగ్ ఓనర్ వైకాపా నేత ఐనందున పోలీసులు అతనిపై నిర్లక్ష్యధోరణి అవాలంభించకుండా కఠిన వైఖరి అవాలంభించాలని  లేకుంటే తెదేపా పక్షాన తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని రెడ్యo, మల్లెల హెచ్చరించారు. కార్యక్రమంలో పోరుమామిళ్ల  సర్పంచ్ యనమల సుధాకర్, బద్వేల్ మార్కెట్ యార్డ్ మాజీ చెర్మన్ సాధికారి రంతు,  మాజీ సర్పంచ్ ఎస్. ఎం. బాషా, మాజీ ఎంపీటీసీ రసూల్,షరీఫ్, వెంకటసుబ్బయ్య, తెదేపా మండలం అధ్యక్షడు రాజీవబాష, ఈమమ్ హుస్సేన్, తిరుమలశెట్టి సుబ్బారావు,గాలి మురళి మోహన్, మామిళ్లపల్లి కొండారెడ్డి,పెద్ద ఎత్తున తెదేపా శ్రేణులు పాల్గొన్నారు.