ఇప్పుడు చెప్పమనండి !!

318

ఏ కులం గొప్పదో…
ఏ మతం గొప్పదో…?
ఏది ఉన్నతమో…
ఏది నీచమో…?
ఏది బ్రహ్మ శిరోజనితమో..‌
ఏది వక్షోద్భవమో….?
ఏది కరద్వయ సంభవమో….?
ఏది పాదాక్రాంతమో?

మ్లేఛ్చులెవరో..
కాఫిర్లెవరో…
విశ్వాసులెవరో…
అవిశ్వాసులెవరో…..
కారణజన్ములెవరో…
దరిద్రనారాయణులెవరో….
సంఘబహిష్కృతులెవరో…

ఇప్పుడందరూ ఒకటే…!
అందరికీ ఒకటే అవసరం…
ప్రాణం..!
ప్రాణవాయువుకోసం తపించే ప్రాణం…
ఆ ప్రాణదీపం నిలుపుకునే దేహం!

ఆలయప్రాంగణాలు నిర్మానుష్యమైనాయి…
మసీదులు సొమ్మసిల్లాయి…
ప్రార్ధనలు నిర్జనమై విస్తుపోయాయి..
చర్చిగంటలు మూగపోయాయి….

అంతటా కరోనా విలయం…..
మృత్యుఘంటికల ప్రళయనాదం…
ఆత్మీయులను కోల్పోతున్న ఆర్తనాదం….

ఇప్పుడు చేయండి మతోన్మాద రాజకీయాలు…
ఇప్పుడు పలకండి కులగొప్పల డాంబికాలు….
ఇంకెంతకాలం ఈ మోసం…?
ఇంకెంతకాలం ఈ ఆత్మవంచన..?

ఆక్సిజన్ లేక భారతావని మండుతోంది..
చితిమంటల బూడిదకుప్పలతో నిండుకుంది….

అనాథ కుటుంబాల కన్నీటితో మాహానదులు కదులుతున్నాయి….
ప్రాణవాయువులేక రోజూ వేలదీపాలు  ఆరిపోతున్నాయి….

కోటానుకోట్ల జనావళికి ఏదికావాలో .
కులోన్మధ, మతోన్మాద వాదులను ఇప్పుడు కరోనా కు ఎదురుగా నిలబడమని సవాల్, మీలో ఏది గొప్పదో ఇపుడు చెప్పమనండి.

ఇప్పుడు చెప్పమనండి…..?
కులమా…..?
మతమా…..?
ఆక్సిజనా…???

  –  డా. వంశీ.