విశాల్ కొత్త సినిమా ప్రారంభం!

354

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్ 31వ చిత్రం పూజా కార్యక్రమాలతో మొదలైంది. ఈ సినిమాతో షార్ట్ ఫిల్మ్స్ మేకర్ టి.పి. శర్వానన్ దర్శకుడిగా పరిచయం అవుతున్నాడు.దీనికి విశాల్ నిర్మాత.’దేవి -2′ ఫేమ్ డింపుల్ హయతి కథానాయికగా నటిస్తోంది. ప్రస్తుతం డింపుల్ తెలుగులో రవితేజ సరసన ‘ఖిలాడీ’ చిత్రంలో చేస్తోంది. యువన్‌ శంకర్ రాజా ఈ చిత్రానికి స్వరాలు సమకూర్చుతుండగా, బాలసుబ్రమణియన్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నాడు. ప్రస్తుతం ఆనంద్ శంకర్ దర్శకత్వంలో ‘ఎనిమి’ సినిమాలో ఆర్యతో కలిసి విశాల్ నటిస్తున్నాడు. ఇటీవలే ఈ సినిమా షూటింగ్ పూర్తయ్యింది. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ జరుగుతోంది. అలానే మిస్కిన్ దర్శకత్వంలో ‘తుప్పరివాలన్ -2’ చేయాల్సి ఉన్నా, క్రియేటివ్ డిఫరెన్సెస్ కారణంగా ఈ సినిమాకు బ్రేక్ పడింది. దాంతో శరవేగంగా ఈ 31వ చిత్రం షూటింగ్ పూర్తి చేసి, ఆగస్ట్ నెలలో విడుదల చేయాలని విశాల్ భావిస్తున్నాడు.