నాగ్ సరసన సోనాక్షి

267

కొత్తవారిని, పరభాషా వారిని తెలుగుతెరు పరిచయం చేయటంలో నాగ్ ముందు వరుసలో ఉంటాడు. ఇప్పుడు బాలీవుడ కథానాయిక సోనాక్షి సిన్హాను టాలీవుడ్ కి పరిచయం చేయబోతున్నాడట. నాగార్జున నటించిన ‘సోగ్గాడే చిన్నినాయన’  2015 సంక్రాంతికి విడుదలై సంచలన విజయం సాధించింది.ఇందులో నాగార్జున పోషించిన బంగార్రాజు పాత్రకు అద్భుతమైన స్పందన లభించింది. అందుకే దర్శకుడు కళ్యాణ్ కృష్ణ, నాగార్జున ఆ సినిమాకు సీక్వెల్ తీస్తామని చెప్పారు. అదే పనిలో ఉన్నారు. టైటిల్ కూడా ‘బంగార్రాజు’ అని కన్ఫామ్ చేశారు. అదిగో ఇదిగో అంటూ వస్తున్న ఈ ప్రాజెక్ట్ ఎట్టకేలకు ఈ సంవత్సరం పట్టాలెక్కుతుందని ప్రకటించాడు నాగార్జున. ప్రీప్రొడక్షన్ కూడా మొదలైంది. ఇందులో బాలీవుడ్ నటి సోనాక్షి సిన్హాను ఓ పాత్రకు తీసుకోవాలని భావిస్తున్నారట. నాగ్ కి జోడీగా కొత్తగా ఉంటుందని ఆలోచనట. ఆమెతో చర్చలు కూడా జరుపుతున్నారట. నిజానికి ఈ సినిమా షూటింగ్ జూన్, జూలైలో మొదలెట్టాలనుకున్నారు. ఇప్పుడు కరోనా వేవ్ తో ఎప్పటి నుంచి ఆరంభమవుతుంతో తెలియటం లేదు. అన్నీ కుదిరితే వచ్చే ఏడాది సంక్రాంతి బరిలో సినిమాను నిలపాలన్నది నాగ్ ఐడియా.